Vikarabad District News
-
హిందువులపై దాడులు అరికట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడికి నిరసనగా శనివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడం పేరుతో బెంగాల్ మొత్తం హింసాకాండలో కాలిపోతోందని అన్నారు. బెంగాల్లో భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మమత ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నారు. హిందూ ఉనికికి ప్రమాదం వాటిల్లిందని, హిందువులకు భద్రత కల్పించాలన్నారు. బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని, హింసపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోరారు. -
రైతన్నకు వరుణ గండం
వికారాబాద్: అకాల వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదాపు 15 రోజులుగా జిల్లాలోని పలుచోట్ల గాలివాన, వడగండ్ల వర్షం పడుతోంది. గాలి తీవ్రతకు వరి, బొప్పాయి, అరట, మామిడి ఇతర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రస్తుతం వరి పంట చేతికొచ్చింది. పలు చోట్ల కోతలు ప్రారంభించారు. ఈ సమయంలో వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. కళ్లాలు, రోడ్లపైన వడ్లను ఆరబోశారు. మరి కొన్ని చోట్ల పొలాల్లో కోతలు కోసి ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోతోంది. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి దాదాపు 15 వేల నుంచి 20 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. వర్షాలు పడితే మరింత నష్టం ప్రస్తుతం యాసంగి పంటలు పూర్తిస్థాయిలో చేతికి వచ్చాయి. వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటల కోతలు ప్రారంభమయ్యాయి. వడ్లను ఆరబోయడం, నూర్పిడి చేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో అకాల వర్షాలు పడుతుండటం ఆందోళన కలిగిస్తోందని రైతులు అంటున్నారు. వర్షాలు ఇలాగే పడితే పూర్తిగా నష్టపోతామని వారు పేర్కొన్నారు. సౌకర్యాలు కల్పించాలి వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబెట్టుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. కళ్లాలు, రోడ్లపై ధాన్యం ఆరబోస్తే తడిసిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే తిరిగి పంపుతారని, ఒక వేళ కొన్నా మద్దతు ధర రాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో 92 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అకాల వర్షాలు, వడగళ్ల్లకు దెబ్బతింటున్న పంటలు తడిసి ముద్దవుతున్న ధాన్యం గాలి తీవ్రతకు నేలకొరిగిన బొప్పాయి, అరటి చెట్లు మామిడి రైతుకు భారీ నష్టంఅన్ని ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాయి. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ -
వీధి కుక్కల దాడిలో 15 మేకల మృతి
దోమ: వీధి కుక్కల దాడిలో 15 మేకలు మృతి చెందిన ఘటన మండలంలోని మోత్కూర్‌లో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివ రాల ప్రకారం.. గ్రామానికి చెందిన జీడీ అంజిలయ్య శుక్రవారం సాయంత్రం తన పొలంలోని షెడ్డులో మేకలను కట్టేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసి మళ్లీ పొలానికి వచ్చాడు. అప్పటికే వీధి కుక్కులు దాడి చేసి 15 మేకలను చంపేశాయి. సుమారు లక్ష రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. అలాగే బొంపల్లి తండాలో నర్సింహులు చెందిన లేగదూడపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. -
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా
కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా లబ్ధిదారుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి, మే 2న గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శిస్తారని తెలిపారు. మే 5న అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. మొదటి విడత పైలెట్ గ్రామాల్లో పునాది పనులు పూర్తి చేసుకున్నవారికి రూ.లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. నాలుగు విడతలుగా రూ.5 లక్షలు అందుతాయని తెలిపారు. మొదటి విడతలో 2,285 మంది లబ్ధిదారులను గుర్తించామని.. 340 ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు తెలిపారు. 45 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేశారని.. 26 మందికి రూ.లక్ష చొప్పున సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారని పేర్కొన్నారు. మిగిలిన వారికి త్వరలో డబ్బులు అందుతాయని కలెక్టర్ తెలిపారు. -
● రోడ్లపైనే వాహనాల పార్కింగ్
పరిగి: పరిగి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపైనే వాహనాలను నిలుపుతుండటంతో పాదచారులు, తోటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థ లేదు. పరిగి పట్టణానికి నిత్యం పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మార్కెట్ రోడ్లు నిత్యం వాహనాలతో కిటకిటలాడుతుంటాయి. గంజ్‌రోడ్డు, బహార్‌పేట్ మార్కెట్ రోడ్డు, కొడంగల్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి శుక్ర, శనివారాల్లో వారంతపు సంతలు జరుగుతుంటాయి.. ఈ సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. -
● అలంకారప్రాయంగా సిగ్నల్ వ్యవస్థ
తాండూరు: పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2017లో పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల పాటు అవి బాగానే పని చేశాయి. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడంతో 2021 నుంచి పని చేయడం లేదు. అప్పటి నుంచి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. రోడ్ల పక్క వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా మున్సిపాలిటీల ప్రజలు కోరుతున్నారు. -
● జిల్లా కేంద్రంలో ఇదీ పరిస్థితి..
వికారాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్, బీజేఆర్ చౌరస్తాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రామయ్యగూడ వెళ్లే దారిలో, ఆలంపల్లి రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ చౌరస్తాలో, మహాశక్తి థియేటర్ వద్ద, గంగారం చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం స్కూల్స్, కళాశాలల సమయంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎస్బీఐ, ఆలంపల్లి వద్ద రోడ్డుపైనే క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలను ఆపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుంతోంది.ప్రతిపాదనలు పంపాం జిల్లా కేంద్రం వికారాబాద్‌తోపాటు, తాండూరు, పరిగి మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా వరకు వాటిని అధిగమిస్తున్నాం. త్వరలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. – నారాయణరెడ్డి, ఎస్పీ -
● సిగ్నల్స్ ఊసేలేదు
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు. పట్టణం మీదుగా రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ రెండూ కొడంగల్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో కలుస్తాయి. పట్టణంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ – బీజాపూర్, మహబూబ్‌నగర్ – చించోలీ జాతీయ రహదారులపై భద్రత కరువైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో సిగ్నల్స్ వ్యవస్థ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో సుమారు పది మంది ప్రమాదాల బారిన పడ్డారు. కొందరు చనిపోగా.. మరికొందరు గాయాలపాలయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు సంఖ్య కూడా పెరిగింది. పట్టణంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. వాహనాలను ఎక్కడ పడితే అక్కడే నిలుపుతున్నారు. వ్యాపార సముదాయల ముందు వాహనాలను ఇష్టారాజ్యంగా నిలపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్టాండ్ ముందు, వినాయక చౌరస్తాలో ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలు అక్కడే ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారిపై సిగ్సల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అలాగే ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కొడంగల్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది చనిపోతున్నారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. – మురహరి, కొడంగల్ వాసి -
‘భూ భారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
మర్పల్లి: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నరు. శనివారం మర్పల్లి రైతు వేదికలో ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టం ద్వారా భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, నిషేధిత భూములు, మార్పులు, చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సమస్య ఉండదన్నారు. అధికారులే గ్రామాలకు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ భారతి చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి మండలానికి ఐదు మంది సర్వేయర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ మునిరొద్దీన్, ఆర్ఐ మాధవరెడ్డి, ఎంపీడీఓ రాజ్‌మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, ఏఓ శ్రీకాంత్, ఏఈఓలు నీరజ, మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్ దవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్, బ్లాక్ –2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్, గణేష్, కార్యదర్శి సంజీవరెడ్డి, మండల వర్కింగ్ ప్రసిడెంట్లు రఫి, రాచన్న, లక్ష్మారెడ్డి, అశోక్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు మల్లికార్జున, గిరి, అశోక్, గోపాల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ మర్పల్లి రైతు వేదికలో కొత్త చట్టంపై అవగాహన సదస్సు -
అంకితభావంతో పని చేయండి
ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 17మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లగా ప్రమోషన్ వచ్చినట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్‌లోని తన చాంబర్లో పదోన్నతి పొందిన వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమోషన్ అంటే కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని.. బాధ్యత మరింత పెరిగిందని గుర్తుంచుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో మరింత అంకితభావం, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. హామీలన్నీ అమలు చేస్తాం స్పీకర్ ప్రసాద్ కుమార్ మోమిన్‌పేట్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పథకం అమలు చేసినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని అన్నారు. త్వరలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.లక్షతోపాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టామని, త్వరలో పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరోత్తం రెడ్డి, సుభాష్ గౌడ్, సురేందర్, సిరాజుద్దీన్, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఆర్ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలువురు నాయకులతో నూతన ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిలో వసతులు లేక రోగు లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. భవ నం పూర్తయి ఆరు నెలలు కావస్తున్నా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పందించి ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శివ రాజు, మోహన్‌రెడ్డి, సుధాకర్ ఆచారి, రాఘవేందర్, శ్రీనివాస్, రాములు, అనంతయ్య, గోపాల్ పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్లోపరిగి విద్యార్థి ప్రతిభ ఆల్ఇండియా జనరల్ కేటగిరీలో 103 ర్యాంక్ పరిగి: జేఈఈ మెయిన్స్‌లో పరిగి విద్యార్థి సత్తాచాటాడు.ఆల్ ఇండియా జనరల్ కేటగిరీ లో 103 ర్యాంక్ సాధించాడు. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన కనకం ప్రణవ్తేజ్ జేఈఈ మెయిన్స్‌లో 300 మా ర్కులకు గాను 280 మార్కులు సాధించాడు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
తాండూరు రూరల్: తెలంగాణ ఒపెన్ టెన్త్, ఇంటర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తాండూరు తహసీల్దార్ కేతావత్ తారాసింగ్ పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జీజేసీ) పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ..నేటి నుంచి 26వ తేదీ వరకు ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తాండూరు పట్టణంలో ఒపెన్ టెన్త్‌కు సెయింట్ మారస్క్ స్కూల్, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జీజేసీ), సాయిపూర్లోని నంబర్ 1 ప్రభుత్వ పాఠశాల, పాత తాండూరులోని ప్రభుత్వ బాలికల ఉర్దూమీడియం పాఠశాల పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30గంటలనుంచి, సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నలుగురు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్స్లతో పాటు 40 మంది ఇన్విజిలెటర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ వెంకటయ్య, డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మయ్య, నసీమున్నీసా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ -
బైక్‌ను తప్పించబోయి..
పరిగి: బైక్‌ను తప్పించబోయి టవేరా వాహనం స్కూటీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలో సయ్యాద్‌మల్కాపూర్ దగ్గర శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పూడూర్ మండలం చెంచుపల్లి గ్రామానికి చెందిన తిరుమలయ్యతో పాటు 11మంది కుటుంబీకులు టవేరా వాహనంలో హన్వాడ మండలంలోని దేవాలయానికి బయలు దేరారు. సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఈడ్గి గున్నమ్మ(50) ఆమె కుమారుడు శ్రీశైలంగౌడ్ ఇద్దరు స్కూటీపై కుల్కచర్ల మండలంలోని పాంబండ దేవాలయానికి బయలు దేరారు. సయ్యాద్‌మల్కాపూర్ గ్రామ సమీపంలో పెట్రోల్‌బంక్ ముందు వెళ్తున్న బైక్‌ను అతివేగంగా వచ్చిన టవేరా బైక్‌ను తప్పించబోయి స్కూటీని ఢీకొంది. దీంతో టవేరా వాహనం పల్టీ కొడుతూ పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. స్కూటీపై ఉన్న గున్నమ్మకు తీవ్రగాయాలు కాగా, టవేరా వాహనంలోని పది మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానికులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గున్నమ్మకు తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్‌లోని ఈశా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. టవేరా వా హనంలో ఉన్న వైష్ణవ్, ప్రవళ్లిక, శివమణి, ఎల్లమ్మ, వెంకటేష్, తిరుమలయ్య, లక్ష్మీ, శిరీష, అంజమ్మ తోపాటు డ్రైవర్ ప్రసాద్‌లకు గాయాలయ్యాయి. తవేరా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు వాపోయారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.● స్కూటీని ఢీకొన్న టవేరా ● ఒకరు మృతి పలువురికి గాయాలు -
పని ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి
తాండూరు రూరల్: ఉపాధి హామీ కూలీ గుండెనొప్పితో మృతి చెందాడు. ఈ ఘటన పెద్దేముల్ మండలం దుగ్గాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె పెద్ద అమృతయ్య(59) వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. వేసవికాలం దృష్ట్యా పనులు లేకపోవడంతో గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగా శనివారం ఉదయం తోటి కూలీలతో కలిసి పని చేస్తుండగా గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం ఉపాధి కూలీ అమృతయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి చేయూత అందేలా చూస్తామని ఎంపీడీఓ రతన్‌సింగ్ అన్నారు. ఆయన మృతి విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశామని తెలిపారు. కూలీలు ఎండబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. -
కనుల పండువగా రథోత్సవం
తాండూరు: పట్టణంలో వెలసిన భావిగి భద్రేశ్వరస్వామి జాతరలో భాగంగా శనివారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం పట్టణంలో కలశంతో శోభాయాత్ర నిర్వహించారు. మండలి చీఫ్ విఫ్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్ఠించారు. పూర్ణకుంభం, మహా మంగళ హారతితో రథాన్ని ముందుకు కదిలించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్‌కుమార్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహరాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్‌రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునితా సంపత్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, మురళీకృష్ణగౌడ్, రమేష్ కుమార్, పట్లోళ్ల నర్సింహులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నదానం తాండూరు: తాండూరు భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయ దసోహ భవనంలో శనివారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నదానం ఏర్పాటు చేశారు. జాతరోత్సవాల సందర్భంగా శుభప్రద్‌పటేల్ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాసోహ భవనంలో అన్నదానం ప్రారంభించారు. -
చిన్నారికి చికిత్స
ధారూరు: పాఠశాల గది పై కప్పు నుంచి పెచ్చులూడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినికి పరీక్షలు చేయించి, మెరుగైన వైద్యం అందించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశించారు. శనివారం మున్నూరుసోమారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు రవీందర్‌కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ‘శిరీషకు మెరుగైన వైద్యం అందించాలి’ శీర్షికతో శుక్రవారం సాక్షి ప్రచురితమైన కథనాన్ని చూసిన స్పీకర్ రవీందర్‌కు ఫోన్ చేశారు. దీంతో శనివారం ఉదయాన్నే రవీందర్ తన కారులో శిరీషను వికారాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఘటన జరిగి మూడు రోజులైనా చిన్నారికి గాయాలు తగ్గలేదని, ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. డీఈఓతో పాటు విద్యాశాఖ అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్లారని, బాలికకు కనీస వైద్యం చేయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్పీకర్ చొరవపై బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు. -
ఎయిర్ బ్రేక్ ఫెయిల్..
● మొరాయించి ఆర్టీసీ బస్సు ● భయాందోళనకు గురైన ప్రయాణికులు దోమ: ఎయిర్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఓ ఆర్టీసీ బస్సు మొరాయించింది. శనివారం పరిగి డిపోకు చెందిన బస్సు దోమ మండల కేంద్రం మీదుగా ఆయా గ్రామాలకు వెళ్లేందుకు వస్తుంది. దోమ సమీపంలోకి రాగానే ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా బస్సు ఎయిర్ బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును సురక్షితంగా ఆపేశారు. సుమారు 40 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారని, ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని వారు పేర్కొన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. కాలం చెల్లిన బస్సులను తొలగించండి ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను వెంటనే తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బస్సులతో అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో భద్రత ఉంటుందని గొప్పలు చెబుతున్నారే కానీ, కాలం చెల్లిన బస్సులతో సంభవించే ప్రమాదాలను గుర్తించలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికై న అధికారులు కాలం చెల్లిన బస్సులను తొలగించి నూతన బస్సులను నడిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం
బంట్వారం: భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి పేరిట కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. శనివారం బంట్వారం రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు తమ భూములపై జవాబుదారి తనాన్ని ప్రభుత్వం పెంచేందుకే కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, సాధా బైనామాలు లాంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుదేవ చంద్రా, తహసీల్దార్ విజయ్‌కుమార్, మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేషం, మాజీ ఎంపీపీ ప్రభాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సంతోష తదితరులు పాల్గొన్నారు. మోమిన్‌పేట్: మండల కేంద్రంలో ఆల్ హెల్ఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగ విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సూచించారు. అలాగే ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించాలన్నారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జ్ అధికారి జయసుధ, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
మర్పల్లి: పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి రైతులకు భరోస ఇచ్చారు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశం రెండెకరాల్లో బొప్పాయి, మరొ రెండెకరాల్లో అరటి పంట సాగు చేశాడు. అవీ వర్షానికి పాడయ్యాయి. విషయం తెలసుకున్న మార్కెట్ చైర్మన్ మహేందర్‌రెడ్డి స్థానిక నాయకులు, వ్యవసాయ అధికారులతో కలిసి పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించేవిధంగా కృషి చేస్తామని రైతు వెంకటేశానికి భరోస ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్, ఉద్యాన శాఖ మర్పల్లి, నవాబ్‌పేట్, మోమిన్‌పేట్ క్లస్టర్ అధికారి అర్షితరెడ్డి, సిరిపూరం రైతు వేదిక క్లస్టర్ ఏఈఓ మహేశ్, మాజీ సర్పంచ్ రాములు, కృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంతారంలో వరిపంట పరిశీలన తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. వడగండ్ల వానతో మండలంలోని అంతారం, బెల్కటూర్, ఎల్మకన్నె, అల్లాపూర్ గ్రామాల్లో వరిపంట పాడై పోయాయి. విషయం తెలుసుకున్న అంతారం క్లస్టర్ ఏఈఓ శివకుమార్ శనివారం అంతారం గ్రామంలోని నక్కల రాజు వరిపంటను పరిశీలించారు. దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. ధారూరులో.. ధారూరు: మండలంలోని అల్లాపూర్, నాగసమందర్ గ్రామాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి హరిప్రసాద్‌గౌడ్ శనివారం పరిశీలించారు. రైతుల పొలాలకు నేరుగా వెళ్లి ఏఏ పంట ఎంతమేరకు నష్టపోయిందో నమోదు చేసుకున్నారు. నష్టం వివరాలను జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పంపిస్తామని హరిప్రసాద్‌గౌడ్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి -
కృత్రిమ మేధతో మెరుగైన విద్య
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి దోమ: కృత్రిమ మేధతో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. గురువారం మండలంలోని గుండాల్, దాదాపూర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు ఏఐ విద్య నేర్పించాలని సూచించారు. ఏఐ విధానంలో బోధన చేస్తే తొందరగా అర్థమవుతుందన్నారు. అనంతరం స్కూల్ యూనిఫాం కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థుల కొలతలు తీసుకున్న తరువాతే యూనిఫాం కుట్టాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్, ఉపాధ్యాయులు, సిబ్బంది మల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి, రఘుసింగ్ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరులోగా టెన్త్ ఫలితాలు ముగిసిన పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. మార్కుల జాబితాను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో 1,100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల జవాబు పత్రాలను దిద్ది రికార్డు సృష్టించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వలేదని ఆ శాఖ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కుల జాబితాను ఆన్లైన్లో పొందుపరిచే ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు గురువారంతో ముగిశాయి. శనివారం నుంచి ఆయా పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అయితే ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు మాత్రం ఈ నెల 24 వరకు హాజరు కానున్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు ఆమనగల్లు: ఎరువుల డీలర్లు, ఫర్టిలైజర్ షాపుల డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్లు, బిల్ బుక్స్, స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సీజన్‌కు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆయా మండలాలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందుగా తెచ్చుకోవాలని, సీజన్ ప్రారంభం నాటికి విక్రయానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. స్టాక్ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. సామాజిక తనిఖీలు పక్కాగా జరగాలి యాచారం: ఈజీఎస్ సామాజిక తనిఖీల కార్యక్రమం పక్కాగా జరగాలని జిల్లా విజిలెన్స్ అధికారి కొండయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏడాది పాటు జరిగిన ఉపాధి పనులకు సంబంధించి తనిఖీల సిబ్బందికి రికార్డులు అందజేయాలని సూచించారు. కూలీలతో కలిసి పనులు చూపించాలని, పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
తుక్కుగూడ: ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే చిన్నారులకు ప్రభుత్వాలు పంపిణీ చేసే పౌష్టికాహారం అందించాలని కేంద్ర మహిళ సంక్షేమ శాఖ జాయింట్ సెకట్రరీలు డాక్టర్ ప్రీతం, యశ్వంత్ అన్నారు. పురపాలక కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారుల వ్యక్తిగత వివరాలు, అందుతున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆట పాటలతో చిత్రాలను ఉపయోగించి చిన్నారులకు బోధన చేయాలని, పిల్లల మేధో వికాసం పెంపొదించే విధంగా బోధన ఉండాలన్నారు. వారి మానసిక, శారీరక ఎదుగుదలను ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించారు. -
లగచర్ల రైతులకు చెక్కులు
● 45 మందికి రూ.17.89 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ ● సబ్ కలెక్టర్ చేతులమీదుగా నిర్వాసితులకు అందజేత దుద్యాల్: పారిశ్రామిక వాడ ఏర్పాటులో భూములు కోల్పోతున్న లచగర్ల రైతులకు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గురువారం చెక్కులు పంపిణీ చేశారు. 45 మందికి సంబంధించిన 89.19 ఎకరాల పట్టా భూములకు చెందిన రూ.17 కోట్ల 89 లక్షల 50 వేల విలువైన చెక్కులను నిర్వాసితులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. చాలా మంది రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. పరిహారం విషయంలో రైతులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని, ప్రభుత్వం అందరికీ సమానంగా ఇస్తోందని తెలిపారు. మిగిలిన రైతులు కూడా భూములు అప్పగించి, పరిహారం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దుద్యాల్ తహసీల్దార్ కిషన్, రెవెన్యూ అధికారులు, లగచర్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పైకప్పు.. ముప్పు
తరచూ పెచ్చులూడుతున్న పాఠశాలల స్లాబులు ● గాయపడుతున్న విద్యార్థులు ● గతంలో దుద్యాల్.. తాజాగా ధారూరు మండలంలో ఘటనలు ● ఆందోళనలో విద్యార్థులు, తల్లిండ్రులు మరీ ఇంత నిర్లక్ష్యమా?వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది భద్రతకు రక్షణ కరువైంది. స్కూల్ భవనాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేపడుతున్నా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల క్రితం దుద్యాల్ మండలం హస్నాబాద్ ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడి విద్యార్థులు పరుగులు తీసిన ఘటన మరువక ముందే బుధవారం ధారూరు మండలం మున్నూరు సోమారం పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడి విద్యార్థినికి గాయాలు కావడం కలకలం రేపింది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అయితే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో మన ఊరు – మన బడి పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా ఆదర్శ పాఠశాలల పేరుతో భారీగా నిధులు ఖర్చు చేసింది. కానీ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పనులు చేశారనే విమర్శలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో పూర్తయిన పనులు జిల్లాలో మొత్తం 1,062 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు – మనబడి కార్యక్రమం కింద గత ప్రభుత్వం మొదటి విడతలో 371 పాఠశాలలను ఎంపిక చేసింది. 46 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా 92 స్కూళ్లలో పనులు మధ్యలో ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మా ఆదర్శ పాఠశాలల పేరిట ఒకే విడతలో 924 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.35.5 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఆందోళనలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.దుద్యాల్: మండలంలోని హస్నాబాద్ హరిజన వాడ ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం జరిగి మూడు నెలలు దాటినా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.. అప్పట్లో క్లాసులు జరుగుతున్న సమయంలో పా ఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటి కి పరుగులు తీసిన విషయం తెలిసిందే.. ప్రమా దం జరిగిన సమయంలో ఉపాధ్యాయురాలు కీర్తి, 41 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్ట వ శాత్తు ఎవరికీ ఎలాంటి ముప్పు జరగలేదు.. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు పత్రికల్లో రావడంతో హుటాహుటిన అధికారులు పాఠశాలను సందర్శించి మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మూడు నెలలు దాటినా కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నాసిరకంగా పనులు పాఠశాల భవనాలు నిర్మించే సమయంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. చిన్నపాటి వర్షాలకే పైకప్పుల నుంచి నీరు కారుతోంది. మరమ్మతులు చేపట్టిన కొన్ని నెలలకే భవనాలు దెబ్బతింటున్నాయి. – బిల్లపాటి యాదయ్య, విద్యార్థిని తండ్రి, ధారూరు పునరావృతం కావొద్దు ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసి కొత్త వాటిని నిర్మించాలి. – మేకల భిక్షపతి, విద్యార్థి తండ్రి, మున్నూరుసోమారం -
భూ భారతి
భూ సమస్యల పరిష్కారానికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ● పరిగి, పూడూరులో అవగాహన సదస్సులు ● హాజరైన స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పరిగి/పూడూరు: రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందర్శకుల కోసం నిర్మించిన గదిని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతు భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ముందుగా పైలెట్ మండలాల్లో.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాలని ఎమ్మెల్యే.. మంత్రిని కోరారు. స్పందించిన ఆయన నూతన భవన నిర్మాణానికి నివేదికలు పంపాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి సామాన్య ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురి చేసిందని, పైసలిస్తే రాత్రికి రాత్రే రైతుల పట్టాలు మార్పిడి చేశారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మండల కేంద్రమైన పూడూరులో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ధరణికి వ్యతిరేకంగా పోరాటం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి రైతులకు న్యాయం చేశామన్నారు. భూ భారతి ద్వారా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యలను సులభతరంగా పరిష్కారిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ భూ భారతి చట్టం విధి విధానాలను రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. గతంలో స్లాట్ బుక్ అయితే రిజిస్ట్రేషన్ జరిగేవని.. దీంతో అసలు లబ్ధిదారులకు నష్టం జరిగేదన్నారు. కొత్త చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే రిపోర్ట్ అప్లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అయ్యి కొత్త పట్టాదారు పాసు పుస్తకం వస్తుందన్నారు. వారసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకుంటే ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు భరత్ గౌడ్, లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి!
భానుడి ప్రతాపంతో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోతగా ఉంటోందని కొందరు చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎండలో పని చేయడానికి కూలీలు సైతం జంకుతున్నారు. అందుకే పని చేసే చోట పెద్దపెద్ద గొడుగులు ఏర్పాటు చేసుకుని ఎండనుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో కూలీలు గొడుగు ఏర్పాటు చేసుకుని ఓ ఇంటి నిర్మాణానికి గుంతను తీస్తున్నారు. మరో వైపు మహిళలు ఎండ తీవ్రతను చెట్ల కింద సేదతీరుతున్నారు. – దుద్యాల్ వామ్మో.. మురుగు! దుద్యాల్: మండల కేంద్రంలోని పదోవార్డులో ఇళ్ల మధ్య మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇళ్ల మధ్య మురుగునీరు చేరడంతో అక్కడ దోమలు విజృంభిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రయితే చాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నిద్రకు దూరమవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తునారు. ఇళ్ల మధ్య చేరిన నీరు విజృంభిస్తున్న దోమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు పట్టించుకోని అధికారులు -
జాతీయ రహదారిపై కూలిన చెట్టు
చేవెళ్ల: ఈదురుగాలులతో కూడిన వర్షానికి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మర్రిచెట్టు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో మండలంలోని మీర్జాపుర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద మర్రిచెట్టు కూలింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో ఇరువైపులా కిలోమీటర్‌కుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. భారీగా ట్రాఫిక్ జాం -
తాటిచెట్టుపై నుంచి పడి..
వ్యక్తికి గాయాలు కుల్కచర్ల: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తికి గాయాలైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..కుల్కచర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన విఠల్ లక్ష్మయ్య గురువారం ఉదయం తాటిముంజలు కోయడానికి తాటిచెట్టు ఎక్కాడు. తాటిముంజలు కోసిన అనంతరం క్రిందికి దిగుతున్న క్రమంలో కాలుజారి క్రిందపడినట్లు స్థానికులు, బాధితుడు వివరించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే 108కు సమాచారం చేరవేశారు. అతడిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రెండు చేతులకు మణికట్టు వద్ద ఎముకలు విరిగినట్లు వారు ధ్రువీకరించారు. దుకాణ సముదాయంలో సెల్‌ఫోన్ చోరీ కుల్కచర్ల: దుకాణ సముదాయంలో సెల్‌ఫోన్ చోరీ చేసిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో చిన్న మళ్లికార్జున్ అనే వ్యక్తి దుకాణ సముదాయంలో గురువారం మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దుకాణానికి వచ్చాడు. అక్కడ దుకాణంలో ఉన్న వ్యక్తి లోపలికి వెళ్లడంతో ఎవరూ లేని విషయాన్ని గమనించి గుర్తుతెలియని వ్యక్తి కౌంటర్ వద్ద పెట్టిన యాపిల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం గురించి బాధిత వ్యక్తి పోలీసులకు ఫీర్యాదు చేశాడు. పోక్సో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారం రూ.30 వేల జరిమానా ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమపేరుతో బాలికను మోసం చేసి, వివాహం చేసుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎంపీపటేల్‌గూడకు చెందిన జంగం నరేందర్ (20) మేసీ్త్ర పని చేస్తుండేవాడు. ఇదే గ్రామంలోని ఓ ఇంట్లో పనులు చేస్తుండగా.. బాలిక పరిచమైంది. ప్రేమ పేరుతో ఆమెను అపహరించి, పెళ్లి చేసుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై 2018లో ఆదిబట్ల పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోక్సో చట్టం ప్రకారం నరేందర్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నరేందర్‌కు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. బాధితురాలికి రూ.40 లక్షల పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, రఘు వాదనలు వినిపించినట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ పరువునష్టం కేసు వాయిదా గైర్హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి సిటీ కోర్టులు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంతో న్యాయస్థానం విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఫిర్యాదుదారుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కూడా గైర్హాజరయ్యారు. ప్రతివాది అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కార్యకలాపాల నేపథ్యంలో కోర్టుకు రాలేకపోయారని ఆయన తరుఫు న్యాయవాదులు విశ్వేశ్వర్రావు కోర్టుకు సూచిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. టీచర్ పర్స్ పోయిందని.. విద్యార్థిని పరీక్ష రాయనీయని వైనం కొందుర్గు: పాఠశాలలో ఉపాధ్యాయురాలి పర్స్ పోయిందనే అనుమానంతో.. ఓ విద్యార్థిని వార్షిక పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాఠశాలలో గ్రంథాలయ బాధ్యతలు చూసుకునే ఉపాధ్యాయురాలు స్వాతి పర్స్ మిస్ అయ్యింది. అందులో ట్యాబ్లెట్లతో పాటు ఏటీఎం కార్డు, రూ.100 ఉన్నాయని స్వాతి తెలిపారు. అయితే ఈ పర్స్‌ను 9వ తరగతికి చెందిన ఓ విద్యార్థి తీసుకున్నాడనే అనుమానంతో గురువారం ఉదయం జరిగిన వార్షిక పరీక్షను క్లాస్ టీచర్ రాయనీయలేదు. అంతేకాకుండా పర్స్ తీసుకొచ్చాక పరీక్ష రాయాలని ఆదేశించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రిన్సిపల్ కుర్షీద్ సదరు విద్యార్థిని తన ఎదుట కూర్చోబెట్టుకుని పరీక్ష రాయించారు. ఇదిలా ఉండగా టీచర్ పర్స్ మాత్రం ఎక్కడా దొరకకపోవడం గమనార్హం. -
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
చేవెళ్ల: సొంతూరుకు వెళ్తానని బయలుదేరిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలం మక్తగూడ గ్రామానికి చెందిన బుత్తుల వెంకటయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలంగా చేవెళ్లలో నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో సొంతూరు మక్తగూడకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. తరువాత అతని భార్య శ్రీలత ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మక్తగూడకు వెళ్లి ఉండవచ్చని భావించి బుధవారం రాత్రి శ్రీలత తన అత్తకు ఫోన్ చేసింది. ఆయన అక్కడికి వెళ్లలేడని తెలిసి గురువారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హీమోఫిలియానిర్మూలనకు కృషి డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మిషాద్నగర్: ప్రతిఒక్కరూ హీమోఫిలియా నిర్మూలనకు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ప్రపంచ హెమోఫిలియా దినోత్సవాన్ని పురస్కరించుకొని చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... హీమో ఫిలియా అనేది వంశపారపర్యంగా వస్తుందని, ఇది రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. మగవారిలో చిన్నచిన్న గాయాలై రక్తస్రావం కారణంగా మరణానికి కారణం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు జగదీష్, సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డీపీఎంఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్లు చంద్రకళ, శ్రీరామ, అమృత, ల్యాబ్ టెక్నీషియన్ శివ, గౌస్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణ సమీపంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ నీతాపోలే ఆధ్వర్యంలో ప్రపంచ హెమోఫిలియా దినోత్సవాన్ని నిర్వహించారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. పేదల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించామని పేర్కొన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు దశల వారీ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.ఎక్కడ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా కట్టించిన పాపాన పోలేదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలోనే పేదోడి సొంతింటి కళను నెరవేరుస్తున్నారని అన్నారు.అనంతరంతహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్త భనవ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి పట్టణంలోని బీసీ వసతి గృహానికి వెళ్లారు. అక్కడి సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు శ్రీను, తౌర్యనాయక్ పాల్గొన్నారు. కేంద్రం కుట్రలు మానుకోవాలి అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు బుధవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీట్లో చేర్చడం ముమ్మాటికీ ప్రతీకారమే అన్నారు. ప్రధాని మోదీ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, నర్సింలు, సురేందర్, కృష్ణ, రమేష్‌కుమార్, ముత్తాహర్ షపీఫ్, మాజీ కౌన్సిలర్లు మురళీ, వేణుగోపాల్‌రెడ్డి, రెడ్యానాయక్, ఆసీఫ్, శ్రీనివాస్, జంగయ్య, యాదయ్య, నర్సింలు, మధుకర్, ఉస్మాన్, ఖలీద్, నిఖిల్‌రెడ్డి, అశోక్, రహీం, మథిన్ తదితరులు పాల్గొన్నారు. దశల వారీగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
నేడు కొడంగల్‌కు మంత్రి పొంగులేటి రాక
కొడంగల్: రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం కొడంగల్‌కు రానున్నారు. తెలంగాణ భూ భారతి ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో ప్రవేశపెట్టనున్నారు. అందులో ఒకటి కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఉంది. కాజీపూర్‌లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి పోర్టల్‌ను మంత్రి పొంగులేటి గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి హాజరుకానున్నారు. కరణం పురుషోత్తంరావుకు నంది అవార్డు తాండూరు టౌన్: తాండూరు పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది, రాజకీయ, సామాజిక వేత్త కరణం పురుషోత్తం రావుకు నంది అవార్డు లభించింది. బుధవారం హైదరాబాద్‌లో ఉజ్వల సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన ఉగాది నంది పురస్కారాల ప్రదానోత్సవంలో కరణంకు అవార్డు దక్కింది. 42 సంవత్సరాలుగా రాజకీయ నాయకునిగా, సామాజిక వేత్తగా సేవలందించినందుకు గాను నంది పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాలకు గాను అవార్డు దక్కడం సంతోషంగా ఉంద న్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని పేర్కొన్నారు. పురుషోత్తం రావును పలువురు రాజకీయ నాయకులు, పట్టణ వాసులు అభినందించారు. కార్యక్రమంలో ఉజ్వల సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షురాలు ఎం లక్ష్మి, దైవజ్ఞశర్మ, ప్రజాపతి, పార్థ సారథిరెడ్డి, బాలరాజ్, శ్రీలత పాల్గొన్నారు. జీవాలకు టీకాలు తప్పనిసరి జిల్లా పశువైద్యాధికారి సదానందం నవాబుపేట: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి సదానందం సూచించారు. బుధవారం మండలంలోని ఎల్లకొండ, చిట్టిగిద్ద, నవాబుపేట గ్రామాల్లో పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మే 15తేదీ వరకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వనాథ్, సిబ్బంది శ్రీరాములు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కళ్ల సంరక్షణపై జాగ్రత్తలు అవసరం ● డీఎంహెచ్ఓ వెంకటరవణ ● విద్యార్థినులకు కంటి అద్దాల పంపిణీ అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కూల్ ఐ స్క్రీనింగ్‌లో భాగంగా కంటి లోపం ఉన్న విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్ఓ వెంకటరవణ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని కేజీబీవీలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సంరక్షణ చాలా ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి కళ్లను కాపాడుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 69,201 విద్యార్థులకు కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారిలో 55 మంది పిల్లలకు శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు పంపినట్లు వివరించారు. 3,088 మంది విద్యార్థులకు కంటి అద్దా లు అవసరమని గుర్తించి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.ప్రతి ఏటా కంటి పరీక్షలు చేయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మంచి ఆహారం, స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జీవరాజు, డాక్టర్లు బుచ్చిబాబు, ప్రవీణ్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, స్వామినాథ్, ఆర్బీఎస్కే బృందం పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
● ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ దుద్యాల్: ఆరుగాలం కష్టించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోరాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ సూచించారు. బుధవారం మండలంలోని పోలేపల్లి, చిలుముల మైల్వార్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళారులు ఎక్కువ ధర ఆశచూసి తూకంలో మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. క్వింటాలుఏ – గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, బీ గ్రేడ్‌కు రూ.2,300 చెల్లిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు జ్యోతి, మాణిక్య శ్రీ,, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వెంకటయ్య గౌడ్, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సన్నబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు
● అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్అనంతగిరి: రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని ప్రజలు నమ్మరాదని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సూచించారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సన్న బియ్యంలో ప్లాస్టిక్ బిల్డింగ్ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. గోదావరిఖని పెద్దపల్లి జిల్లాలోని తిలక్ నగర్లో రేషన్ షాపులో సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ప్రచారం చేసిన వారిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసినట్లు లిపారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించండి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారంలో గల స్వామీ వివేకానంద స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బాలుర వసతి గృహం) పాఠశాలను బుధవారం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ రికార్డులను పరిశీలించారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారాని అని ఆరా తీశారు. ప్రతి నెలా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ జయసుధ తదితరులు ఉన్నారు. రేషన్ షాపులో తనిఖీలు పూడూరు: మండలంలోని గొంగుపల్లి రేషన్ షాప్‌ను బుధవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, డీఎస్ఓ మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
● మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవింద్‌రాజు తాండూరు టౌన్: మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించే వారి అనుమతులను రద్దు చేస్తామని గనుల శాఖ డిప్యూటీ డైరక్టర్ గోవింద్‌రాజు అన్నారు. పట్టణంలోని మైనింగ్ శాఖ కార్యాలయంలో ఏడీ సత్యనారాయణతో కలిసి బుధ వారం లీజుదారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుద్ద తవ్వకాలకు అనుమతులు పొందిన లీజుదారులు నిబంధనల ప్రకారమే తవ్వకాలు చేపట్టాలన్నారు. 2011నుంచి 2025 వరకు 22 మందిపై పెనాల్టీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే అపరాధ రుసుంలు చెల్లించారని, మిగిలిన 16మంది రూ.1.06 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి మైనింగ్ శాఖ జిల్లాకు రూ.151 కోట్ల టార్గెట్ ఇచ్చిందని, ఇందులో రూ.133 కోట్ల ఆదాయం వచ్చిందని డీడీ తెలిపారు. -
ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
దివ్యాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ దోమ: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని దివ్యాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ కోరారు. బుధవారం మండలంలోని కొత్తపల్లిలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమకు అనేక హామీలు ఇచ్చిందని, ఏడాది పాలన పూర్తయినా అమలు చేయడం లేదని ఆరోపించారు. దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం కల్పించాలని అన్ని పార్టీలను కోరారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛను మొత్తాన్ని రూ.6 వేల పెంచాలని కోరారు. అలాగే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగుల సంక్షేమ శాఖ, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. లేని పక్షంలో సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి నుంచి నిరసన పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. -
మూన్‌వాకర్ వంశీపై డాక్యుమెంటరీ
త్వరలో ఇండియా టీవీ చానల్లో ప్రసారంతాండూరు టౌన్: తాండూరు పట్టణానికి చెందిన మూన్‌వాకర్ వంశీకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో ఇండియా టీవీ చానల్లో ఆయన డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దివంగత ప్రముఖ డాన్సర్ మైఖేల్ జాక్సన్ మూన్ వాక్ రికార్డును బద్ధలు కొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇండియా టీవీ ఆధ్వర్యంలో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రను ఆరు నిమిషాల పాటు డాక్యుమెంటరీ రూపంలో ఇవ్వనున్నారు. ఈ మేరకు వంశీకృష్ణకు సదరు చానల్ నుంచి మెయిల్ ద్వారా సందేశం అందింది. ఈ అరుదైన అవకాశం తాండూరు వాసికి దక్కినందుకు పలువురు ఆయనను అభినందించారు. -
బ్యాంక్ సేవలను విస్తరిస్తాం
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ● లక్ష్మీనారాయణపూర్లోహెచ్డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభం యాలాల: మారుమూల ప్రాంతాల రైతులకు సైతం హెచ్‌డీసీసీబీ సేవలు అందేలా చూస్తామనిఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌లో హెచ్‌డీసీసీబీ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇక్కడ బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు గుర్తుచేశారు. రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని సొసైటీల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 నాటికి డీసీసీబీ టర్నోవర్ రూ.600 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు చేరిందన్నారు. సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగుల భద్రత కోసం పోరాటం చేసి జీఓ 44ను సాధించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. సొసైటీల ఆధ్వర్యంలో గోదాంలు, రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు, ఫంక్షన్ హాళ్లు తదితర వాటికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. లక్ష్మీనారాయణపూర్ బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో మూడు శాఖల ఏర్పాటుకు కృషి హెచ్‌డీసీసీబీ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో మరో మూడు బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బషీరాబాద్, పెద్దేముల్, కరణ్‌కోట గ్రామాల్లో కొత్తగా శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్యయ్య, మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, డైరెక్టర్లు రాజు, మొగులయ్య, వెంకటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భీమప్ప, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్ బాబా, నాయకులు సత్యనారాయణరెడ్డి, రఘు, లక్ష్మీకాంత్‌రెడ్డి, బ్యాంక్ మేనేజర్లు మనోహర్‌రావు, తిరుపతయ్య, అసిస్టెంట్ మేనేజర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. ఆగమాగం!
గంటపాటు తీవ్ర గాలులతో కూడిన వడగండ్ల వాన ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, చెట్లు, తెగి పడిన తీగలు ● మూడు గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిపివేత తాండూరు రూరల్/మోమిన్‌పేట: అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా గాలివాన, వడగండ్ల వర్షం భయపెట్టింది. గంటపాటు తీవ్ర గాలులు వీచాయి. పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు నేలకొరిగాయి, గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. పెద్దేముల్ మండలం అడికిచెర్ల, ఊరెంటితండా, బాయిమీది తండాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన, వడగండ్ల వర్షం పడింది. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. తట్టేపల్లి 11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను ఆపేశారు. రతన్సింగ్రైతు పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నెలకొరిగింది. మూడు స్తంభాలు పడిపోయాయి. అధికారులు కరెంట్ సరఫరాను ఆపేశారు. గురువారం ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. మోమిన్‌పేట మండలంలో బుధవారం ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. -
ఖాతాదారులు ఆందోళన చెందొద్దు
తాండూరు రూరల్: కరన్‌కోట్ గ్రామ సమీపంలోని సీసీఐ టౌన్షిప్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ఖాతాదారులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని బ్యాంక్ మేనేజర్ టి.భువన్ మోహన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంక్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కాలిపోయిందన్నారు. బ్యాంక్‌లో 6 వేల మందికి సంబంధించిన ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కరన్‌కోట్‌లోని బ్యాంక్‌లో కార్యకలపాలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. కావున బ్యాంక్ ఖాతాదారులు లావాదేవిలకు సంబంధించి తాండూరు పట్టణంలోని శాంత్ మహల్ వద్ద ఎస్బీఐ (ఏడీబీ)లో రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కరన్‌కోట్ గ్రామంలో కస్టమర్ సర్వీస్ పాయింట్(సీఎస్పీ)లో కూడా ఖాతాదారులు నగదు డిపాజిట్లు, ఉపసంహరణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రుణాల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత ప్రస్తుతం బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం వలన కంప్యూటర్లతో పాటు ఫర్నిచర్ పూర్తిగా కాలిపోవడంతో ఖాతాదారులకు పంట రుణాలు, గోల్డ్‌లోన్, పర్సనల్లోన్కు సంబంధించి ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశామని బ్యాంక్ మేనేజర్ భువన్ మోహన్ తెలిపారు. వారం రోజుల్లో రోజువారి బ్యాంక్ లావాదేవిలకు సంబంధించి కార్యకలపాలు పునరుద్దరిస్తామన్నారు. తాండూరు ఎస్బీఐలో తాత్కాలిక లావాదేవిల కార్యకలాపాలు వివరాలు వెల్లడించిన బ్యాంక్ మేనేజర్ భువన్ మోహన్ -
అనుమతుల పేరిట అడ్డగోలు ఇసుక రవాణా
యాలాల: అనుమతుల పేరిట తీసుకున్న ఇసుక రవాణాను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో యాలాల గ్రామస్తులు మండిపడుతున్నారు. బుధవారం గోవిందరావుపేట నుంచి తాండూరుకు ఇసుక తరలింపునకు యాలాల రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు. కాగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కో ట్రాక్టరుకు నిర్దేషించి ట్రిప్పులను వివరిస్తూ అనుమతి పత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో అనుమతులు పొందిన ఇసుక ట్రాక్టర్లు ఉదయం 7 గంటలకే కాగ్నా వాగులోకి వెళుతున్నాయని, సాయంత్రం 7గంటల వరకు ఇసుక రవాణా చేస్తున్నారని యాలాల మాజీ ఉపసర్పంచ్ గొల్ల శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయమై యాలాల తహసీల్దార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఇసుక రవాణా విషయంలో రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. అధికారుల తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు -
దురలవాట్లు క్యాన్సర్ కారకాలు
తాండూరు టౌన్: జీవనశైలి, దురలవాట్లు క్యాన్సర్‌కు కారకాలుగా మారుతున్నాయని క్యాన్సర్ నిపుణులు డాక్టర్ సీఎన్ శ్రీకాంత్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, యువ జాగృతి సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. శరీరంలో ఏర్పడే మార్పులను జాగ్రత్తగా గమనించాలన్నారు. పొగాకు, గుట్కా, కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. నొప్పి లేని చిన్న కణుతుల విషయంలో జాగ్రత్త పడాలన్నారు. సకాలంలో వైద్యున్ని సంప్రదించాలని, క్యాన్సర్ బారిన పడితే కీమోథెరపి, రేడియో థెరపితో పాటు పలు రకాల చికిత్సల ద్వారా క్యాన్సర్‌ను నయం చేయొచ్చన్నారు. అనంతరం ప్రజలు పలు సందేహాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు క్యాన్సర్‌పై ఎన్నో అనుమానాలున్నాయన్నారు. ఇలాంటి ప్రజోపయోగ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఐఎంఏ, యువజాగృతి సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్, యువజాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణ పేర్కొన్నారు. -
ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోరా?
పరిగి: ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై అక్రమంగా పిల్లర్ ఏర్పాటు చేస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరించడం గమనార్హం. నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి కట్టడం చేపట్టిన చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. పట్టణ కేంద్రంలోని బహార్పేట్లోని కొత్తగా ఏర్పాటు చేస్తున్న హెచ్డీఎఫ్ బ్యాంకు ఎదుట ఇంటి యజమాని అక్రమంగా ఫుట్‌పాత్‌ను ఆక్రమించి పిల్లర్‌ను ఏర్పాటు చేశారు. పాదచారులు నడవాల్సిన స్థలంలో పిల్లర్‌ని ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు సెట్‌బ్యాక్ తీసుకోకపోతే పనులను ఆపివేసే మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అక్రమనిర్మాణాలపై ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కుల్కచర్ల: ప్రతిఒక్కరూ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ మేనేజర్ పార్వతి పేర్కొన్నారు. బుధవారం చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలోని ఎస్బీఐ ఎదుట కళాజాత నిర్వహించారు. సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, తదితర బ్యాంకింగ్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించొద్దన్నారు. మీకు లోన్ ఇస్తామని అందుకు కొంత డబ్బులు అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుందని, మీ నంబర్ లక్కీడ్రాలో ఎంపిక అయ్యిందని వివిధ మోసపూరిత మాటలతో నమ్మబలికేవిధంగా మాట్లాడితే అలాంటి ఫోన్ కాల్స్‌కి సమాధానమియొద్దన్నారు. మోసపూరితమైన మాటలు నమ్మితే ఆర్థికంగా నష్టపోతారని హెచ్చరించారు. ఏదైనా అనుమానం ఉంటే బ్యాంకుకు వచ్చి తమతమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింహా రెడ్డి, కిరణ్‌కుమార్, సత్యకుమార్, కటికె శ్రీనివాస్‌లు, కృష్ణచారి, నర్సింలు, సత్యం, విజయ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం ఇలాఖాలో ప్రగతి ‘బాటలు’
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పల్లెలు, గిరిజన తండాలు, గల్లీలు సైతం అభివృద్ధి పనులతో ప్రగతి పట్టాయని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని మెట్లకుంట, బురాన్‌పూర్, బొంరాస్‌పేట, ఏర్పుమళ్ల, చౌదర్పల్లి గ్రామాలకు రూ.కోట్ల నిధులతో డబుల్ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల నియోజకవర్గం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. చౌదర్పల్లి, నాందార్‌పూర్ – ఏర్పుమళ్ల, ఏర్పుమళ్ల – బుద్లాపూర్, బొంరాస్‌పేట – నాగారం, బొంరాస్‌పేట – బుర్రితండా, మెట్లకుంట – లోతికుంటతండా, బొంరాపేట – తుంకిమెట్ల డబుల్ రోడ్డు నిరాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకన్‌గౌడ్, పార్టీ నాయకులు నర్సింలుగౌడ్, వెంకట్రాములుగౌడ్, జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, నర్సింలు నాయుడు, రాములు, రవిగౌడ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రూ.58.99కోట్ల నిధులతో డబుల్ రోడ్లకు శంకుస్థాపనలు -
శిలాఫలకంలో పేర్లు లేవని..
యాలాల: మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్‌లో బుధవారం హెచ్‌డీసీసీబీ శాఖ బ్యాంకు ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పేర్ల రగడ నెలకొంది. బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తన పేరు లేకపోవడంపై యాలాల సొసైటీ వైస్ చైర్మన్ వడ్డే రాములు మండిపడ్డారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు వైస్ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు కావడంతో ప్రారంభోత్సవంలో గొడవ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు, బ్యాంకు అధికారులు వైస్ చైర్మన్‌కు నచ్చజెప్పారు. శిలాఫలకంపై తాత్కలికంగా పేరు ఏర్పాటుకు వైస్ చైర్మన్‌ను ఒప్పించారు. ఆయన పేరుపై కొత్త స్టిక్కర్ కోసం బ్యాంకు సిబ్బందిని తాండూరుకు పంపించారు. అప్పటికే ఎమ్మెల్యే లక్ష్మీనారాయణపూర్ రావడానికి సిద్ధమయ్యారు. స్థానిక నాయకులు ప్రొటోకాల్ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన 20 నిమిషాల తరువాత కార్యక్రమానికి హాజరయ్యారు. బ్యాంకు పరిధి అగ్గనూరు గ్రామానిది.. శిలాఫలకంలో తన పేరు లేదని వైస్ చైర్మన్ ఆగ్రహం చేసిన సమయంలో అగ్గనూరు గ్రామానికి చెందిన కొందరూ నాయకులు అక్కడికి చేరుకున్నారు. డీసీసీబీ బ్యాంకు అగ్గనూరు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారని, బ్యాంకు బోర్డుపై తమ గ్రామం పేరు ఉండాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎమ్మెల్యే గ్రామస్తులకు నచ్చజెప్పారు. ఆర్బీఐ నుంచి వచ్చిన అనుమతి పత్రాల్లో బ్యాంకు చిరునామాలో లక్ష్మీనారాయణపూర్ ఉందని, అయినప్పటికీ బోర్డుపై అగ్గనూరు పేరు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కాగా ప్రొటోకాల్, ఊరిపేరు అంశం బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ప్రారంభ కార్యక్రమంలో నాయకుల ఆందోళన -
వైభవంగా భద్రేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
తాండూరు టౌన్: శ్రీభావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు పటేల్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉత్సవాలకు నాయకులు ప్రజా ప్రతినిధులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వందలాది మంది భక్తుల సమక్షంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో శోభయాత్ర నిర్వహించారు. పురంతయ్యల విన్యాసాలు, విద్యార్థుల నృత్యాల మధ్య కోలాహలంగా మొదటి రోజు నిర్వహించారు. మొదటి రోజు ఆలయం నుంచి గాంధీచౌక్, రాచన్న దేవాలయం వరకు పల్లకీ సేవ నిర్వహించారు. వీరశైవ సమాజం సభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలలో తాండూరు పట్టణ సీఐ సంతోశ్ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. -
బాక్సింగ్‌లో మెరిసిన గిరిజన బిడ్డ
రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మన్సాన్పల్లికి చెందిన విఠల్‌నాయక్, దేవీబాయ్ల కూతు రు నిఖిత రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్సింగ్ గిరిజన గురుకులంలో ఇంటర్ ద్వితీ య సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11, 12వ తేదీల్లో సికింద్రాబాద్‌లో జరిగిన అండర్ –19 బాలికల విభాగం పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. దరఖాస్తు గడువు పెంచాలి బంట్వారం: రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు స్వీకరణ గడువును ఈ నెల చివరి వరకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్ యాదవ్ కోరారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగియనున్నందున చాలా మంది అప్లయ్ చేసుకోలేదని తెలిపారు. నెట్వర్క్ సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వరుస సెలవుల కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని గడువు పెంచితే బాగుంటుందని తెలిపారు. ఈ విషయా న్ని తాము ఆయా శాఖల ఉన్నతాధికారులకు విన్నవించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి గడువు పొడిగించాలని ఆయన కోరారు. రోడ్డు పనుల పరిశీలన ధారూరు: మండలంలోని అల్లిపూర్ నుంచి తాండూరు – హైదరాబాద్ ప్రధాన రహదారి వరకు జరుగుతున్న రోడ్డు పనులను సోమ వారం పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి విశ్రాంత అడిషన్ ఎస్పీ మధుసూదన్‌రావు తాండూరు రూరల్: యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని విశ్రాంత అడిషన్ ఎస్పీ మధుసూదన్‌రావు సూచించారు. సోమవారం పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో సీనియర్ నాయకుడు ప్రభుకుమార్ తల్లిదండ్రుల(మొగులప్ప, చంద్రమ్మ) జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి చూపకపోవడం బాధాకరమన్నారు. చదువుతోపాటు ఆటల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, అంజయ్య, నర్సింలు, శంకర్‌నాయక్, లక్ష్మణ్, రాజప్పగౌడ్ తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు శంషాబాద్ డీసీపీ రాజేష్ కొందుర్గు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని శంషాబాద్ డీసీపీ రాజేష్ హెచ్చరించారు. కొందుర్గు పోలీసుస్టేషన్ సోమవారం సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. పీఎస్ రికార్డులు, కేసు ఫైళ్లు, పోలీసు క్వార్టర్స్, పీఎస్‌లో వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది 100 డయల్‌కు కాల్ వచ్చిన వెంటనే జాప్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య, ఎస్సైలు రవీందర్ నాయక్, బాలస్వామి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి పెద్దపీట
● స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నా రు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశా రు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. వికారాబాద్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని కాపాడుకుందాం
● యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య షాద్‌నగర్: విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య అన్నారు. పట్టణంలోని ఎంఆర్సీ భవనంలో సోమవారం సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు అధ్యక్షతన ‘పాఠశాల విద్య–ప్రభుత్వ విధానం, మనకర్తవ్యం’అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జంగయ్య మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ–2020) పేద వర్గాలకు నాణ్యమై విద్యను దూరం చేసేవిధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను కేంద్రీకరించేలా, కార్పొరేటీకరణకు అనుకూలంగా ఉందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి మండలంలో 4 నుంచి 5 పాఠశాలలను ఎంపిక చేసుకొని ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలలు ఒకే దగ్గర ఉండేలా, 6 నుంచి 12వ తరగతి వరకు ఒక క్యాంపస్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సత్యం, రామకృష్ణ, వినీత్, శేఖర్‌గౌడ్, బాలయ్య, జేవీవీ నాయకులు వెంకటరమణ, కుర్మయ్య, సీఐటీయూ నాయకుడు రాజు, టీజీఎస్, ఎస్ఎఫ్ఐ, డీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
చక్రస్నానం.. తరించిన భక్త జనం
● ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ● చివరిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొయినాబాద్: ఎనిమిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రస్నానంతో ముగిశాయి. చివరిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం దేవాలయంలోని హోమగుండాల గదిలో పూర్ణహు తి చేపట్టారు. పూర్ణాహుతి ప్రసాదాన్ని అష్టదిక్పాలకులకు నైవేద్యంగా సమర్పించి బలిహరణం చేశారు. అంతకు ముందు స్వామివారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా అద్దాలపల్లకీలో ఆసీనులను చేసి అలంకరించారు. అనంతరం చక్రస్వామి, నవపాలికలు, స్వామివారిని పల్లకిలో దేవాలయం చుట్టూ ఊరేగించారు. శివాలయం పక్కనే ఉన్న మండపంలో నవకలశ స్థాపనం, పాలికల పూజతో దేవుళ్లందరినీ ఆవాహనం చేసి సుగంధద్రవ్యాలతో నవకలశ అభిషేకం నిర్వహించారు. చక్రస్వామిని ఆలయ సమీపంలో ఉన్న గండిపేట చెరువులోకి తీసుకెళ్లి చక్రస్నానం చేయించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ చక్రతీర్థాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్, కిట్టు, కన్నయ్య, మురళి పాల్గొన్నారు. దర్శించుకున్న పట్నం మహేందర్‌రెడ్డి మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు రంగరాజన్ ఆయనకు పూలమాల వేసి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, చిలుకూరు మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుండు గోపాల్, నాయకులు భిక్షపతి, బాల్‌రాజ్, శంకర్ తదితరులు ఉన్నారు. తరలివచ్చిన భక్తజనం బ్రహ్మోత్సవాల చివరిరోజు పరిసర ప్రాంతాలతోపాటు నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చక్రతీర్థం సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి అధికంగా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ధ్వజావరోహణంతో ముగింపుబ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా వస్త్రంపై గరుడ పటాన్ని చిత్రించి ధ్వజస్తంభానికి ఆరోహణం చేసిన వస్త్రాన్ని ముగింపు సూచికగా అవరోహణం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు. -
పిడుగుపాటుకు పాడి ఆవులు మృత్యువాత
కుల్కచర్ల: పిడుగుపాటుకు రెండు పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చౌడాపూర్ మండలం టాక్య్రానాయక్ తండాలో చోటుచేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన ముడావత్ పార్వతమ్మ తనకున్న రెండు ఆవులను రోజు మాదిరిగానే పొలంవద్ద కట్టేసి ఇంటికి వచ్చింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి అకస్మాత్తుగా పిడుగుపడడంతో అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన ఆవుల విలువ సుమారు రూ.1.50లక్షలు ఉంటుందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. ఇప్పాయిపల్లిలో కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల రవీందర్ ఇంటి ఎదుట ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగుపడటంతో మంటలు చెలరేగాయి. పైభాగంగా పూర్తిగా కాళిపోయింది. పచ్చనిచెట్టు మంటలు చెలరేగి కొమ్మలు బొగ్గులుగా కిందపడుతుండడంతో ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
కుల్కచర్ల: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ అన్నారు. సోమవారం ఆయన చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.5 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రతీ కాలనీకి సీసీ రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్, దామోదర్‌రెడ్డి, నరేందర్, రాజు, వెంకటయ్య, జహంగీర్, నర్సింలు, స్థానిక నాయకులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. కుల్కచర్ల ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ -
తండాల్లో తాగు నీటికి తండ్లాట
దుద్యాల్: తాగునీటి కోసం గిరిజనులకు తండ్లాట తప్పడం లేదు. ప్రభుత్వం బోరు వేయించినా మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఏడాది నుంచి నిరుపయోగంగా గానే ఉంది. చేసేదేమీ లేక తండావాసులు వ్యవసాయ బోర్ల బాటపడుతున్నారు. మండల పరిధిలోని ముచ్చుకుంట తండా, బోయి నగడ్డ తండాల్లో 500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని పలుమార్లు అధికారులను కోరారు. ఇందుకు స్పందించిన అధికారులు రెండు తండాలకు తాగునీరు అందించేందుకుగాను గత ఏడాది జూలైలో బోరు వేయించారు. తదనంత విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అది వృథాగా మారింది. వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీరు సైతం సరిపడా రావని స్థానికులు వాపోతున్నారు. ఏళ్ల నుంచి తమకు వ్యవసాయ బోర్ల నుంచి నీటి తెచ్చుకోవడం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మోటారు మరమ్మతులు చేయించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని గిరిజనం కోరుతున్నారు. ఏడాది క్రితం బోరు వేయించిన ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో అధికారుల అలసత్వం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న గిరిజనం -
పార్కు స్థలాన్ని చదును చేసిన వ్యక్తిపై కేసు
రాజేంద్రనగర్: పార్కు స్థలాన్ని చదును చేసిన వ్యక్తిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో సమాచారం మేరకు... స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పురా భవానీకాలనీలో గతంలో లకన్ సింగ్ అనే వ్యక్తి వెంచర్ చేసి 1000 గజాల పార్కు స్థలాన్ని వదిలారు. కాలనీ ప్రజలు ఈ పార్కు స్థలాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థలం విలువలు పెరిగిపోవడంతో సోమవారం ఉదయం జేసీబీతో లకన్ సింగ్ పార్కు స్థలం వద్దకు వచ్చాడు. జేసీబీతో చదును చేస్తుండగా కాలనీవాసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లకన్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని జేసీబీని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి రాజేంద్రనగర్: గుర్తు తెలియని మృతదేహం లభించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని... మృతుడి ఒంటిపై బ్లూ కలర్ ప్యాంట్, బ్లూ కలర్ షర్ట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రాజేంద్రనగర్ పోలీసులకు కానీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ సిబ్బందిని సంప్రదించాలన్నారు. క్రషర్ మెషిన్లో పడి కార్మికుడి మృతి మేడ్చల్‌రూరల్: క్రషర్ మెషీన్లో పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మద్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనీష్‌సింగ్(27) గిర్మాపూర్‌లోని రోబో సిలికాన్ క్రషర్ మెషీన్లో ప్లాంట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున విధుల్లో ఉన్న అతను ప్రమాదవశాత్తు క్రషర్ మెషీన్లో పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత
తాండూరు టౌన్: హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో విజేతలకు హనుమాన్ జన్మోత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం బహుమతులు అందజేశారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతిగా హోండా యూనికాన్ బైక్‌ను విజేత గుముడాల సుధాకర్ (నం.9253), ద్వితీయ బహుమతిగా హోండా యాక్టీవాను విష్ణురాంజీకి (నం.6981) స్థానిక స్టేషన్ హనుమాన్ ఆలయ చైర్మన్ మిస్కిన్ శంకర్, నరహరి అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు రజినీకాంత్, మహేష్ ఠాకూర్, రామకృష్ణ, పునీత్, భవానీ సింగ్, గురురాజ్, శ్రీనివాస్, ఆనంద్, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పరామర్శ తాండూరు రూరల్: మండల పరిధిలోని సంగెంకలాన్ గ్రామానికి చెందిన ఎల్మకన్నె పీఏసీఏస్ మాజీ చైర్మన్ సంగెం నారాయణగౌడ్ సతీమణి ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం నారాయణగౌడ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంగెం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. అంతియ యాత్రలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మాజీ సర్పంచ్ మేఘనాథ్‌గౌడ్, నాయకులు రవీందర్, కేశవరావు, పండరి, సాయిలు, బోయ రాజు, హమీద్ మియా, శ్యామప్ప ,శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో దర్గా ఉత్సవాలు నవాబుపేట: మండల పరిధిలోని ఎక్మామిడి గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న సాహెబ్ హుస్సేన్ దర్గా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతన్నాయి. ఈ ఉత్సవాలకు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ ఎండీ రశీ, నాయకులు యాదవరెడ్డి, పాపిరెడ్డి, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభోత్సవం పూడూరు: ప్రతీ ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కెరవెళ్లి గేటువద్ద కాంగ్రెస్ నాయకుడు అలీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, రఘునాథ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, కార్యదర్శి పెంటయ్య, నాయకులు మోహిన్‌పాషా, కరీం తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
కొడంగల్: భూ భారతితో సమస్యలు పరిష్కారం అవుతాయని మండల వ్యవసాయాధికారి తులసి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పర్సాపూర్ రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు వీక్షించారు. భూ పరిపాలనలో ఒక నూతన శకానికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పారదర్శకంగా జవాబుదారీగా అవినీతి రహితంగా సేవలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు మేలు మోమిన్‌పేట: భూ భారతితో రైతులకు మేలు చేకూరుతుందని మర్పల్లి మార్కెటు కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన భూ భారతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో పాలక వర్గ సభ్యులు వీక్షించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందుల పాలయ్యారన్నారు. రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశ పెట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు, ఏఓ జయశంకర్, ఏఈఓ పెంటయ్య, శ్రీనివాస్ ఉన్నారు. మండల వ్యవసాయాధికారి తులసి -
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
దోమ: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లిలో కాళికామాత జాతర మహోత్సవాలకు హాజరయ్యా రు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్మాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు వెంకటేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాంరెడ్డి, ఓబీసీ మోర్చా కన్వీనర్ విజయ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మహేశ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్, నేతలు నరేశ్, నాగేంద్రం, చంద్రశేఖర్, సంతోష్, ధనుంజయ్, ప్రశాంత్, పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప -
అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం
తాండూరు టౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అజాగ్రత్తగా ఉంటేనే అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వేసవిలో నిప్పుతో అప్రమత్తంగా ఉండాలని, బీడి, సిగరెట్ వంటివి వెలిగించి అలాగే విసరేయరాదన్నారు. వంటిట్లో గ్యాస్ సిలిండర్‌ను అవసరం లేని సమయంలో ఆఫ్ చేసి పెట్టాలన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న అగ్నిప్రమాద నివారణ వారోత్సవాల్లో భాగంగా అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు, జాగ్రత్తలపై పలు ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ జలంధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి -
వేసవి భత్యానికి మంగళం!
దోమ: ఎండలో పనిచేసే ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేసవి భత్యానికి నాలుగేళ్లుగా బ్రేక్ పడింది. ప్రభుత్వం గతంలో ఏటా వేసవి భత్యం అందించడంతో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించేది. కానీ ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో భత్యానికి ఈసారి కూడా మంగళం పాడినట్లేనని తెలుస్తోంది. కొరవడిన స్పష్టత.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పల్లె ప్రజలకు స్థానికంగా పని కల్పిస్తూ భరోసా అందిస్తోంది. దోమ మండల వ్యాప్తంగా 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 11,725 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా, 13,971 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు 3,790 మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఉపాధి హామీ కూలీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు ఐదు నెలల పాటు వారి వేతనానికి అదనంగా 25 నుంచి 30శాతం వేసవి భత్యం చెల్లించేది. కానీ గత నాలుగేళ్లుగా ఇది నిలిచిపోయింది. సౌకర్యాల లేమితో ఇబ్బందులు.. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కరువయ్యాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతుండటంతో మండుటెండల్లో పనిచేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. పని చేస్తున్న చోట కనీసం మంచినీరు, మజ్జిగ, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, టెంట్లు, అందుబాటులో ఉండటం లేదు. గత ప్రభుత్వాలు కూలీలకు టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, పారలతో పాటు ఇతర పనిముట్లను అందించేంది. కానీ పదేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి పరికరాలను అందించడం లేదు. తామే స్వయంగా ఇంటి వద్ద నుంచి పని ముట్లు, నీళ్ల బాటిళ్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉపాధి కూలీలకు అందని అదనపు డబ్బులు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి పని ప్రదేశాల్లో వసతుల కరువు -
అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త
షాద్‌నగర్: అగ్ని ప్రమాదాలపై అందరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం పట్టణంలోని ఫైర్ స్టేషన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం ప్రారంభం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు బాబర్‌ఖాన్, రఘు నాయక్, మంగులాల్ నాయక్, కరుణాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జగన్ తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
అశ్వ వాహనంపై ఊరేగిన బాలాజీ
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు అశ్వ వాహనంపై ఊరేగారు. ఆలయంలో మహాభిషేకం, ఆస్థాన సేవ, దోప్‌సేవ, పుష్పాంజలి సేవలు అందించారు. వేదపండితుల మంత్రోశ్చరణలు.. భక్తుల గోవింద నామస్మరణలు.. డోలు, డప్పు వాయిద్యాల మధ్య చిలుకూరు బాలాజీ దివ్యరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి దివ్యరథోత్సవం శనివారం అర్థరాత్రి కనుల పండువగా సాగింది. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఆసీనులై దేవాలయం చుట్టూ ఊరేగారు. శ్రీదేవి, భూదేవిలను వివాహం చేసుకున్న స్వామివారు వారిని గ్రామస్తులకు చూపించే క్రమంలోనే రథోత్సవం జరుగుతుందని ఆలయ అర్చకుడు రంగరాజన్ భక్తులకు వివరించారు. రాత్రి 11 గంటలకు స్వామివారు, అమ్మవార్లకు అద్దాలమహల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొదటి అంతస్తులో ఆసీనులను చేశారు. రథం ముందు అర్చకులు హోమం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు కదిలించారు. స్వామి వారి రథోత్సవంలో పాల్గొనటంతోపాటు రథాన్ని తాకితే అంతామంచి జరగుతుందన్న విశ్వాసంతో భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన కన్నయ్య, కిట్టు, మురళి పాల్గొన్నారు. వైభవంగా రథోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు -
