
విద్యుత్ షాక్‌తో ఎలుగుబంటు మృతి
సాక్షిటాస్క్‌పోర్స్: చామలా అటవీ వన్యప్రాణుల అభయారణ్యం (భాకరాపేట అడువులు)లో విద్యుత్ తీగలు తగిలి ఎలుగుబంటు మృతి చెందింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేకేతించింది. వివరాలు.. చిన్నగొట్టిగల్లు మండలం, చిట్టేచెర్ల పంచాయతీ, తుమ్మచేనుపల్లె అటవీ సరిహద్దు ప్రాంతమైన ఎర్రగొండ పెద్దాయన చెరువు సమీపంలో వేటగాళ్లు తీసిన విద్యుత్ తీగలకు ఎలుగుబంటు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు వేటగాళ్లు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై భాకరాపేట అటవీ అధికారులను వివరణ కోరడానికి ప్రయత్నించగా వారు స్పందించలేదు.