శ్రీసిటీ డైకిన్ ప్లాంట్ సందర్శన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నౌఫుమీ టకేనాక గురువారం శ్రీసిటీలోని డైకిన్ ఇండియా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. డైకిన్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.జె.జావా ఆయనకు ఆహ్వానం పలికారు. ప్లాంట్ పనితీరుపై సమీక్ష జరిపిన టకేనాక, ప్లాంట్ నిర్వహణ, సాంకేతిక నైపుణ్యం, దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళిక తదితర అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా టకేనాక, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కొద్దిసేపు సమావేశమయ్యారు.


