
ఏపీ జీఈఏ ఐక్యవేదిక కోచైర్మన్‌గా బాలాజీ
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక (ఏపీ జీఈఏ ఐక్యవేదిక) కోచైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు శవన్న గారి బాలాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 13 న విజయవాడలోని విద్యాధరపురంలో ఏపీ జీఈఏ చైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షన ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంలో మండల స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం బాలజీ సేవలందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని తెలిపారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజేహెచ్ వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,100 మంది స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది.