
దూసుకొచ్చిన మృత్యువు
రాపూరు: కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఈ ఘటన రాపూరులో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ (46) తమ తోట వద్ద వదలాలని గార్లపాటి సురేష్ (26)ను కోరింది. దీంతో ఇద్దరూ మోటారు బైక్‌లో సమీపంలోని తోటవద్దకు వెళ్లారు. అక్కడ బైక్ దిగుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో పారిపోతుండగా స్థానికులు పట్టుకుని అప్పగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. వీరు రాజంపేట విద్యానగర్‌కు చెందిన రామచంద్ర, మల్లికార్జునగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకట్‌రాజేష్ తెలిపారు.
కారు ఢీకొని ఇద్దరి మృతి
రాపూరులో విషాదం

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు