
చికిత్స పొందుతూ కూలీ మృతి
తిరుపతి క్రైమ్ : అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం వద్ద ఈ నెల 7వ తేదీన ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిపోయి గాయపడిన కూలీ చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మధ్యప్రదేశ్కి చెందిన విజయ్(29) భవన నిర్మాణ పనులు చేస్తూ కిందపడ్డాడు. తోటి స్నేహితులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మృతుడి అన్న మనీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.