పెన్ను పెట్టాలంటే.. పైసలివ్వాల్సిందే
డంపింగ్ కేంద్రంలో మంటలు
సూళ్లూరుపేట: పట్టణంలోని కాళంగి నదికి పక్కనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై దట్టమైన పొగ కమ్మేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సూళ్లూరుపేట పట్టణాన్ని 2010లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. కానీ ఇప్పటివరకు సరైన డంపింగ్ యార్డు లేదు. రోజు వారీగా పట్టణం నుంచి 19 టన్నుల చెత్త వస్తోంది. ఈ చెత్త అంతా కాళంగి నదికి పక్కనే ఉన్న పొర్లుకట్టకున్న స్థలంలో డంప్ చేస్తున్నారు. ఆపై తరచూ మంట పెట్టడంతో పట్టణమంతా దట్టమైన పొగ అలముకుంటోంది. వట్రపాళెం, ఇందిరానగర్, మహదేవయ్య నగర్, వనంతోపు, గణపతినగర్, ఝాన్సీనగర్, శ్రీనగర్‌కాలనీ, సూళ్లూరు, నాగరాజుపురం లాంటి ప్రాంతాలతోపాటు సూళ్లూరుపేట పట్టణమంతా పొగ కమ్మేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. చైన్నె–కోల్‌కత్తా ఏషియన్ రహదారికి పక్కనే డంపింగ్ కేంద్రాన్ని మార్పు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
డక్కిలి : మండలంలో ఓ వీఆర్వో స్టైలే వేరుగా ఉంది. ఆయన పెన్ను పెట్టాలంటే పైసలివ్వాల్సిందే. ఆయన గతంలో రాపూరు, బాలాయపల్లి, మర్రిపాడు, డక్కిలి మండలాల్లో వీర్వోగా పనిచేశారు. ఆయా మండలాల్లో పనిచేస్తున్న సమయంలో విధులకు డుమ్మా కొట్టడం, ఎక్కడో ఓ రూమ్‌లో కూర్చొని రికార్డులు మార్చడం జరుగుతూ వచ్చేది. విషయం తెలుసుకున్న ఆయా మండలాల తహసీల్దార్లు అప్పట్లో ఆయనపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన పలు మార్లు సస్పెండ్‌కు గురయ్యారు.
రైతులను పీల్చిపిప్పి చేయడమే పని
సదరు వీఆర్వో ఇటీవల మళ్లీ డక్కిలిలో వీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన చేరినప్పుటి నుంచి రైతుల నుంచి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన పనిచేసే నాగవోలు, వడ్లమోపూరు సచివాలయాల పరిధిలోని మోపూరు వెల్లంపల్లి, దందవోలు, చాపలపల్లి, మిట్టపాళెం, చెన్నసముద్రం, తిమ్మనగుంట, వడ్డీపల్లి పెదయాచసముద్రం గ్రామాల్లో ఇటీవల ఫ్రీ హోల్డ్ సర్వే జరిగింది. మోపూరు సచివాలయం పరిధిలో సుమారు 276 సర్వే నెంబర్లలో 252 మంది లబ్ధిదారులు, నాగవోలు సచివాలయం పరిధిలో 101 సర్వే నెంబర్లలో 88 ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్‌గా ఉన్నాయని వసూళ్లకు తెరతీశారు. అసైన్‌మెంట్ పొలాలు ఫ్రీ హోల్డ్ పేరుతో సెటిల్‌మెంట్‌గా మారుతున్నాయని రైతులను నమ్మించి దందాకు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఎకరాకు రూ.20 వేల చొప్పున వసూలు చేసినట్టు ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. తనను స్థానిక ఎమ్మెల్యే పంపారని, ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే వద్దకు వెళ్తే ఆయన తన వద్దకే పంపుతారని విర్రవీగుతూ ముడుపులకు తెరదీసినట్టు సమాచారం. ఇదిలావుండగా సదరు వీఆర్వో పలు దఫాలు సస్పెండ్‌కు గురికావడంతో ఆయన ఎస్‌ఆర్ లేకుండానే పనిచేస్తుండడం గమనార్హం.
ఓ వీఆర్వో వసూళ్ల దందా
భూ రికార్డులు మార్చేసి రైతుల మధ్య తగాదాలు
విచారించి చర్యలు తీసుకుంటాం
వీఆర్వో అవినీతి, అక్రమాలపై విచారిస్తాం. ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చుతాం. ఏదైనా అక్రమాలు జరిగినట్టు తేలితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చస్తాం. – మోపూరు శ్రీనివాసులు,
తహసీల్దార్, డక్కిలి
పెన్ను పెట్టాలంటే.. పైసలివ్వాల్సిందే
పెన్ను పెట్టాలంటే.. పైసలివ్వాల్సిందే
పెన్ను పెట్టాలంటే.. పైసలివ్వాల్సిందే


