
అంగన్‌వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
దుద్యాల్: లగచర్ల అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు అరుణ, శ్రీలత, దుద్యాల్, ఈర్లపల్లి గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు నవనీత, పద్మలత, ఎల్లమ్మ, యాదమ్మ, రేహన, వెంకటమ్మ, సునీత, అరుణ తల్లితండ్రులు పాల్గొన్నారు.