తిరువణ్ణామలైకి 81 సర్వీసులు
తడ: జాతీయ రహదారిపై కారూరు పంచాయతీ, కారూరుమిట్ట గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడులోని రెడ్ హిల్స్‌కి చెందిన సుబ్రమణి(50) మృతి చెందాడు. ఎస్‌ఐ కొడపనాయుడు కథనం.. కారూరు పంచాయతీ, ఖాశింగాడు కుప్పం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వద్ద సుబ్రమణి రైల్వే కూలి పనులకోసం వచ్చి అదే గ్రామంలో ఉంటున్నాడు. బుధవారం రాత్రి సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా చైన్నె నుంచి సూళ్లూరుపేట వైపు వెళుతున్న టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణి అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.


