● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్సులు ● డీసీసీపీ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు మెండు ● శ్రీహరికోట షార్‌లో మంచి డిమాండ్‌ ● అప్రెంటిస్‌షిప్‌ పూర్తితో ప్రైవేటు రంగాల్లో ఆఫర్లు | - | Sakshi
Sakshi News home page

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్సులు ● డీసీసీపీ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు మెండు ● శ్రీహరికోట షార్‌లో మంచి డిమాండ్‌ ● అప్రెంటిస్‌షిప్‌ పూర్తితో ప్రైవేటు రంగాల్లో ఆఫర్లు

Published Sat, Apr 19 2025 12:32 AM | Last Updated on Sat, Apr 19 2025 12:32 AM

● పది

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్

షార్‌లో ట్రైనింగ్‌.. ప్రొఫైల్‌ చూసి

అసెంచూర్‌లో జాబ్‌

పలమనేరులోని పాలిటెక్ని క్‌ కళాశాలలో డీసీసీపీ కో ర్సు చదివి శ్రీహరికోటలో ఏడాది పాటు అప్రెంటిస్‌షి ప్‌ చేశా. నా ఈ ఫ్రొఫైల్‌ చూడగానే ఇంటర్వ్యూలో బెంగళూరులోని అసెంచూర్‌ సంస్థలో ఉద్యోగం దక్కింది. పీ2పీ (ప్రొక్యూర్‌మెంట్‌ టు పే న్యూ అసోసియేషన్‌)గా మంచి ప్యాకేజీతో జాబ్‌ చేస్తున్నా. పలమనేరులో ఇలాంటి కోర్సులున్నాయని చాలామందికి తెలియదు. – హేమావతి, బెంగళూరు

డీసీసీపీ కోర్సులో కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న విద్యార్థినిలు

విద్యార్థినిని అభినందిస్తున్న కళాశాల అధ్యాపక బృందం(ఫైల్‌)

పలమనేరు: పాలిటెక్నిక్‌ కోర్సులు పదో తరగతి తరువాత తక్కువ ఖర్చు, సమయంలో ఉపాధి అవకాశాలు పొందడానికి దోహదపడతాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పూర్తయ్యాక పాలిసెట్‌ రాసే విద్యార్థులు.. పాలిటెక్నిక్‌ అంటే బీటెక్‌కు సులభమైన దారిగానే భావిస్తుంటారు. చాలామంది ఈ కోర్సులో బ్రాంచ్‌లైన సివిల్‌, మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ వైపే చూస్తుంటారు. స్పెషల్‌ కోర్సులను పట్టించుకోరు. కానీ, ఇవే త్వరగా ఉపాధి పొందేందుకు సోపానాలు అని తెలుసుకోవడం లేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి మంచి అవకాశాలుంటాయి. ఇప్పటికే ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 30వ తేదీన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ర్యాంకు వచ్చిన బాలికలు పలమనేరు, నెల్లూరులోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని కొన్ని కోర్సులు చేస్తే 19 ఏళ్లకే షార్‌లో ఉద్యోగం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

డీసీసీపీ అంటే ఏమిటి?

డీసీసీపీ.. కామర్స్‌తోపాటు పూర్తిస్థాయి కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్పే మూడేళ్ల డిప్లొమా కోర్సు. ఇందులో కామర్స్‌, డిగ్రీ మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్‌, మోడరన్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ కరస్పాండెన్స్‌, స్టాటిటిక్స్‌, బిజినెస్‌ లా, మార్కెటింగ్‌ ప్రిన్సిపుల్స్‌, అనలటికల్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, డీటీపీసీ, టాలీ ప్రోగ్రామింగ్స్‌ ఉంటాయి. కోర్సులో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విస్తృత అవకాశాలున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారు బీకాం కంప్యూటర్స్‌ డిగ్రీలో లేటరల్‌ అడ్మిషన్‌ కింద సెకండ్‌ ఇయర్‌లో చేరవచ్చు. ఆపై ఎంబీఏ, సీఏ, సీఎస్‌ లాంటి ఉన్నత కోర్సులు చదవచ్చు.

● తల్లిదండ్రులు ఇలాంటి కోర్సులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

బాలికలకు ప్రత్యేక పాలిటెక్నిక్‌

చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరులో ప్రత్యేకించి మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. వీటిలో డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ (డీసీసీపీ) కోర్సు చేసినవారు ఏటా తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌లో కంప్యూటర్‌ అనలిస్ట్‌గా అప్రెంటిస్‌షిప్‌నకు ఎంపికవుతున్నారు.

షార్‌లోనే కాక ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, హైదరాబాద్‌) హెచ్‌ఏఎల్‌ (హిందూస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌) వంటి పేరుగాంచిన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.

వీటిలో అప్రెంటిస్‌షిప్‌తో నైపుణ్యం సాధించినవారికి ప్రైవేట్‌ రంగంలోని ప్రముఖ కంపెనీలు భారీ వేతనాలను ఆఫర్‌ చేస్తున్నాయి.

పలమనేరులోని కళాశాలలో డీసీసీపీ కోర్సు పూర్తి చేసుకున్న 90 శాతం మందికి ఏటా వెంట నే ఉపాధి లభిస్తోంది. పదేళ్లలో వివిధ కోర్టులు, రాష్ట్ర సచివాలయం, పోస్టల్‌, ప్రైవేటు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 400 మంది దాక ఉద్యోగాలు పొందడం విశేషం.

టెన్త్‌ తర్వాత మంచి కోర్సు

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా పలు కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు పాలిటెక్నిక్‌ విద్య ఎంతో మేలు. తద్వారా బీటెక్‌లోనూ ప్రవేశించి ఉన్నత విద్య అభ్యసించవచ్చు.

– డా.బెహరా శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌,

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, పలమనేరు

ఇక్కడ చదివితే జీవితంలో సెటిల్‌

కోర్‌ బ్రాంచ్‌లే కాదు స్పెషల్‌ బ్రాంచ్‌ల్లో చదివినవాళ్లూ మంచి ఉపాధి అవకాశాలను పొందవచ్చు. డీసీసీపీ కోర్సు చేసిన చాలామంది షార్‌ లాంటి గొప్ప సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. కొందరు ఉన్నత చదువులకు వెళుతున్నారు. పాలిటెక్నిక్‌లోని ఇలాంటి కోర్సుల గురించి చాలామందికి తెలియదు.

– మహమూద్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌

డిపార్ట్‌మెంట్‌ హెడ్‌, పలమనేరు

ఏటా పది మందిపైనే షార్‌లో శిక్షణకు..

ఏటా షార్‌కు ఇక్కడినుంచి పదిమంది పైగా విద్యార్థినులు శిక్షణకు వెళుతున్నారు. ఆపై ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈసారి సైతం ఇక్కడ చదివిన సిమ్రాన్‌ (సదుం), డిల్లీ (బంగారుపాళెం), శశిప్రియ (నిమ్మనపల్లి), భవాని (గుడుపల్లి) పలువురు షార్‌లో పనిచేస్తున్నారు.

– శ్రీవిద్య, డీసీసీపీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌,

పలమనేరు

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్1
1/3

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్2
2/3

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్3
3/3

● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్‌ కోర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement