విదేశీ విద్యపై మొగ్గు చూపని యువత | - | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యపై మొగ్గు చూపని యువత

Published Mon, Apr 21 2025 12:25 AM | Last Updated on Mon, Apr 21 2025 2:30 PM

విదేశీ విద్యపై మొగ్గు చూపని యువత

విదేశీ విద్యపై మొగ్గు చూపని యువత

ట్రంప్‌ కఠిన నిబంధనలతో విద్యార్థిలోకం బెంబేలు

పీజీ ప్రొఫెషనల్‌ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ

ఐసెట్‌, ఏపీఈసెట్‌కు పదిరెట్లు పెరిగిన అప్లికేషన్లు

‘తిరుపతికి చెందిన రవిచంద్ర పేరొందిన ఇంజినీరింగ్‌ కళాశాలలో గత ఏడాది బీటెక్‌ పూర్తి చేశాడు. ఎలాగైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌతర్న్‌ కాలిఫోర్నియాలో పీజీ చేయాలన్న చిరకాల కోరికతో ఏడాది కాలం ఆర్థిక వనరులతోపాటు వీసా ప్రయత్నాలు చేసుకుని సన్నద్ధమయ్యాడు. ఈ ఏడాది ఽఎఫ్‌1 వీసాకు దరఖాస్తు చేసుకుని ఎంతో ఖర్చు పెట్టాడు. కానీ నిరాశ మిగిలింది. వీసాకు అనర్హుడంటూ ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందింది. దీంతో పీజీ సెట్‌కు దరఖాస్తు చేసి ప్రిపరేషన్‌ మొదలు పెట్టాడు.’

విదేశీ విద్య నేటి విద్యార్థుల కల. ట్రంప్‌ కఠిన నిబంధనలు..వీసాలపై ఆంక్షలు.. అనర్హులని తిరస్కరణ.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు అవకాశాలలేమి.. ఆర్థిక సమస్యలు.. ఇంత కష్టపడినా విద్యకు దక్కని భరోసాతో అది యువతకు ఎండమావిగా మారింది. వెరసి.. విద్యార్థిలోకం విదేశీ విద్య వద్దు... స్వదేశీ విద్యే ముద్దు అంటూ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేయడానికి మొగ్గు చూపుతోంది. ఫలితంగా పలు ప్రవేశపరీక్షలకు దరఖాస్తుల సంఖ్య పదిరెట్లు పెరిగింది.

తిరుపతి సిటీ: ట్రంప్‌ అన్నంత పని చేశాడు..స్టూడెంట్స్‌ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంతో పాటు యూఎస్‌ఏలో విద్యనభ్యసిస్తున్న ఇండియన్‌ విద్యార్థులపై ఆంక్షలు విధించి ఇంటికి పంపుతున్నాడు. దీంతో 2025–2026 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కలలు కన్న తెలుగు విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. దీంతో స్వదేశీ విద్యకు డిమాండ్‌ పెరిగింది. ఇటీవల రాష్ట్రంలోని పలు వర్సిటీలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. దీంతో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు ఎగబడుతున్నారు. గత ఏడాదికంటే పీజీ సెట్లకు దరఖాస్తులు పదిరెట్లు పెరిగాయి.

విదేశీ విద్యపై మొగ్గు చూపని విద్యార్థులు
తిరుపతి జిల్లా నుంచి గత ఏడాది విదేశీ విద్య కోసం సుమారు 9,871 మంది ఎఫ్‌1 వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 6,245 మంది విద్యార్థులు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లోని పలు వర్సిటీలలో వీసా సాధించి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. కానీ ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా కేవలం ఇప్పటివరకు ఎఫ్‌1 వీసా కోసం కేవలం 761 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎఫ్‌1 వీసాల ఆంక్షలతో వెనుకడుగు
ప్రధానంగా ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్నా ఆమెరికాలో ఎంఎస్‌, ఎంటెక్‌, మెడికల్‌, పీజీ కోర్సులు చేయాలనే ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ట్రంప్‌ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారు. కఠిన నిబంధనలు విధించడంతో జిల్లాలో ఈ ఏడాది విదేశాల్లో విద్యాభ్యాసానికి వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారు 40 శాతం కూడా లేదని అమెరికన్‌ రాయబార కార్యాలయం తేల్చిచెప్పడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న వారిలోనూ 50 శాతం మంది విద్యార్థులను పలు సాకులు చూపించి (ఎఫ్‌1) స్టూడెంట్‌ వీసాలకు అర్హులు కాదని ముద్ర వేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి వీసా కచ్చితం అనుకున్న విద్యార్థులకు సైతం ఏదో రూపంలో వీసాకు అన్‌ఫిట్‌ అంటూ ముద్రవేస్తున్నారు. దీంతో విదేశీ విద్యపై విద్యార్థులు వెనుకడుగువేస్తున్నారు.

