
యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షలు రేపు
తిరుపతి అర్బన్: నగరంలో ఆదివారం యూపీఎస్సీ కంబెన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ పరీక్షలు జరగనున్నాయని, వీటికి నిర్వహనకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. తిరుపతిలో 3 చోట్ల పరీక్షలు ఉంటాయన్నారు. యూపీఎస్సీ కంబెన్డ్ డిఫె న్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఉంటాయని వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిలాల్లో 3 సెంటర్లు కేటాయించామన్నారు. 973 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఈ పరీక్షలకు డిప్యూటీ తహసీల్దార్ అధి కారి లైజన్ అధికారిగా ఉంటారన్నారు. పరీక్ష కేంద్రంలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రికల్ వస్తువులకు అనుమతి లేదన్నారు. మరోవైపు బస్టాండ్ నుంచి ఆర్టీసీ వారు పరీక్ష కేంద్రాల వరకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. తిరుపతిలోని బాలాజీ కాలనీ వెస్ట్ చర్చి రోడ్డు మార్గంలోని శ్రీపద్మావతి బాలికల ఉన్నత పాఠశాలతోపాటు శ్రీపద్మావతి అతిథి గృహం వద్ద శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల(వింగ్–ఏ), శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్–బీ)పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయన్నారు. ఆర్డీఓ రామమోహన్, యూపీఎస్సీ డిప్యూటీ సె క్రటరీ ఎన్‌కే స్వామి పరీక్షలను పర్యవేక్షించనున్నారని చెప్పారు.