
పత్రికా స్వేచ్ఛ హరించడం సబబుకాదు
చిత్తూరు అర్బన్: పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జర్నలిస్టులను అణగదొక్కాలని చూ స్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చి త్తూరులో పాత్రికేయలోకం కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, చి త్తూరు ప్రెస్‌క్లబ్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్‌క్లబ్, తవణంపల్లె ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు నగరంలో విలేకరులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ, చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి కాలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్‌టౌన్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం, ఆర్డీఓ కార్యాలయం వరకు వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లోకనాథన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల గొంతుపై కేసులు పెట్టి పాత్రికేయులను లోబరచుకోవాలని చూస్తోందన్నారు. పల్నాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకు గురైన వార్తలు రాసినందుకు ఆరుగురు పాత్రికేయులతోపాటు, సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టడం ఏమాత్రం ఆమోదయో గ్యం కాదన్నారు. పత్రికలో ప్రచురితమైన వార్తలో అభ్యంతరం ఉంటే ఖండించడం, న్యాయపరంగా ముందుకు వెళ్లడం చేయాలే తప్ప, ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రా జ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ ప్రకటనను హరించడమేనన్నారు. రాష్ట్ర డీజీపీ సైతం కనీస న్యా య సలహా తీసుకోకుండా పాత్రికేయులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం మంచిది కాదన్నారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులను కలిసి సాక్షి పాత్రికేయులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్, ఉపాధ్యక్షులు శివకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, వెంకటేష్ , చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివకుమార్, కార్యవర్గ సభ్యులు చంద్ర, రాజేష్, బాలసుందరం, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమలయ్య, నరేష్, తేజ, ఎంజీఆర్, తవణంపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జగన్నాథం, శివకుమార్, అనంత్ కుమార్, పాత్రికేయులు హేమంత్ కుమార్, ప్రవీణ్, జయకుమార్, ఐరాల చిన్న, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
● పలమనేరు ఆర్డీఓకు వినతిపత్రం అందజేత
పలమనేరు: పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం సబబుకాదని, పత్రికలను అణగదొక్కాలని గతంలో అనుకున్న పార్టీలు ఆపై కనిపించకుండా పోయాయని పలమనేరు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్, దిలీప్ అన్నా రు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదుకు వ్యతిరేకంగా స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులతో కలసి శుక్రవారం నిరసన తెలిపి ఆపై స్థానిక ఆర్డీఓ భవానీకి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికల్లో వెలువడే వార్తలను పార్టీలకు అంటగడుతూ ఎడిటర్లపై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. పత్రికలో వచ్చిన వార్త తప్పుగా ఇంటే దానిపై ఖండన, రీజయిండర్ ఇవ్వాలి గానీ, ఇలా కేసులు పెట్టడం, దాన్ని పోలీసులు అమలు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాసామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై కేసులు పెట్టడం భవిష్యత్తులో అనర్థాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇలాంటి సంస్క్రృతి కొనసాగితే రేపు మరోపార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి పునరావృత్తం కావడం ఖాయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందులో ప్రెస్‌క్లబ్ సభ్యు లు రెడ్డెప్ప, సుబ్రమణ్యం, రంజిత్, సూర్యబాబు, సాక్షి మణి, మోహన్‌మురళి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛ హరించడం సబబుకాదు