జిల్లాలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్‌ కో ర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఐసెట్‌, ఏపీఈ సెట్‌, పీజీసెట్‌లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. గత ఏడాది ఏపీఈసెట్‌కు 3వేలకు మించని దరఖాస్తులు ఈ ఏడాది 30 వేల పైచిలుకు వచ్చా యి. దీంతోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నిర్వహించనున్న ఐసెట్‌కు సైతం అదే తరహాలో దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత వి ద్యకు ఈ ఏడాది ఎస్వీయూ, మహిళా వర్సిటీల్లో పోటీ ఎక్కువగా ఉంటుందని, కటాఫ్‌ మార్కులు సైతం ఊహించని రీతిలో ఉంటాయని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

పీజీసెట్‌లకు పెరుగుతున్న దరఖాస్తులు
పీజీ సెట్‌ పరీక్షలకు గత ఏ డాది కంటే ఈసారి దరఖాస్తు ల సంఖ్య పెరుగుతోంది. ట్రంప్‌ ఎఫెక్ట్‌ విదేశీ విద్యపై పెద్ద ప్రభావం చూపుతోంది. పీజీ ప్రొఫెషనల్‌ కోర్సులకు ఇప్పటికే ఊహించని రీతిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఏపీ ఈ సెట్‌ గడువు ముగిసింది. గత ఏడాది 3,500 దర ఖాస్తులు రాగా ఈ ఏడాది 35 వేలకు మించడం ఊహించని పరిణామం. 
–ప్రొఫెసర్‌ సురేంద్ర బాబు, కో కన్వీనర్‌, ఏపీ పీజీసెట్‌, ఎస్వీయూ

ఐసెట్‌కు దరఖాస్తు చేశా..
యూఎస్‌లో ఎంఎస్‌ చే యాలన్నది నా కల. కానీ ట్రంప్‌ ఆంక్షలతో భయమేస్తోంది. అక్కడ చదువుతు న్న మా బంధువుల పిల్ల లు సైతం ఇక్కడికి రావదని చెబుతున్నారు. దీంతో మా తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఎంసీఏ చేయడం కోసం ఐసెట్‌కు దరఖాస్తు చేశా. ఇక్కడే మంచి వర్సిటీలో ఎంసీఏలో చేరి పేరొందిన పరిశ్రమలో ఉద్యోగం సాధిస్తా. 
–ప్రియాంక, విద్యార్థిని, తిరుపతి

అమెరికా ఆశలపై నీళ్లు చల్లారు
తిరుపతిలో బీటెక్‌ పూర్తి చేశా. అమెరికాలో ఎంఎస్‌ చేయాలనే కోరిక ఉండేది. అమెరికా వెళ్లి ఎంఎస్‌ పూ ర్తి చేసి, అక్కడే గ్రీన్‌కార్డు సాధించాలనే కోరిక ఉండేది. కానీ ట్రంప్‌ విధించిన ఆంక్షలతో వీసాకు దరఖాస్తు చేసుకున్నా టోఫెల్‌తోపాటు ఇంటర్వ్యూ పూర్తి చేశా. కానీ ఎలిజిబిలిటీ రాలేదు. దీంతో ఎస్వీయూలో ఎంబీఏ చేసేందుకు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నా.
–ప్రదీప్‌కుమార్‌, విద్యార్థి, తిరుపతి

ఎస్వీయూ1
1/1

ఎస్వీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement