మరొక బాలుడికి తీవ్ర గాయాలు
తడ: జాతీయ రహదారి తడ ఐటీఐ కళాశాల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ కొండపనాయుడు తెలిపిన వివరాల మేరకు.. బీఏ ఫైనలియర్ చదువుతున్న చైన్నె రాయపేట ప్రాంతానికి చెందిన సయ్యద్ షాహిదీ ఉల్లా(20) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ పర్వాన్(15)తో కలిసి బైక్‌పై వరదయ్యపాళెం సమీపంలో ఉన్న వాటర్ ఫాల్స్‌కి బయలుదేరారు.
తడ ఐటీఐ కళాశాల సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌తోపాటు రోడ్డుపై పడ్డ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షాహిదీ ఉల్లా మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న పర్వాన్‌ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చైన్నెకి తీసుకెళ్లారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి
దొరవారిసత్రం : గత నెల 19న దొరవారిసత్రం మండల కార్యాలయాల సమీపంలో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పాళెంపాడు గ్రామానికి చెందిన మల్లాం మనోహర్(53) సొంత పనుల నిమిత్తం బైక్‌లో వచ్చాడు. తిరిగి వెళుతుండగా దొరవారిస త్రం మండల కార్యాలయాల సమీపంలో బైక్ అదు పుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కుటుంబ సభ్యులు నాయుడుపేట ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.