అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయండి
చిల్లకూరు: గూడూరు నియోజకవర్గంలో అక్రమ మై నింగ్ అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుందని, దీ నికి అడ్డుకట్ట వేయాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కో రారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్‌ను ఆయన కలిశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఐదు రోజుల కిందట గూడూరు మండలం చెన్నూరు రెవెన్యూ పరిధిలోని తుంగపాళెం సమీపంలో ఉన్న శ్రీనివాసమైనింగ్‌లో తెల్లరాయి అక్రమంగా తవ్వి, తరలిస్తున్నా రని తెలిసి, అక్కడ మైన్‌ను పరిశీలించేందుకు బయలుదేరామన్నారు. దీనికి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకుని గృహ నిర్భందం చేశారని తెలిపారు. శ్రీనివాసమైన్‌లో అక్రమ మైనింగ్ కొనగసాగుతుందనడానికి పలు నిదర్శనాలున్నాయని, దీనిపై గనుల శాఖ మ్నికుండి పోవడంతోనే ప్రభుత్వ ఆదాయానికి గండి పడి అక్రమమార్కుల జేబులు నిండుతున్నాయన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని కోరారు. రోజూ టన్నుల కొద్ది తెల్లరాయి తరలించేస్తున్నారని తెలిపారు. అ క్రమ తవ్వకాలకు ఊతమిస్తూ రెవెన్యూ, పోలీస్, గనులశాఖాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని తెలిపారు. ఎప్పుడో మూత పడిన మైన్‌కు అనుమతులు ఎలా ఉన్నాయని గనులశాఖాధికారులను అడిగితే గతంలో మైన్‌లో నిలిచి పోయి ఉన్న మెటీరియల్‌ను తరలించుకునేందుకు వారికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారన్నారు. దీంతో సబ్‌కలెక్టర్ గనులశాఖ ఏడీ శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మైన్‌కు సంబంధించిన అనమతి పత్రాల ను తనకు ఇవ్వాలని చెప్పడంతో గనులశాఖ ఏడీ నీళ్లునములుతూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడంతో సబ్ కలెక్టర్ కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వివరాలు తెలుసుకుని, చర్యలు చేపడతామన్నారు. చేవూరు విజయమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


