
ఎన్‌ఎస్‌యూలో యూజీసీ బృందం పర్యటన
తిరుపతి సిటీ:జాతీయ సంస్కృత వర్సిటీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాజభాషా సమితి బృందం బుధవారం విస్తృత పర్యటన చేపట్టింది. ఇందులో భా గంగా వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, అధికారుల తో బృందం సభ్యులు డాక్టర్ కిశోర్ కుమార్, వీకే సుదర్శన దేవి సమావేశమయ్యారు. వర్సిటీలో రాజభాషగా ఉన్న హిందీ భాషను కార్యాలయ ఆదేశాలలో ఎంత వరకు అమలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ వర్సిటీలో రాజభాష హిందీ అమలు తీరు సంతృప్తి కరంగా ఉందన్నారు. రాజభాషా సమితి ద్వారా హిందీ భాష అమలులో భాగంగా విశ్వవిద్యాలయానికి రాజభాషా నాయక్ పురస్కారం లభించడం విశ్వవిద్యాలయ పనితీరుకు తార్కాణమని తెలిపారు. అకడమిక్ డీన్ రజనీకాంత శుక్లా, పరీక్షల నియంత్రణాధికారి సాంబశివ మూర్తి, ప్రొఫెసర్ సీ రంగనాథన్, రాజభాష విభా గం అధ్యక్షుడు డాక్టర్ లతా మంగేష్, సభ్యులు చారుకేశ్, వేద ప్రకాష్, బాలాజీ, హరినారాయణ పాల్గొన్నారు.