పన్నుల వసూలులో దూకుడు
వికారాబాద్: పన్నుల వసూలులో జిల్లా పంచాయతీ విభాగం దూకుడు ప్రదర్శించింది. మొదట్లో కాస్త వెనకబడినట్లు కనిపించినా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వేగం పెంచడంతో టార్గెట్‌కు దగ్గరగా వచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి గ్రామ పంచాయతీలు పన్నుల వసూలులో లక్ష్యానికి చేరువయ్యాయి. రెండు నెలల క్రితం వరకు 50శాతం వసూళ్లకే పరిమితమైన యంత్రాంగం ఆ తర్వాత వేగం పెంచింది. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, నిరంతర సమీక్షలు పన్నుల వసూలుకు కలిసొచ్చాయి. పంచాయతీ కార్యదర్శులకు పనిఒత్తిడి ఉన్నా అధిగమించి పురోగతి సాధించారు. పది రోజుల క్రితమే ఆర్థిక సంవత్సరం ముగియగా 93శాతం పన్నులు వసూలు చేశారు. వందశాతానికి చేరువలో.. జిల్లాలో 20 మండలాలు 594 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2,22,954 నివాసాలు ఉన్నాయి. పంచాయతీలు, మండలాల వారీగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు. రూ.9.68 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో పాత బకాయిలు రూ.32.52 లక్షలు ఉండగా రూ.9 కోట్లు వసూలు చేశారు. పన్నులు, ఇతర ట్యాక్సెలు కలిపి 93 శాతం వసూలయ్యాయి. బంట్వారం, కోట్‌పల్లి, వికారాబాద్ మండలాల్లో వంద శాతం చేరుకున్నారు. యాలాల 86 శాతం, పెద్దేముల్ 87 శాతం, దౌల్తాబాద్ 88 శాతం వసూలు చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 93 శాతం టార్గెట్ పూర్తి లక్ష్యం రూ.9.68 కోట్లు.. వసూలు చేసింది రూ.9 కోట్లు మూడు మండలాల్లో వంద శాతం పూర్తి లక్ష్యం చేరుకుంటాం జిల్లాలో పన్నుల వసూలు 93 శాతం దాటింది. నాన్ ట్యాక్సుల వసూలులో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. త్వరలో 100 శాతం లక్ష్యం చేరుకుంటాం. ఈ దిశగా సిబ్బంది పని చేస్తోంది. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నాణ్యమైన సేవలు పొందాలి. – జయసుధ, డీపీఓ -
రైతు నెత్తిన.. విత్తన భారం
షాబాద్: పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవిచూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు నకిలీ విత్తనాల బెడద కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఏటా ధరల దడ ఏటా పత్తి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. విత్తనాలు, పురుగు మందులకు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు కలుపుతీత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తన కంపెనీలు ఏటా ధరలు పెంచుతుండడంతో మరింత భారం పడుతోంది. బీటీ పత్తి విత్తనాల ధర ఆరేళ్లుగా పెరుగుతూ వస్తోంది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం రూ.901కి చేరింది. తగ్గుతున్న పంట దిగుబడి పత్తి పంట వేసిన నాటి నుంచి చేతికొచ్చే వరకు రైతులకు ఆందోళన తప్పడం లేదు. సరైన సమయానికి వర్షాలు పడకపోవడం.. పూత, కాత సమయంలో ఎక్కువగా పడటం తదితర కారణాలతో పంట దిగుబడులపై ప్రభావం చూపుతోంది. చేతికొచ్చిన పంట తీసే సమయంలో కూలీలు దొరక్క నేల రాలి దిగుబడి తక్కువగా వస్తోంది. పెరుగుతున్న పెట్టుబడి పత్తి పంట సాగు చేసేందుకు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు వస్తోంది. దుక్కి దున్నడం నాటి నుంచి భూమిని చదును చేయడం, విత్తనాలు వేయడం, కలుపు, మందుల పిచికారీ, పత్తి తీత కూలీ ఖర్చులు ఉంటాయి. ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటుందని రైతులు చెబుతున్నారు. గతేడాది బీటీ–2 పత్తి విత్తనం 475 గ్రాముల ప్యాకెట్ ధర రూ.867 ఉండగా ఈ ఏడాది రూ.901కి పెరిగింది. ఆయా కంపెనీలు అన్ని రకాల విత్తనాల ధరలు పెంచేశాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్టుబడులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచిన కంపెనీలు ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడు మరింతగా పడనున్న ఆర్థిక భారం ఆందోళనలో అన్నదాతలు ఖర్చులు పెరిగాయి ప్రతీ సంవత్సరం పత్తి పంట సాగు చేసేందుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చు వస్తోంది. విత్తనాల ప్యాకెట్ల ధరల పెంపుతో మరింత భారం పడుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. – విజయభాస్కర్‌రెడ్డి, రైతు, మరియాపురం ధరలు తగ్గించాలి పత్తి విత్తనాల ధరలను ఏ టా పెంచుతుండంతో ఆర్థి క భారం పడుతోంది. పెంచిన ధరలను కంపెనీలు వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. విత్తనాల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్మే దాకా రైతుల చేతిలో ఏదీ ఉండడం లేదు. – నర్సింహారెడ్డి, రైతు, మన్మర్రి -
మహిళల రక్షణకు ‘టీ సేఫ్’
పరిగి: నిత్యం ఎక్కడో ఒక చోట మహిళాలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నగరం నడిబొడ్డున ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర ప్రజలని ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఏడాది క్రితం టీ సేఫ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం మహిళల రక్షణ కోసమే ఈ యాప్‌ను రూపకల్పన చేశారు. అయితే ఏడాది కావస్తున్నా యాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య చాలా తక్కుగా ఉంది. మహిళలు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు టీ సేఫ్ యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా సురక్షితంగా గమ్యం చేరవచ్చని పోలీసులు అంటున్నారు. ఇలా వినియోగించుకోవాలి మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా టీ సేఫ్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే రాష్ట్ర పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చిన యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. హెల్ప్ సిటిజన్ విభాగంలో క్లిక్ చేసి ప్రయాణిస్తున్న ప్రాంతం పేరు ప్రయాణిస్తున్న వాహనం, దాని రిజిస్ట్రేషన్ నంబరు నమోదు చేయాలి. ఒక వేళ రైలు ప్రయాణం చేస్తే ఆ రైలు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. అనంతరం ప్రయాణం ప్రారంభించే ముందు స్టార్ట్ బటన్ నొక్కగానే సదరు సమాచారం పోలీసుల శాఖ పర్యవేక్షణలోకి వెళ్తుంది. ఇక అప్పటి నుంచి ఆ వాహనం లోకేషన్ గమ్యం చేరేవరకు పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం ప్రయాణిస్తున్న వాహనం రూటు మారినా, ప్రయాన సమయానికన్నా ఆలస్యం అయినా పోలీసుల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి మెసేజ్‌లు వస్తాయి. దానికి వినియోగదారుల నుంచి రిప్లే ఇవ్వకుంటే కేసును అనుమానాస్పదంగా పరిగణించి నేరుగా ప్రయాణిస్తున్న వాహనం వివరాలు డయల్ 100కు వెళ్తాయి. లోకేషన్ ఆధారంగా సమీప పోలీస్ స్టేషన్ లేదా పెట్రోలింగ్ వాహనానికి సమాచారం చేరవేస్తారు. నిమిషాల వ్యవధిలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అనుకోని సందర్భాల్లో, విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడే మహిళలను రక్షించేందుకు ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుందని, ఒంటరి మహిళలకు, యువతులకు రక్షణ కవచంలా పని చేస్తుందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అవగాహన లేక సద్వినియోగం చేసుకోని మహిళలు యాప్‌ను వినియోగించుకోవాలి టీ సేఫ్ యాప్ మహిళలు, యువతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సుదూరం వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారికి, కళాశాలలకు వెళ్తున్న యువతులకు, సుదూర ప్ర యాణం చేస్తున్న వారికి చాలా ఉపయోగకరం. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఈ యా ప్ ద్వారా ఘటనా స్థలాన్ని గుర్తించవచ్చు. ప్రతి మహిళ మొబైల్లో ఈ యాప్ ఉండాలి. పోలీస్ శాఖ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారం. – శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి -
విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అనంతగిరి: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం తెలిపారు. ఆదివారం వికారాబాద్‌లో సంఘం 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాము లు, ఉపాధ్యక్షుడు నర్సింలు, కార్యదర్శులు నీలమ్మ, పవన్‌కుమార్, రత్నం, బసప్ప, ము త్యప్ప, జి.రాములు, తిరుపతి, అజయ్, శివ ప్ప, రాంచంద్రయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. దేశానికి పేరు తెండిఅనంతగిరి: ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన యువకులు పుట్టిన ఊరుకు.. దేశానికి మంచి పేరు తేవాలని ఎంపీడీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీడీవో సత్తయ్య పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్‌లోని గాంధీ కాలనీలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ధారూరు మండలం తరిగోపుల గ్రామానికి చెందిన మోగిలేష్ కుమారులు విష్ణు, శివ ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడంతో సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనప్రాంతం నుంచి ఇద్దరు కుర్మ బిడ్డలు ఆర్మీకి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి సేవ చేసే భాగ్యం వారికి లభించిందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు గోపాల్, శివప్రసాద్, శ్రీశైలం, బుచ్చయ్య, నర్సింలు, శ్రీను, ల్యాబ్ నర్సింలు, రాములు, మాదవ్, సంధ్య, మహేష్ పాల్గొన్నారు. చేనేత హస్తకళలను ప్రోత్సహించాలి అనంతగిరి: చేనేత హస్తకళలను ప్రోత్సహించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్‌కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఫతేగార్డెన్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, ఇతర వస్తువులను పరిశీలించారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు పరిగి: పట్టణంలోని సాయిబాబా ధ్యాన మందిరం 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు ఆటపాటలు, కోలాటంతో సందడి చేశారు. వేడుకల్లో ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఽ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. విద్యారంగ పరిరక్షణకు కృషి ఇబ్రహీంపట్నం రూరల్: విద్యారంగం అభివృద్ధి, పరిరక్షణ కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య పేర్కొన్నారు. సంఘం 12వ ఆవిర్భావ వేడుకలను ఆదివారం మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించారు. -
హక్కుల సాధనకు పోరాడుదాం
షాద్‌నగర్: హక్కుల సాధనకు కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. పట్టణంలోని యమ్మి హోటల్లో ఆదివారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో శంషాబాద్‌లో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు శ్రీను, చంద్రబాబు, లింగంనాయక్, గోవింద్ నాయక్, జంగయ్య, రమేశ్, రాజునాయక్, శంకర్, పవన్ చౌహాన్, ఆకాశ్ పాల్గొన్నారు. వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి కొత్తూరు: జీవనోపాధి కోసం ఆయా రాష్ట్రాల నుంచి షాద్‌నగర్‌కు వచ్చిన వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి పానుగంటి పర్వతాలు కోరారు. కొత్తూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 21, 22న శంషాబాద్‌లో నిర్వహించనున్న భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను పరిశ్రమల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీకి గురిచేస్తున్నట్లు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి వలస, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, శేఖర్‌రెడ్డి, షకీల్, జంగయ్య, సంజీవ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు -
పల్లెలన్నీ బీజేపీ వెంటే..
కుల్కచర్ల: బీజేపీ విధానాలు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు హర్షిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కరణం ప్రహ్లాదరావు, టెలికం అడ్వైజరీ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఘనపురం వెంకటయ్య అన్నారు. గావ్ చలో–శ్రీబస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను, హామీల అమలులో విఫలమవుతున్న తీరును పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ జిల్లా కమిటీ సభ్యుడు జానకీరాం, పార్టీ చౌడాపూర్ మండల ప్రధాన కార్యదర్శి హన్మంతు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అంజిలయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ప్రహ్లాదరావు -
రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం
● ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీ రద్దు చేశాం ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: పేదల భూములు తీసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని మల్కీజ్‌గూడ, ధర్మన్నగూడ, నందివనపర్తి గ్రామాల్లో రూ.75లక్షల విలువ చేసే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నందివనపర్తిలో జ్యోతి ఎడ్యుకేటర్ యూత్ అసోసియషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు సంగం సత్తయ్య విగ్రహ ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మేరకు పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఫార్మా రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైతే మార్కెట్ ధర చెల్లించి రైతులను ఒప్పించాలని.. ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఫోర్త్ సిటీ తీసుకొచ్చామన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, నాయకులు శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, పాండురంగారెడ్డి, అమృతాసాగర్, ధనుంజయ్‌గౌడ్ పాల్గొన్నారు. -
మహనీయుల ఆశయాలను సాధిద్దాం
అనంతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తోందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కేఎస్ రత్నం అన్నారు. పార్టీ పిలుపు మేరకు అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా ఆదివారం అంబేడ్కర్ చైతన్య యాత్ర నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయన జీవితం అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సాయిచరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం -
భక్తిశ్రద్ధలతో ఉర్సు ఉత్సవాలు
దోమ: మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో రెండు రోజులుగా సయ్యద్ మౌల మఖూమ్ హుస్సేన్ (ఉర్సు) ఉత్సవాలను నిర్వహకులు సిరాజుద్దీన్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం చందన పూజ, గంధం ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను నిర్వాహకులు శాలువ, పూవ్వుల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, యాదయ్యగౌడ్, రాంచంద్రారెడ్డి, బాబర్, అంతిరెడ్డి, సురేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దిర్సంపల్లిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి. షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోందని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
మహానుభావా.. మన్నించుమా!
భారత రాజ్యాంగ నిర్మాత.. ప్రపంచ మేధావి.. అణగారిన వర్గాల ఆరాధ్యుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాలు ఏడాది నుంచి ప్రారంభానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బొంరాస్‌పేట, తుంకిమెట్ల గ్రామాల్లో ఏడాది క్రితం అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. రాజకీయ విభేదాల కారణంగా వాటిని ప్రారంభించలేదు. బురాన్‌పూర్‌లో రెండేళ్ల క్రితం దిమ్మె నిర్మించి విగ్రహం ఏర్పాటును విస్మరించారు.. నేడు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మహనీయుడి విగ్రహాలను ప్రారంభించాలని అంబేడ్కర్, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. – బొంరాస్‌పేట -
రజతోత్సవాన్ని విజయవంతం చేయండి
పరిగి: 25 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ పాటుపడుతోందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్ వేదిక నిర్వహించే రజతోత్సవ సభ వాల్‌రైటింగ్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ బీఆర్ఆఎస్ అన్నారు. పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పోరాడారని చెప్పారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి తప్పుదోవలో ఓట్లను దన్నుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రాష్ట్రంలో బీఆర్ఎస్దే అధికారమన్నారు. వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుందఅశోక్ కుమార్, సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సురేందర్, రవికుమార్, కృష్ణ తదితరులు ఉన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి -
ముగిసిన ఆంజనేయస్వామి జాతర
యాలాల: బాక్వారం ఆంజనేయస్వామి జాతర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయంలో సత్యనారాయణస్వామి పూజ నిర్వహించారు. యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతర సందర్భంగా హాజీపూర్, యాలాల, గోరేపల్లి, జక్కేపల్లి, దేవనూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కాగా శనివారం రాత్రి భక్తుల జనసందోహం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మాజీ సర్పంచ్ ఒంగోనిబాయి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ‘మా మసీదు’ సందర్శనలో నేతలు తాండూరు టౌన్: ప్రజలంతా సమానత్వం, ఆధ్యాత్మిక విలువలతో మెలగాలనేదే ఇస్లాం మత సారాంశమని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన మా మసీదు సందర్శన కార్యక్రమానికి మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం పట్టణంలోని ఖాన్కాలనీలో గల మహ్మదీయ అహ్లి హదీస్ మసీదును వారు సందర్శించారు. ఈ సందర్భంగా మత వక్తలు ఖురాన్ ప్రాముఖ్యత, మత విశ్వాసాలు, మానవ ధర్మం, నైతిక విలువలపై బోధన చేశారు. ఏ మతమైనా ఆధ్యాత్మిక భావాలతో, ప్రపంచ శాంతి కోరుకుంటుందన్నారు. వారి వెంట నాయకులు కరణం పురుషోత్తంరావు, అఫు, యూనస్, శ్రీధర్, అశోక్, ముక్తార్నాజ్ తదితరులు ఉన్నారు. ‘చలో వరంగల్’కు తరలివెళ్దాం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తాండూరుటౌన్: చలో వరంగల్ పేరిట ఈ నెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్దామని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా నేటికీ హామీలను అమలు చేయలేకపోతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్‌నే మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని చెప్పారు. అనంతం నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో దొంగల చేతివాటం ఉప్పల్: ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం అభిమానులు ఆనందంలో మునిగి తేలగా సెల్‌ఫోన్ దొంగలు చేతి వాటం చూపించారు. స్టేడియం భద్రతలో దాదాపుగా 3 వేలకు పైగా పోలీసులు పహారా కాస్తున్నా వారిని లెక్క చేయకుండా సెల్‌ఫోన్ దొంగలు హాల్చల్ సృష్టించారు. వందలాది సెల్ ఫోన్లను దొంగిలించడంతో బాధితులు లబోదిబో మంటూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ పరుగుల వరద సృష్టించిన ఆనందంలో ప్రేక్షకులుండగా..దొంగలు చేతి వాటం చూపించినట్లు తెలిసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంతగా సెల్ఫోన్లు దొంగిలించిన సంఘటన బహుషా ఇదే మొదటి సారి కావచ్చంటున్నారు. ఈ విషయంలో ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని వివరణ కోరగా దాదాపుగా 15 నుంచి 20 మంది మాత్రం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేద్దాం
తాండూరు టౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాల శుచి, శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. పాత తాండూరు, బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, విగ్రహానికి జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన హక్కులను ప్రసాదించిన మహనీయుడు అంబేడ్కరుడని కొనియాడారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేడు దళిత, ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, కార్యదర్శి భద్రేశ్వర్, అధికార ప్రతినిధి వెంకట్, పట్టణాధ్యక్షుడు మల్లేశం, పటేల్ విజయ్, సాయిరెడ్డి శ్రీకాంత్, బాలప్ప, రజినీకాంత్, దోమ కృష్ణ, కిరణ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్ -
నీటి కుంట.. తీరేను చింత
దౌల్తాబాద్: వాగులు వంకల ద్వారా వృథాగా పోయే వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నదులపై ప్రాజెక్టులు, వాగులపై చెక్‌డ్యాంలు నిర్మిస్తుంది. ఈ క్రమంలో భూగర్భజలాలు పెంపునకు రైతులు పాంపాండ్స్ తవ్వుకునేలా ప్రోత్సహిస్తోంది. తద్వారా బోర్లు, బావులు రీఛార్జి అవడంతో పాటు కుంటల్లోని నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నీటికుంట (పాంపాండ్స్)లతో రైతులకు నీటిచింత తీరుతుందని ఉపాధి హమీ అధికారులు చెబుతున్నారు. రైతులు నయాపైసా ఖర్చు లేకుండా వీటిని నిర్మించుకోవచ్చంటున్నారు. మండలంలోని పలువురు రైతులకు మంజూరైనప్పటికీ వారికి అవగాహన లేక తవ్వుకునేందుకు ఆసక్తి చూపడంలేదు ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్నారు. భూమి పోతుందనే ఆలోచనతో చాలా మంది రైతులు ముందుకు రావడంలేదు. ప్రయోజనాలు రైతులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా తమ పొలాల వద్ద నిర్మించుకునే చిన్న కుంటలను పాంపాండ్స్ అంటారు. బోరు బావులు, వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులకు వీటితో ఉపయోగాలుంటాయన్నారు. వ్యవసాయ క్షేత్రంలోని సాగు భూమిలో కొంతపోయినా భూగర్భజలాలు పెరుగుతాయి. భారీ వర్షాలకు భూమి కోతతకు గురికాకుండా ఉంటుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చి నీరు గుంతలో చేరుతోంది. కుంటలో చేరిన మట్టి పొలాలకు ఎరువుగా ఉపయోగపడుతోంది. బోరుబావుల నుంచి కొద్దిపాటి నీరు వచ్చినా నీటి కుంటలను నింపుకొని ఒకేసారి పంటలకు నీటి తడులు అందించే వీలుంటుంది. దీంతో ఎకరాకు అవసరమయ్యే నీటితో రెండెకరాలు సాగు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. నీటికుంటలతో వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలకు ఢోకా ఉండదని పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో రైతులకు ప్రయోజనం చేకూర్చే నీటికుంటల నిర్మాణానికి రైతులు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. వర్షపు నీటిని పల్లపు ప్రాంతంలో నీటికుంట నిర్మించుకోవాలి. ఈ మేరకు ఉపాధి హామీ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే సిబ్బంది ఇచ్చే కొలతల ప్రకారం పాంఫండ్స్ తవ్వాలి. తవ్వకం పనులు ఉపాధి కూలీలే చేపడతారు. ఇందుకు రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు చదరపు మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల పొడవు, 2 లేదా 3 మీటర్ల లోతు వరకు నీటికుంటలను నిర్మించుకోవచ్చని అధికారులు తెలిపారు. పాంపాండ్స్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తవ్వకానికి ముందుకురాని రైతులు అవగాహన కల్పిస్తున్న అధికారులు అవగాహన కల్పిస్తున్నాం రైతులు వ్యవసాయ పొలాల వద్ద పాంపాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. భూమి పోతుందని నిర్మించుకునేందుకు ముందుకు రావడంలేదు. నీటికుంటలతో లాభాలను రైతులకు వివరించి నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నాం. – అంజిలయ్య, ఏపీఓ, దౌల్తాబాద్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ధారూరు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. తొలి విడతలో ఇళ్లు రాని వారు ఆందోళన చెందరాదని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం ధారూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గురుదోట్ల గ్రామం నుంచి టేకులపల్లితండా వరకు రూ.3.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, రూ.2.40 కోట్లతో మైలారం నుంచి మైలారం కొత్త తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు, రూ.90 కోట్లతో నాగారం నుంచి వికారాబాద్ వయా మైలారం, తరిగోపుల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ కృష్ణయ్య, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ సాజిదాబేగం, ఎంపీడీఓ నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్, హన్మంత్‌రెడ్డి, రాములు, మాన్సింగ్, విజయభాస్కర్‌రెడ్డి, అశోక్, బుజ్జయ్యగౌడ్, ఎస్కే ఆశం, గఫార్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట బంట్వారం: గిరిజన తండాల్లోని అన్ని కాలనీల్లో బీటీ రోడ్లు వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. శనివారం కోట్‌పల్లి మండలం మద్దుల్ తండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి తండా వరకు రూ,1.50 కోట్లతో బీటీ రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సన్న బియ్యం పంపిణీని ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు తండాలోని సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యం యాలాల: గ్రామాల అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్య మని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అక్కంపల్లి, జంటుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జుంటుపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. తూముకు శా శ్వత పరిష్కారం చూపుతామన్నారు.కార్యక్రమంలో యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా నా యకుడు రమేష్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, నాయకులు రామ్య నాయక్, నారాయణరెడ్డి, రమేష్, దస్తప్ప తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ అభివృద్ధికి కృషి అనంతగిరి: వికారాబాద్ నియోజకవర్గంలో రూ.173 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. శనివారం వికారాబాద్ నుంచి పరిగి వరకు రూ.77 కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు మద్గుల్ చిట్టంపల్లి వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం వికారాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 42మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల మాజీ చైర్మన్ సత్యనారాయణ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, జాఫర్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, నాయకులు మురళి, వెంకట్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్ పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ధారూరులో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది పరిగి: ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నా రు. శనివారం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. 14 నెలల పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను సీఎం త్వరలో ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, నాయకులు ఆనందం, గోపాల్ పాల్గొన్నారు. -
ఎన్నికలప్పుడే రాజకీయం
● ఎమ్మెల్యేలు, మంత్రులతోకలిసి పని చేస్తా ● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ● తాండూరు, పెద్దేముల్ మండలాల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు రూరల్: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని..అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పని చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం తాండూరు, పెద్దేముల్ మండలాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు, పూర్తయి న వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పని చేస్తానని తెలిపారు. పార్లమెంట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. అనంతరం పెద్దే ముల్ మండలంలోని మంబాపూర్, నర్సాపూ ర్,గాజీపూర్,తాండూరు మండలంలోని గోనూ ర్,వీర్‌శెట్టిపల్లి గ్రామాల్లో పర్యటించారు. జూలై నుంచి అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, పార్టీ తాండూరు, పెద్దేముల్ మండలాల అధ్యక్షులు ప్రభు శంకర్, హరీశ్, నాయకులు విక్రం, రాంచెంద్రి, యాదు గౌడ్, రాంసాగర్, శ్రీకాంత్, వడ్ల రఘు, నరేందర్ పాల్గొన్నారు. -
పట్టా భూములపై పట్టు
● హకీంపేట్ భూ బాధితులతోసబ్ కలెక్టర్ సమావేశం ● పరిహారం పెంచాలని రైతుల అభ్యర్థన ● ఎకరాకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ ● లేదంటే భూములిచ్చేది లేదని స్పష్టీకరణదుద్యాల్: తమ పట్టా భూముల జోలికి రావొద్దని మండల పరిధిలోని హకీంపేట్‌కు చెందిన రైతులు తేల్చిచెబుతున్నారు. పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పట్టా, అసైన్డ్ భూములు కలిగి ఉన్న కొంత మంది రైతులు ఇప్పటికే స్థలం అప్పగించి పరిహారం పొందారు. హకీంపేట్ గ్రామానికి చెందిన సుమారు 36 మంది రైతులు తమకు సంబంధించిన 50 ఎకరాల పట్టా భూమిని ఇచ్చేది లేదని గతంలోనే పలుమార్లు అధికారులకు తెలియజేశారు. దీంతో సదరు రైతులకు వారం రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు. పట్టా భూములు ఇవ్వాలని కోరారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం హకీంపేట్‌కు చెందిన 17 మందిని తాండూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి రప్పించారు. వీరితో సమావేశమైన తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్‌తో వ్యక్తిగతంగా ఒక్కొక్కరి అభిప్రాయం తెలుసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న తమ భూములకు ఎకరాకు రూ.2 కోట్లు చెల్లిస్తేనే ఇస్తామని కొంతమంది రైతులు తెలిపారు. మిగిలిన వారిలో కొందరు రైతులు ప్రభుత్వం నిర్ణయించిన (ఎకరాకు రూ.20 లక్షల చొప్పున) పరిహారం తీసుకుని, భూములు ఇచ్చేస్తున్నారు. పరిహారం అందలేదు పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా నాకున్న రెండున్నర ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపాను. ఇప్పటి వరకూ పరిహారం అందలేదు. పట్టా భూమి కూడా ఇవ్వాల్సిందేనని నోటీసులిచ్చారు. ఇదెక్కడి న్యా యం..? వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన భూములకు ఎకరాకు రూ.2 కోట్లు ఇస్తున్నారు. మాకు అలాగే ఇవ్వాలి. – రాకం యాదయ్య, రైతు, హకీంపేట్ ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు హకీంపేట్ రైతులతోఈ నెల 11న సమావేశం నిర్వహించా. పట్టా భూములు కలిగిన 17మంది హాజరయ్యారు. తమ భూములు రోడ్డు పక్కన ఉన్నందున ఎకరాకు రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం అందరికీ ఒకే రకమైన న్యాయం వర్తిస్తుందని చెప్పాం. ఎక్కువ చేసి ఇవ్వడం సాధ్యం కాదు. – ఉమాశంకరప్రసాద్, తాండూరు సబ్ కలెక్టర్ -
● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దందా షురూ.. ● బ్రాండెడ్ కంపెనీల పేరుతో మోసం ● నష్టపోతున్న అన్నదాతలు
కొడంగల్: నియోజకవర్గంలో నాసిరకం పత్తి విత్తనాల దందాకు తెరలేసింది. వానాకాలం సీజన్‌కు ముందే పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా విక్రయాలు చేపట్టారు. నిరుద్యోగ యువకులకు డబ్బులు ఆశ చూపి నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల కవర్లలో నాసిరకం విత్తనాలు నింపి విక్రయిస్తున్నారు. అభం శుభం తెలియని రైతులు వాటిని కొనుగోలు చేసి పంట దిగుబడి రాక నష్టపోతున్నారు. కర్ణాటక నుంచి సరఫరా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై కొడంగల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకకు చెందిన గుర్మిట్కల్ పట్టణం ఉంది. అక్కడి ఎరువుల వ్యాపారి నకిలీ విత్తనాల దందా చేస్తున్నట్లు తెలిసింది. అతను కర్ణాటకలోని కుష్టిగిరి జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లు నుంచి తక్కువ ధరకు నాసిరకం పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తాడు. వాటిని బ్రాండెడ్ కంపెనీల కవర్లలో ప్యాకింగ్ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు గతంలో అతనిపై కేసులు నమోదయ్యాయి. అతను హైదరాబాద్‌లోని ఒక ప్యాకింగ్ కంపెనీలో బ్రాండెడ్ కంపెనీల కవర్లను కొనుగోలు చేసి నాసిరకం విత్తనాలు పోసి ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నాడు. నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో ఆయనకు ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. వారి ద్వారానే నకిలీ దందా జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. జైలుకు వెళ్లినా మారని బుద్ధి గతంలో కొడంగల్ మండలం అన్నారం గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన సామగ్రిని చూసి అధికారులు నివ్వెర పోయారు. 320 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న 60 ప్యాకెట్లు, వివిధ కంపెనీల పేరుతో తయారు చేయించిన 290 పోర్జరీ కవర్లు, విత్తనాలు కొలిచే డబ్బా దొరికింది. అదే రోజు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుల సమాచారంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. పోలీసులు నిఘా పెంచడంతో సూత్రధారులు, పాత్రధారులు పట్టుబడ్డారు. కొంత కాలానికి వారు రిమాండ్‌పై వచ్చి తిరిగి దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ దాడిలో.. రెండేళ్ల క్రితం కొడంగల్ మండలం నందిగామ గ్రామ శివారులో ఓ రైతు పొలం వద్ద 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. సదరు రైతును విచారించగా దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పాడు. పోలీసులు, వ్యవసాయాధికారులు గోకఫస్లాబాద్‌లో సోదాలు నిర్వహించగా 14క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలు దొరికాయి. విచారించగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలోని ఒక ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర కొన్నట్లు తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో మళ్లీ పునరావతం అవుతున్నాయి. ప్రతి ఏడాది అధికారులు దాడులు చేసినా నకిలీ మకిలీని అరికట్ట లేకపోతున్నారు. వ్యవసాయాధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. నకిలీ.. మకిలీనకిలీ పత్తి విత్తనాల పట్టివేతయాలాల: మండలంలోని బాగాయిపల్లి చౌరస్తాలో 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్, యాలాల పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాండూరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణరెడ్డి వెల్లడించారు. ఉదయం 6గంటల ప్రాంతంలో బాగాయిపల్లి చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు ప్లాస్టిక్ సంచులతో ఉన్నారు. తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. ముగ్గురిలో ఇద్దరిని పట్టుకోగా ఒక వ్యక్తి పారిపోయాడు. ప్లాస్టిక్ సంచులను పరిశీలించగా రూ.44 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కురుబల కోట మండలం అంగళ్ల గ్రామానికి చెందిన నన్నపనేని శివనాగేశ్వరరావు, గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన దాసరి శ్రీనివాస్‌రావు, కొత్తకోటకు చెందిన నారాయణరెడ్డి నకిలీ పత్తి విత్తనాలను దుకాణాలు, రైతులకు విక్రయించడానికి వచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పారిపోయిన వ్యక్తి నారాయణరెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమతి లేని డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయరాదని సూచించారు. ఆధీకృత డీలర్ వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా, యాలా ల ఎస్ఐ గిరి, ఏఓ శ్వేతరాణి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలనిరైతులకు ఎస్పీ నారాయణరెడ్డి సూచన -
అంతర్రాష్ట్ర చీరల చోరీ ముఠా అరెస్టు
మియాపూర్: చీరలు కొనేందుకు షాపింగ్ మాల్స్‌కు వెళ్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఏడుగురిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ చీరల చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా నుంచి రూ.2 లక్షల విలువ చేసే చీరలు, ఇక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్,డీఐ రమేష్ నాయుడు కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తిరుపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు, చౌటూరు గ్రామానికి చెందిన కట్ట యశోద, సద్దుపాటి తిరుపతమ్మ, వెంకటేశ్వరమ్మ, చట్రాయిమండలం జనరాద్రవార గ్రామానికి చెందిన రమణ అలియాస్ రావణక్క, విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన దేరవకొండ సుభాషిణి, జగ్గయ్యపేట్కు చెందిన వెంకటేశ్వర్లు ఓ ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాలలో చీరల దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఈ ముఠాలో సుమారు 50 నుంచి 100 మంది సభ్యులున్నట్లు తెలిపారు. వీరు గ్రూపులుగా ఏర్పడి 30 సంవత్సరాల నుంచి చీరల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇన్నోవా కారులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ తిరుగుతూ తక్కువ ఉద్యోగులు ఉన్న షాపింగ్ మాల్స్, ఇళ్లల్లో చీరల వ్యాపారం నిర్వహించే వారిని టార్గెట్ చేసుకుంటారు. నిర్వాహకులు దృష్టి మరల్చి చీరలు దొంగిలిస్తారు. ప్రతి నెలా 5 నుంచి 8 దొంగతనాలకు పాల్పడతారు. దొంగతనం తర్వాత మొక్కులు చెల్లిస్తారు.. దొంగిలించిన చీరలను తీసుకుని వీరు కారులో యాదగిరిగుట్ట, ఇతర దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ దేవుడికి మొక్కులు చెల్లించుకుని అనంతరం విజయవాడకు వెళ్లి కనకదుర్గమ్మ దేవాలయం ముందు, బస్టాప్, సంతల్లో, రద్దీ ప్రదేశాల్లో ఒక్కో చీరను రూ.2 వేల నుండి 10వేల వరకు అమ్ముతుంటారు. అమ్మగా వచ్చిన డబ్బులను ముఠా సభ్యులు పంచుకుంటారు. కాగా చీరల దొంగతనం చేసే ముఠా సభ్యులపై పదుల సంఖ్యలో కేసులున్నాయి. అనేక సార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయినా వీరు దొంగతనాలు మానలేదని చెప్పారు. మియాపూర్ పోలీసులకు ఇలా పట్టుబడ్డారు... గత 28వ తేదీన మియాపూర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ముఠా సభ్యులు వెంకటేశ్వరరావుతో పాటు మహిళలు చీరల షాపుకు వెళ్లారు. షాపు నిర్వహించే మహిళ బయటకు వెళ్లడంతో ఆమె భర్త వచ్చిన వారికి చీరలు చూపించాడు. చీరలు చూస్తూ యజమాని దృష్టి మరల్చేందుకు నీళ్లు కావాలని అడిగారు. దీంతో యజమాని ఇంట్లోకి వెళ్లి వాటర్ తీసుకువచ్చేలోపు మరికొంత మంది మహిళలు చీరలు దొంగిలించారు. కొద్దిసేపు చీరలు చూసి మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి షాపు నిర్వాహకురాలు ఇంటికి వచ్చి పరిశీలించగా 14 చీరలు కనిపించలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 3వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. ఏడుగురి రిమాండ్..రూ.2 లక్షల విలువైన చీరలు, కారు స్వాధీనం -
భావిగి దేవా.. భక్తుల బ్రోవ
తాండూరు టౌన్: జిల్లాలోనే ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తాండూరు శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నారు. అందుకు ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఆలయ కమిటీ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయానికి వేలాది కుటుంబాలు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నాయి. 23వ తేదీ వరకు స్వామి వారి ఉత్సవాలు నిర్వహించేందు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 15వ తేదీ నుంచి ఉత్సవాలు తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15, 16వ తేదీల్లో రాత్రి 10 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి పల్లకీ సేవ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గాంధీచౌక్ మీదుగా రాచన్న దేవాలయం వద్దకు వెళ్లి తిరిగి అదే మార్గంలో ఆలయానికి చేరుకుంటుంది. 19వ తేదీ రాత్రి రథోత్సవం, 20న బసవణ్ణ కట్ట సమీపంలో రాత్రి 2గంటలకు లంకాదహనం, అదే రోజు ఉదయం సరస్వతి శిశుమందిర్ ప్రాథమిక పాఠశాలలో పశు ప్రదర్శన జరుగుతాయి. ఖ్యాతిగాంచిన పశువుల సంత భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో పశువుల సంతకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సంతకు జిల్లాలోని పశువులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఎద్దులను రైతులు తీసుకువస్తారు. ఏటా జరిగే ఉత్సవాలలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగా జోడెడ్ల ధర పలుకుతుంది. రథానికి ప్రత్యేక గుర్తింపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత ఎత్తైన రథం తాండూరు భావిగి భద్రేశ్వరస్వామికి ఉంది. ఉగాది పండగ రోజు నుంచి రథం నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. దాదాపు 25 రోజుల పాటు పనులు కొనసాగుతాయి. ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్, అగ్నిమాపక, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించనున్నారు. పట్టణంలోని పురవీధులలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారు. వైభవంగా నిర్వహిస్తాం భావిగి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ నెల 14వ తేదీ నుంచి నిత్యాన్నదానం కోసం భవనం సిద్ధం చేశాం. – పటేల్ కిరణ్‌కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ నేపథ్యమిదీ.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న భావిగి భద్రేశ్వరస్వామి మఠం ఉంది. 18వ శతాబ్దంలో అక్కడ జరిగే ఉత్సవాలను తిలకించేందుకు తాండూరు పట్టణానికి చెందిన పటేల్ బసణ్ణ ఎడ్ల బండి కట్టుకొని వెళ్లారు. దర్శనం చేసుకొని వెనుదిరుగుతుండగా స్వామి వారు వచ్చి ప్రసాదం తీసుకోమని చెప్పారని గాథలున్నాయి. అనంతరం బసణ్ణ తాండూరుకు వస్తుండగా ఎద్దుల బండి వెంటే స్వామి వారు వస్తున్నారు. ఆయన బండి ఎక్కమని కొరినా నడుచుకుంటునే తాండూరు వరకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆలయం వద్దనే స్వామి వారు అదృశ్యమయ్యారు. ఎంత వెతికినా జాడ కనిపించలేదు. దీంతో అక్కడే బసణ్ణ ఆలయ నిర్మాణం చేపట్టి గర్భగుడిని నిర్మించారు. ఇప్పటికీ అదే ఉంది. అప్పటి నుంచి ఏటా చైత్ర మాసంలో పౌర్ణిమ తరువాత వచ్చే మంగళవారం నుంచి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. 15 నుంచి తాండూరు భావిగి భద్రేశ్వర బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు -
తండాల అభివృద్ధికి కృషి
తాండూరు రూరల్: నియోజకవర్గంలోని ప్రతి గిరిజన తండాకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.30 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం పెద్దేముల్ మండలం తట్టేపల్లి, ఓంమ్లానాయక్ తండాలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులు, గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కాషాయపార్టీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు గ్రామాలు, తండాల్లో జై బాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మౌలిక సదుపాయ కల్పనకు కృషి తెలంగాణ–కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్న ఓంమ్లానాయక్ తండాలో మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ గిరిజన మహిళా నేత సుమిత్ర రాథోడ్ కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి.. తండాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ధారాసింగ్, ప్రోగాం ఇన్ చార్జి షహీం ఖురేషి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, నాయకులు నారాయణరెడ్డి, రియాజ్, ఎల్లారెడ్డి, మల్లేశం, రవి, మహేష్, డీవై నర్సిములు, మధుసూదన్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి -
వెలవెలబోతున్న క్రీడా ప్రాంగణాలు
మోమిన్‌పేట: సరైన పరికరాలు లేక తెలంగాణ క్రీడా మైదానాలు వెలవెలబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రాంగణాలు ప్రస్తుతం సూచిక బోర్డులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో యువతి, యువకులు క్రీడలకు దగ్గర చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని పరికరాలను అమర్చి కొంతకాలం నడిపించారు. కానీ చాలాచోట్ల క్రీడా ప్రాంగణాలు ఊరికి దూరంగా ఉండడంతో కాలక్రమేణ అవి ఆదరణ కోల్పోయాయి. ప్రస్తుతం అందులో ఏలాంటి పరికరాలు లేకుండా పోయాయి. ఊరికి దూరంగా ఏర్పాటు మండల పరిధిలోని 28 గ్రామ పంచాయితీ పరిధిలో క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేశారు. చాలాచోట్ల గ్రామాలకు దూరంగా విసిరేసినట్లు ఉండటం, పరికరాలు లేకపొవడంతో కేవలం బోర్డులకే పరిమితమయ్యాయని యువకులు పేర్కొంటున్నారు. ఏ ఒక్క మైదానంలో ఆటలు ఆడటం లేదని చెబుతున్నారు. ఏన్కతలలో గ్రామానికి కిలోమీటరు దూరంలో బోర్డు పెట్టి వదిలేశారు. దీంతో యువకులు ప్రాంగణంలో క్రీడా పరికరాలు లేకుండా ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి పరికరాలు అమర్చాలని కోరుతున్నారు. మరోవైపు క్రీడ ప్రాంగణాల బిల్లుల నగదు ఇప్పటికీ అందలేదని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరికరాలు లేక శిక్షణకు ఇబ్బంది పట్టించుకోని అధికారులు -
జోరుగా పొలం పనులు
కొడంగల్: నియోజక వర్గంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఎద్దు.. ఎవుసం కనుమరుగు కావడంతో యంత్రాలతో దుక్కులు దున్నుతున్నారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో అధిక మొత్తంలో నల్లరేగడి భూములు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎర్ర నేలలు, చెల్కలు ఉన్నాయి. ఖరీఫ్‌లో ఎక్కువ భాగం కంది, పత్తి, జొన్న, పెసర, మినుము పంటలు వేయడానికి పొలాలను చదును చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వైభవంగా మౌనేశ్వర స్వామి వార్షికోత్సవం దుద్యాల్: మండల కేంద్ర సమీపంలోని గుట్టపై వెలసిన మౌనేశ్వర స్వామి వార్షికోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే నిర్వాహకులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. రెండు రోజులు సాగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక భజన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మోనయ్య పంతులు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ప్రత్యేక హోమంతో పాటు అన్నదానం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జార్జిరెడ్డి వర్ధంతి సభలు జయప్రదం చేయాలి పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అనంతగిరి: ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నాయకుడు, కామ్రెడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రాజేశ్ కోరారు. ఈ మేరకు శనివారం వికారాబాద్‌లో ఆ సంస్థ ఆధ్వర్యంలో శనివారం వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అమరత్వాన్ని విషాద జ్ఞాపకంగా కాకుండా మరో పోరాటానికి ఉత్తేజంగా మలుచుకోవాలన్నారు. అందుకోసమే ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అణగారిన విద్యార్థుల పక్షాన ఉండి పోరాటం చేసిన మహాయోధుడన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం మీర్‌పేట: వుడ్ వర్క్స్ షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. బడంగ్‌పేట వెంకటాద్రి కాలనీకి చెందిన కంచర్ల గౌరీశంకర్ దావుద్‌ఖాన్‌గూడలో సిసిరా వుడ్ వర్క్స్ పేరిట షాపు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగా శుక్రవారం రాత్రి షాపును మూసివేగా షార్ట్ సర్క్యూట్‌తో రూ.20 లక్షల విలువైన సామగ్రి, షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. -
పూజల పేరిట మోసాలు నకిలీ బాబా అరెస్టు
కాచిగూడ: ‘మీ జాతకం బాగాలేదు..శాంతి పూజలు చేయాలి’ అంటూ ఓ మహిళకు మాయమాటలు చెప్పి అందిన కాడికి బంగారం, నగదుతో ఉడాయించిన బురిడీ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్యతో కలిసి డీసీపీ డాక్టర్ బాలస్వామి వివరాలు వెల్లడించారు. ఎల్బీ నగర్‌లోని రాక్ టౌన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు అరిగెల సాంబశివుడు (45) అలియాస్ గురూజీ శివస్వామి వృత్తిరీత్యా ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్‌తో దొంగబాబా అవతారం ఎత్తాడు. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన గీతా వైద్య దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలేజీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. సంవత్సరం క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సౌమ్య ద్వారా గీతకు సాంబశివుడు పరిచయమయ్యాడు. మీ ఇంటికి దోషం ఉందని, మీ పేరు మీద బాగాలేదని ముందు ముందు చాలా ఇబ్బందులు పడతారని, మీ భర్త చనిపోయినట్లే మీ కుటుంబం అంతా చనిపోతారని భయపెట్టాడు. దోషం పోవాలంటే పూజలు చేయించాలని, ఇందుకు రూ.1.70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అనంతరం కొద్దిరోజులకు మళ్లీ మీ కూతురికి పెళ్లయితే విడాకులు అవుతాయని, అందుకు దోష నివారణకు పూజలు చేయాలని, దానికి లక్షలు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పాడు. దీంతో భయపడిన గీత తన దగ్గర ఉన్న 26 తులాల బంగారు నగలు ఇచ్చింది. అదే కాకుండా ఆమె ఇంటి పత్రాలను కూడా ఇచ్చింది. ఈ దశలో అనుమానం వచ్చిన గీతా వైద్య కూతురు ప్రతిఘటించి దొంగ బాబా దగ్గర ఇంటి పత్రాలను తిరిగి తీసుకున్నారు. అనంతరం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు సాంబశివుడిని అదుపులోకి తీసుకొని అతనివద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి బురిడీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. -
మహిళలు స్వయం ఉపాధి పొందాలి
హయత్‌నగర్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి సరైన మార్గమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 200 మంది మహిళలకు శనివారం తొర్రూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం అభినందనీయమన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అతివలు మరొకరికి మార్గదర్శకంగా నిలవాలని, ఒకరికొకరు చేయూతనందించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ యాదిరెడ్డి, నాయకులు బలవంతరెడ్డి, ధన్రాజ్గౌడ్, రమేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్, బాల్‌రాజ్‌గౌడ్, పాండు, మధుసూదన్‌రెడ్డి, పోచయ్య, యాదగిరి తదితరులు పాల్నొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
దేశాభివృద్ధే మోదీ ఆశయం
ధారూరు: బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్, కొంతమంది మంత్రుల నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చెందాయని, మిగిలిన ప్రాంతాలను విస్మరించారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం, ఎంపీ నిధులతో మండలంలోని నాగారం, స్టేషన్‌ధారూరు, ధారూరు, రుద్రారం, అల్లీపూర్ గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి రాష్ట్రం, రాష్ట్రాల్లోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని మోదీ ఆశయమని పేర్కొన్నారు. తనకు కేటాయించిన ఎంపీ నిధుల్లో ఎక్కువ శాతం ఇక్కడే ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు నీరు అందక పంటలు ఎండుతున్నాయని రైతులు ఎంపీ దృష్టికి తెచ్చారు. వెంటనే ప్రాజెక్టు కాలువలను పరిశీలించి ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. రబీ పంటలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఉపాధ్యక్షుడు వివేకానందరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, సీనియర్ నాయకులు పాండుగౌడ్, మండల మాజీ అధ్యక్షుడు ఎం.రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి రాజేందర్‌గౌడ్, నాయకులు రుద్రారం వెంకటయ్య, ఉపేందర్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మండలంలో సీసీ రోడ్లు ప్రారంభం -
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
మర్పల్లి: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రూ.22 కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొంషెట్‌పల్లిలో అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శిలాఫలకం వేశారు. అనంతరం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా మర్పల్లి మండలంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. 17 జీపీల్లో రూ.5.63 కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా మర్పల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ హామీ ఇచ్చారు. మార్కెట్ రోడ్డు నుంచి ఎస్టీ ఆశ్రమ గురుకుల పాఠశాల వరకు రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మార్కెట్ చైర్మన్ మహేందర్‌రెడ్డితో కలిసి శిలాఫలకం వేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునీరొద్దీన్, ఎంపీడీఓ రాజ్‌మల్లయ్య, ఈఓ పీఆర్డీ లక్ష్మీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్, పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్, సుభాష్ యాదవ్, బ్లాక్ –2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు ఖలిమొద్దీన్, శంకరయ్యగౌడ్, నాగేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మండలంలో సుడిగాలి పర్యటన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పోరాటం
పరిగి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 2, 3, 11 వార్డుల్లో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం కుట్ర పన్ని కావాలనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపుతోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు నిధులు అందజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపించడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని దేశఽంలోని ప్రజలను విడదీసి పాలిస్తోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలోని బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ ఊరుకోబోదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగిలో జై సంవిధాన్ యాత్ర -
తాండూరు వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో వ్యాపారం
తాండూరు టౌన్: తాండూరు వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌కు ఫీజు రూపంలో రూ.6.77 కోట్ల ఆదాయం సమకూరింది. మార్కెటింగ్ శాఖ ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోనే అతిపెద్దగా తాండూరు వ్యవసాయ మార్కెట్‌కు పేరుంది. నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాల రైతులు పండించిన కంది, పత్తి, శనగ, పెసర, మినుము, వేరుశనగ, వరి ధాన్యం, మక్కలు, సో యాబిన్, కుసుమ పంట ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి క్రయ విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్కెటింగ్ శాఖ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసిన అధికారులు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల ప్రశంసలు పొందారు. పోటెత్తిన కంది ఉత్పత్తులు తాండూరు నియోజకవర్గంలో కంది పంట బాగా పండింది. దీంతో ఉత్పత్తులు మార్కెట్‌కు పోటెత్తాయి. గత సీజన్(2023–24)లో 74,858 క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.65.75 కోట్లు వ్యాపారం జరిగింది. మార్కెట్‌కు ఒక్క శాతం ఫీజు రూపంలో 65.75 లక్షల ఆదాయం సమకూరింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌కు 1,36,718 క్వింటాళ్ల కంది ఉత్పత్తులు వచ్చాయి. రూ.98.43 కోట్ల వ్యాపారం జరగ్గా మార్కెట్‌కు రూ.98.43 లక్షల ఆదాయం సమకూరిందని మార్కెట్ కమిటీ సెక్రెటరీ శ్రీనివాస్, సూపర్వైజర్ హబీబ్ అల్వీలు తెలిపారు. ఇది కేవలం కంది పంట క్రయవిక్రయాల ద్వారా వచ్చిన ఆదాయని వారు తెలిపారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఫీజు రూపంలో భారీగా సమకూరిన నిధులు గతేడాది కంటే అధికంగా వచ్చిన కంది ఉత్పత్తులు -
వక్ఫ్ సవరణ చట్టాలను రద్దు చేయాలి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ ముస్లిం సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని ఆలంపల్లి ఈద్గా ఆవరణలో శాంతియుత నిరసన తెలిపారు. అనంతరం మత పెద్దలు, నేతలు మాట్లాడారు. భారత రాజ్యాంగం ముస్లింలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి నల్లచట్టాల వల్ల స్వాతంత్య్రానికి పూర్వం మన పూర్వీకులు ధార్మిక కార్యక్రమాల కోసం దానం చేసిన ఆస్తులు ఈ రోజు మనవి కాకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సవరించిన వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు ఎర్రవల్లి జాఫర్, తస్వర్‌అలీ, ఎండీ హఫీజ్, జాకీర్మోయినొద్దీన్, మహ్మద్ ఉస్మాన్, రఫీయొద్దీన్, ఫెరోజ్, రవూఫ్, ఎజాజ్, జైనొద్దీన్, అర్షద్ మౌలానా, ఆదాం, ఫయాజ్ పాల్గొన్నారు. ఆలంపల్లి ఈద్గా వద్ద మాట్లాడుతున్న ముస్లింలు ముస్లిం సంఘాల జేఏసీ డిమాండ్ వికారాబాద్‌లో నిరసన కార్యక్రమం -
మత్తు పదార్థాల నిర్మూలన మన బాధ్యత
అనంతగిరి: మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎకై ్సజ్, విద్యాశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లా కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రైలు, రోడ్డు మార్గాల్లో గంజాయి రవాణా చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖలకు సూచించారు. అనంతరం ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డీఆర్డీఓ శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, డీవైఎస్ఓ హనుమంతరావు, అటవీ శాఖ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్, ఆర్టీఓ వెంకట్‌రెడ్డి, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి శంకర్ నాయక్, డీపీఓ జయసుధ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి -
నేడు డయల్ యువర్ డీఎం
తాండూరు టౌన్: తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సురేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు సెల్ నంబర్ 99592 26251కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని ప్రయాణికులను కోరారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలకు రంగం సిద్ధం ? వికారాబాద్: కొత్తగడి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలకు రంగం సిద్ధమైంది. పాఠశాలలో విద్యార్థినులపై వరుస వేధింపుల నేపథ్యంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక బృందం ఇటీవల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కమిషన్ చైర్మన్.. కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. కొత్తగడి గురుకుల ఘటనపై నివేదిక ఇవ్వడంతోపాటు ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్యలకు సిఫారసు చేస్తూ కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు సమాచారం. అసలేం జరిగిందంటే.. నెల రోజుల క్రితం వికారాబాద్ సమీపంలోని కొత్తగడి గురుకులంలో సిబ్బంది వేధిస్తున్నారంటూ ఓ బాలిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మరువక ముందే ప్రిన్సిపాల్ కొంతమంది విద్యార్థినులను తన చాంబర్‌కు పిలిపించుకొని బూతులు తిట్టే వీడియో బయటికి వచ్చింది. దీనిపై స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై సీఆర్పీఎఫ్ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ సభ్యులు గత సోమవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసి ఫిర్యాదు చేశారు. బీసీ కమిషన్ ఆదేశాలతో కమిటీ వేసిన అధికారులు విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. అనంతరం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగిన వీడియో వైరల్ కావటంతో ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. నేడు తాండూరులో ఎంపీ కొండా పర్యటన తాండూరు రూరల్: మండలంలో శనివారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పర్యటించనున్నట్లు బీజేపీ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోనూర్, వీర్‌శెట్టిపల్లి, నారాయణపూర్ గ్రామాల్లో ఎంపీ నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం పెద్దేముల్ మండంలోని మంబాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై ఎంపీ పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరారు. జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి తాండూరు టౌన్: మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 86 మంది ఉద్యోగాలు సాధించారు. స్థానిక సింధు బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు 300 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. 10 ఎన్ఎంసీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్య ఏ వర్గానికి సొంతం కాదని, అణగారిన వర్గాల పిల్లలు సైతం విద్యను ఆర్జించవచ్చని, ప్రజల్లో చైతన్యం రగిలించిన పోరాటం మరువలేమన్నారు. గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సభ్యులు జాబ్‌మేళా నిర్వహణలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయేందర్, కార్యదర్శి అరుణ్ రాజ్, సింధు కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, అనిత, మంజుల, లక్ష్మీనర్సమ్మ, విజయలక్ష్మి, శ్రీనివాస్, బస్వరాజ్, శ్రావణ్, రామకృష్ణ, లక్ష్మణాచారి, రమేష్, బసంత్, జగదీశ్వర్, సిద్ధార్థ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయుడు పూలే
అనంతగిరి: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సీ్త్ర విద్య కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతీరావ్ పూలే అని, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతీరావ్ పూలే గొప్ప సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీబీసీడీఓ కే.ఉపేందర్, డీఎస్సీడబ్ల్యూఓ మల్లేశం, సీపీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్ఓ మోహన్‌బాబు, డీఎంహెచ్ఓ వెంకటరవణ, ఏబీసీడీఓ భీమరాజు తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షంను విజయవంతం చేయాలి పోషణ అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు నిర్వహించే పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మహిళా సీ్త్ర శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వైద్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పోషకాహార లోపాన్ని తగ్గించడంతో పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీపీవో జయసుధ, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్ఓ వెంకటరవణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ సహజం ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ సహజమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ ఉద్యోగ విరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో మనం చేసే సేవలే గుర్తిండిపోతాయన్నారు. అనంతరం అశోక్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఘనంగా జయంతి వేడుకలు -
మద్యం మత్తులో కారుతో ఢీ
ఇబ్రహీంపట్నం: అతివేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారుతో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలం చిల్లాపూర్ గ్రామానికి చెందిన కొప్పు శంకరయ్య కూతురు స్పందన (19) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. సైదాబాద్ సింగరేణికాలనీలో నివాసముండే తన స్నేహితుడు సాయికుమార్‌తో కలిసి గురువారం సాయంత్రం బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ సమీపంలో ఔటర్ సర్వీస్ రోడ్డుపై ఘట్కేసర్ వైపునకు వెళ్తున్నారు. ఈ సమయంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ గాల్లో ఎగిరి కారు అద్దంపై పడ్డారు. కారు అదే స్పీడ్‌లో వెళ్లడంతో కింద పడిపోయారు. స్పందన అక్కడికక్కడే మృతిచెందగా, సాయికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సాయికుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. స్పందన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో అదుపులోకి.. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన స్కోడా కారుతో సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో దిల్సుఖ్నగర్ వైపు వెళ్తుండగా కారు అద్దాలు పగిలి ఉండడం, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా యాక్సిడెంట్ చేసినట్లు అంగీకరించడంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే వ్యాపారవేత్తగా గుర్తించారు. ప్రస్తుతం అతను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న యువతి మృతి, యువకుడికి తీవ్ర గాయాలు అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో ఘటన కారుతో పరారవుతుండగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు -
జర్నలిస్టుల పక్షాన అలుపెరగని పోరాటం
తుక్కుగూడ: రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొసం తమ వంతు కృషి చేస్తామన్ని టీడబ్ల్యూజేఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. తుక్కుగూడలో శక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం 2006లో టీడబ్ల్యూజేఎఫ్ను ఏర్పాటు చేశామన్నారు. నాటి నుంచి ఈరోజు వరకు జర్నలిస్టుల పక్షాన అలుపెరగకుండా పోరాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని జర్నలిస్టు సంఘాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికి, స్వార్థ రాజకీయాల కోసం సంఘాలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రైవేటు విద్యారంగంలో జర్నలిస్టుల పిల్లలుకు ఫీజులో 50 శాతం రాయితీ అందించాలని, వైద్యంలో రాయితీ ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా సంఘంలో చేరిన వారికి సభ్వత్వాలు అందజేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, రాష్ట్ర నాయకులు జగదీశ్, రాజశేఖర్, ఆనందం దేవేందర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సత్యానారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తుక్కుగూడలో సంఘం జిల్లా కమిటీ సమావేశం -
పెంచిన ధరలను తగ్గించాలి
పూడూరు: కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేఖంగా మన్నెగూడ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2024 నుంచి తగ్గాయని, ఇటీవలి కాలంలో అవి మరింత తగ్గాయని కానీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ.50 పెంచడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు ప్రసాద్, విజయ్, అనంతయ్య, రాములు, పాండు, వెంకట్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
కీసర: నేర నియంత్రణతో పాటు నేరుస్తులకు శిక్ష పడేలా చేయడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. కమిషనరేట్‌లోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 1460 సీసీ కెమెరాలను నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మల్కాజిగిరి జోన్ పరిధిలో మొత్తం 1460 కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇందులో 410 కెమెరాలను 17 కాలనీల్లో, ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేశామన్నారు. వీటి కోసం రూ.1.19 కోట్లు ఖర్చు చేశామని, రెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా సంబంధిత కాంట్రాక్టర్‌దేనని చెప్పారు. మిగిలిన 1050 కెమేరాలను 212 దేవాలయాల్లో ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు 5260 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, 93,061 నేను సైతం కెమెరాలు కలిసి మొత్తం 98,321 కెమెరాలను జియో ట్యాగింగ్ చేశామన్నారు. వీటన్నిటినీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక బృందం నిరంతరం పరిశీలిస్తుందన్నారు. భద్రత, సురక్షితమే ధ్యేయంగా నిఘా నేత్రాలను ఆవిష్కరిస్తున్నామన్నారు. కోర్టులకు సాక్ష్యాధారాలను సమర్పించవలసి వచ్చినప్పుడు కెమెరాలు కీలక భూమిక వహిస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్‌గా మల్కాజిగిరి రాచకొండ కమిషనరేట్ ఉందన్నారు. కార్యక్రమంలో డీసీపీ పద్మజ, అదనపు డీసీపీ వెంకటరమణ, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, కుషాయిగూడ ఏసీపీ మహేష్ గౌడ్, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్, పోలీస్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు -
నిబద్ధతతో పనిచేయాలి
అనంతగిరి: ఇటీవల వైద్యులుగా, యంఎల్హెచ్పీలుగా విధులు చేపట్టిన వారంతా సకాలంలో హాజరై పేద ప్రజలకు సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరవణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే సదుద్యేశంతో పల్లె దవాఖానాలో వైద్యులను నియమించారన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారులు డాక్టర్ జీవరాజ్, రవీంద్ర, పవిత్ర, బుచ్చిబాబు, జానీ, నిరోషా తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల వెల్లువ
రాజీవ్ యువ వికాసానికి 14వరకు అవకాశం దౌల్తాబాద్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్‌కు 429, ఎస్సీ 158, ఎస్టీ 76, ఈబీసీ 03, మైనార్టీ కార్పొరేషన్‌కు 30 మొత్తం 696 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు తుది గడువు ఉండగా తర్వాత 14 వరకు పొడిగించారు. నేడు రెండో శనివారం, ఆదివారం, 14న అంబేడ్కర్ జయంతి ఉండడంతో మూడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం వరకు దరఖాస్తుల ప్రక్రియ చేయాలని లబ్ధిదారులు బారులు తీరారు. కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సోమవారం కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించండి తాండూరు రూరల్: మల్కాపూర్ గ్రామంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకశాలు కల్పించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కోరారు. శుక్రవారం మల్కాపూర్ గ్రామ శివారులోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ సిబ్బందికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్కాపూర్ గ్రామ భూముల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఫ్యాక్టరీ తరఫున గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము, ధూళీతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆర్సీ గౌడ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి, యువకులు ప్రశాంత్‌గౌడ్, అరవింద్, తుకారం, తుల్జప్ప, నర్సింహా, బాలాజీ, రఘుగౌడ్, మహేష్, నిఖిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలవాడకాన్ని పెంచాలి కుల్కచర్ల: నిత్యజీవితంలో చిరుధాన్యాల వాడకాన్ని పెంచాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ యాదమ్మ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండలం గోప్యానాయక్ తండాలో పోషణమాసం ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గర్భిణులు, బాలింతలు పోషక ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మల్లమ్మ, ఏ.మల్లమ్మ, కార్యదర్శి శారద, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
యాచారం: ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి శుక్రవారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో పర్యటించారు. ఏళ్లుగా కబ్జాలో ఉన్న పల్లెచెల్కతండా గిరిజనులకు ఆ భూములపై పరిహారం అందకపోవడంతో గురువారం సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్డీఓ అనంత్‌రెడ్డి తహసీల్దార్ అయ్యప్పతో కలిసి సర్వేనంబర్ 184లో పర్యటించారు. ఎన్నేళ్లుగా కబ్జాలో ఉంటున్నారు, గతంలో పరిహారం ఎందుకు రాలేదు, దరఖాస్తు చేసుకోలేదా.. అధికారులు రాలేదా అని ఆరా తీశారు. కబ్జాలో నిజంగా ఎంతమంది రైతులు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, టీజీఐఐసీ అధికారులతో మాట్లాడి కబ్జాలో నిజమైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాడిపర్తిలో పనులను అడ్డుకున్న రైతులు తాడిపర్తిలో శుక్రవారం ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ పనులను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. 104 సర్వే నంబర్లో కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం అందజేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని.. సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సముదాయించారు. విషయాన్ని ఆర్డీఓ అనంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బుధవారం వచ్చి వివరాలు తెలుసుకుంటానని చెప్పడంతో రైతులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి -
ప్రజలకు అందుబాటులో ఉండండి: డీఎంహెచ్ఓ
అనంతగిరి: వికారాబాద్ మండలం సిద్దులూర్ పీహెచ్‌సీని గురువారం డీఎంహెచ్ఓ వెంకటరవణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో జరుగుతన్న పునరుద్ధరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈదురు గాలులకు నేలరాలిన మామిడి కాయలు దోమ: మండల వ్యాప్తంగా గురువారం బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో మామిడి తోటలకు నష్టం జరిగింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని కాపాడుకుంటున్న మామిడి పంట ఈదురు గాలుల కారణంగా దెబ్బతినిందని రైతులు తెలిపారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, దిగుబడి వచ్చే సమయంలో పంట దెబ్బతినిందని రాకొండ గ్రామానికి చెందిన తలారి భీమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
మహిళల ఆరోగ్యమే లక్ష్యం
ధారూరు: గర్భిణులు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సకాలంలో ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. గురువారం మండలంలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు తీసుకెళ్లే మాత్రలు తప్పనిసరిగ్గా వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలన్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన గర్భిణుల స్క్యానింగ్ రిపోర్టులను పరిశీలించారు. స్క్యానింగ్ ఇక్కడే చేస్తున్నారా అని డాక్టర్‌ను ప్రశ్నించగా తాండూరు, వికారాబాద్ పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపుతున్నట్లు తెలిపారు. విధులకు సక్రమంగా రావాలని డాక్టర్, సిబ్బందికి సూచించారు. ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి అనంతగిరి: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ మరమ్మతులతోపాటు ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్, ఇతర సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. ఫ్యాన్లు సమకూర్చుకోవాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సదరం క్యాంప్‌ను పరిశీలించి సౌకర్యాలు సమకూర్చుకోవాలని డీఆర్డిఓ శ్రీనివాస్‌కు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. బంట్వారం కేజీబీవీ సందర్శన బంట్వారం: స్థానిక కేజీబీవీ వసతి గృహాన్ని గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. బాగా చుదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అర్హులకు అందేలా చొరవ చూపాలన్నారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీఓ నాగరాజు, డాక్టర్ మజీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మెనూ అమలు చేయాల్సిందే మర్పల్లి: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. గురువారం మర్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, బీసీ బాలుర వసతి గృహం, పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీఓ లక్ష్మీకాంత్, ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి నర్సింగ్‌రావు, డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ -
బాధితులకు న్యాయం చేయాలి
అనంతగిరి: సైబర్ నేరాలపై ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. గురువారం వికారాబాద్‌లోని తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన కేసులు, వాటి పురోగతి, విచారణ స్థితి, న్యాయపరమైన అంశాలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, న్యాయస్థానాల్లో సరైన సాక్ష్యాధారాలు సమర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి కేసునూ ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. వీటితో పాటు సాంకేతిక ఆధారాలను సమకూర్చడం, ఫోరెన్సిక్ సహాయాన్ని వినియోగించడం, ప్రత్యక్ష సాఽక్షులను సమర్థవంతంగా న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టె విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనం కేసులను త్వరితగతిన ఛేదించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ టీవీల ఏర్పాటు ఎంతో అవసరమని ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పరిగి, వికారాబాద్, తాండూరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్హెచ్ఓలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి -
కార్యకర్తల పార్టీ బీజేపీ
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శంకర్పల్లి: భారతీయ జనతా పార్టీ లీడర్ల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలోని బీడీఎల్ చౌరస్తా వద్ద గురువారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పార్టీ మండల, మున్సిపల్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుందని, మిగతా పార్టీల్లా మీడియాలో కనిపించేందుకు ఆసక్తి చూపించదని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నో నిధులు కేటాయిస్తున్నప్పటికీ శిలాఫలకాలు వేసుకొని క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోందని విమర్శించారు. కార్యకర్తలు గ్రామస్థాయిలో ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జిలు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్, శంకర్పల్లి మండల అధ్యక్షురాలు లీలావతి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ధారూరుకు చేవెళ్ల ఎంపీ కొండా రాక
ధారూరు: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం మండలంలో పర్యటించనున్నట్లు బీజేపీ వికారాబాద్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ వడ్లనందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులు, ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు. మండలంలోని నాగారం, స్టేషన్‌ధారూరు, ధారూరు, రుద్రారం, అల్లీపూర్ గ్రామాల్లో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కలెక్టరేట్ గదిలో మంటలుఅనంతగిరి: వికారాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం టీ ఫైబర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సిబ్బంది వెళ్లి చూడగా యూపీఎస్, బ్యాటరీలు కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చిమంటలు ఆర్పేశారు. అయితే సాయంత్రం వీచిన ఈదురు గాలుల కారణంగా కరెంటు పలుమార్లు వచ్చిపోవడంతోనే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కలెక్టరేట్ నెట్‌కు, కరెంట్‌కు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆఫీసులోనే ఉండటంతో సదరు గదిని పరిశీలించారు. -
రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని వినతి
బంట్వారం: మండలంలోని బస్వాపూర్‌ను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని స్థానిక నాయకులు గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను బంట్వారంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ గ్రామంగా బస్వాపూర్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. స్పందించి వెంటనే ప్రకటించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారి లో కాంగ్రెస్ నాయకులు మోహన్‌రెడ్డి, నర్సింలు, రాములు, పురుషోత్తం ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటే ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పిస్తామని కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పాఠశాల ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంబాపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కృషితో గ్రామంలో 328 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారని చెప్పారు. ఇంటి నిర్మాణంలో దళారులను నమ్మోద్దని.. ఆన్లైన్లో బిల్లులు చెల్లిస్తారని చెప్పారు. అనంతరం హౌసింగ్ డీఈఈ ఖలీమోద్దీన్ మట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనాల ప్రకారం ఇళ్లు కట్టుకుంటే బిల్లులు వస్తాయన్నారు. ఇప్పటి వరకు 21 ఇళ్లకు మార్కింగ్ వేశామన్నారు. త్వరలో వారికి బేస్మెంట్ బిల్లులు చెల్లిస్తామన్నారు. గతంలో ఫొటో దిగిన స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రతన్‌సింగ్, ఏఈ రహీం, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మైవూఫ్, పంచాయతీ కార్యదర్శి సంజీవ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. వివాద భూమిలో సెక్షన్ 164 విధింపు ఆర్డీఓ సూచనతో తహసీల్దార్ ప్రకటన తుర్కయంజాల్: ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కమ్మగూడ, తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో బీఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 164 అమలు చేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కె.అనంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్న్రెడ్డి ప్రకటించారు. గురువారం స్థానిక కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 240, 241, 242లోని 10.09 ఎకరాల భూమి తమదంటే తమదేనని ఇరు వర్గాలు వరుసగా గొడవలకు దిగుతుండటంతో బుధవారం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉండటంతో సెక్షన్ 164 విధించినట్లు ఆయన తెలిపారు. ప్లాట్లు, భూమి యజమానులతో పాటు, కోర్టు నుంచి ఆర్డర్ పొందిన వారు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరించారు. దీన్ని ఉల్లఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎల్మినేడులో వడగళ్ల వాన ఇబ్రహీంపట్నం రూరల్: ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామంలో కురిసింది. భారీ ఉరుములతో వడగళ్లు పడగా.. ఓ ఇంటిపై పిడుగుపడి రేయిలింగ్ కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. -
బుల్లెట్ తీసి బతికించారు..
గచ్చిబౌలి: సోమాలియా దేశంలో జరిగిన సివిల్ వార్‌లో ఓ యువకుడికి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కోమాలోకి వెళ్లిన యుకుడికి బుల్లెట్‌ను తీసేందుకు అక్కడి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు నెలల అనంతరం రోగిని ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 12 గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం 3.5 సెంటీ మీటర్ల పొడవు ఉన్న బుల్లెట్‌ను బయటకు తీసింది. దీంతో సదరు యువకుడు గులెమ్ మహముద్ హెర్సీ(27) ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. గురువారు కేర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు వివరాలు వెల్లడించారు. సోమాలియాకు చెందిన గులెమ్ మహమూద్ హెర్సీ అనే యువకుడికి అక్కడ జరిగిన సివిల్ వార్‌లో నుదుటి నుంచి బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిందన్నారు. చిన్న మెదడు దగ్గర చేరడంతో అతడు కోమాలోకి వెళ్లాడని, అక్కడి వైద్యులు తల ముందు పుర్రె ముందు భాగం నుంచి బుల్లెట్‌ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. కోమాలోంచి కొద్దిగా కోలుకున్న తర్వాత అతడిని రెండు నెలల అనంతరం ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారన్నారు. రేడియాలజీ, సిటీస్కాన్, ఎంఆర్ఐలో బుల్లెట్ పొజిషన్, లోకేషన్‌ను గుర్తించామన్నారు. న్యూరో నావిగేషన్, సర్జికల్ మైక్రో స్కోప్ ద్వారా బ్రెయిన్ ఫంక్షన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 12 గంటల పాటు ఆపరేషన్ చేసి బ్లీడింగ్ కాకుండా, వైటల్ స్టక్చర్స్ను కాపాడుకుంటూ బుల్లెట్‌ను తీశామన్నారు. బ్రెయిన్ స్టెంట్ దగ్గర ఉన్న బుల్లెట్‌ను బయకు తీయడం చాలా అరుదుగా జరుగుతుంటుందన్నారు. సర్జరీ జరిగి రెండు వారాలు గడిచిందని, రోగి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ ఉంచామని, మరో నాలుగు వారాలు గడిస్తే మరింత కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ సీఈఓ నీలేష్ మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన కేసులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు , నిపుణులైన వైద్యులు తమ వద్ద ఉన్నారని తెలిపారు. ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చే అందర్జాతీయ రోగులకు గమ్యస్థానంగా కేర్ హాస్పిటల్ ఉందన్నారు. రెండు నెలలకు పైగా తలలో బుల్లెట్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స 3.5 సెంటీ మీటర్ల బుల్లెట్‌ను బయటకు తీసిన కేర్ వైద్యులు సురక్షితంగా బయటపడ్డ సోమాలియా యువకుడు -
ఇంట్లో పేలిన సిలిండర్
పహాడీషరీఫ్: స్టోర్ రూంలో ఉంచిన సిలిండర్ పేలిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రకుంట సాదత్‌నగర్‌కు చెందిన సల్మా భాను కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. బుక్ చేసిన గ్యాస్ రావడంతో ఇంటి బాల్కానీలో ఉన్న విజిటింగ్ రూమ్‌లో ఉంచారు. ఆ సమయంలో పిల్లలు పాఠశాలకు వెళ్లడంతో సల్మా లోపలి ఇంట్లో ఉంది. అప్పటికే లీకవుతున్న గ్యాస్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఇంట్లో ఉన్న సామగ్రి కాలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేని కారణంగా పెను ప్రమాదమే తప్పింది. ఇంటి పైకప్పు కూడా స్వల్పంగా ధ్వంసమయింది. తప్పిన పెను ప్రమాదం -
వరంగల్ సభను విజయవంతం చేద్దాం
అనంతగిరి: భారత్ రాష్ట్ర సమితి వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం వికారాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 27 నాటికి 25 ఏళ్లు కావొస్తున్న శుభ తరుణంలో వరంగల్‌లో నిర్వహించబోయే సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. సమావేశానికి జిల్లా నుంచి 200 వరకు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాలలో బయలుదేరాలని సూచించారు. సభ జరిగే రోజు ఉదయమే జిల్లాలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రకటించారు. అనంతరం రజతోత్సవ సభ వాల్‌పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యూడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, రాష్ట్ర నాయకులు విజయ్‌కుమార్, రాజుగౌడ్, రాంరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఎంపీపీలు, వర్కింగ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుడాక్టర్ మెతుకు ఆనంద్ -
కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి
పరిగి: రాష్ట్ర ప్రజలకు కేంద్రం అందిస్తున్న సంక్షేమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి సూచించారు. గురువారం పట్టణ కేంద్రంలో పార్టీ క్రియాశీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం వాటా ఉందన్నారు. వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాలను ప్రతి పల్లెలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. అందులో భాగంగా గావ్ చలో గల్ చలో కార్యక్రమం ఉంటుందన్నారు. పార్టీ ఇచ్చినటువంటి తొమ్మది కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రామంలో స్వచ్ఛ భారత్, దళితవాడలో భోజనం, మాజీ సైనికులకు సన్మానం, వివిధ కుల పెద్దలను కలవడం, జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేయడం, డా.బీఆర్.అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు హరికృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నవాబుపేట: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని చించల్‌పేట గ్రామంలో గురువారం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యాన్ని ఎవరు కూడా సక్రమంగా తినేవారు కారన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సన్న బియ్యం పేదల పాలిట వరం.. దుద్యాల్: ప్రతిఒక్కరూ సన్న బువ్వ తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూర్పు భీములు, జిల్లా కార్యదర్శి దౌల్తాబాద్ మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని హస్నాబాద్‌లో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సన్న బియ్యంతో అన్నం తినాలంటే పెద్ద రైతు, ఆర్థికంగా స్థోమత ఉన్నవారే తినేవారన్నారు. పేదలు, సామాన్యులు కూడా సన్న బియ్యం వండుకుని తినాలనే ఉద్యేశ్యంతో ప్రభుత్వం అందరికీ పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ వెంకటేశ్, గ్రామస్థులు వెంకటయ్య, నరేశ్, రాజు, చంద్రప్ప, వెంకట్ ప్రసాద్, మైమూద్, నర్సిములు, వెంకటయ్య, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య -
రాజ్యాంగం మార్పునకు కుట్ర
పరిగి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణ కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాలు దక్కుతున్నాయన్నారు. దేశంలోని పెద్ద కుబేరాల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందన్నారు. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ఐక్యంగా ఉన్న ప్రజలు రెచ్చగొట్టి విడగొడుతుందని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటు పడుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయూబ్, ఆలయ కమిటీ చైర్మన్ పార్ధసారథి, డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు పాలాద్రి శ్రీను, బాదం శ్రీను, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. బడాబాబుల కోసమే బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
నిలువ లేక.. నీరసించి
నవాబుపేట: పని ప్రదేశాల్లో నిలువ నీడ కరువయిందని గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలు గగ్గోలు పెడుతున్నారు. మండుటెండల్లో రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తున్నా కనీస వసతులు లేవని వాపోతున్నారు. జిల్లాలో 1.86 లక్షల జాబ్ కార్డులు ఉండగా ప్రస్తుతం 23,105 మంది కూలీలు పని చేస్తున్నారు. నవాబుపేట మండలంలో 8826 జాబ్ కార్డులు ఉండగా ఆరు వేలకు పైగా కూలీలు ఉపాధి పొందుతున్నారు. మండుటెండల్లో పనులు ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటలు అయ్యిందంటే బయటికి వెళ్లడానికి జనాలు జంకుతున్నారు. మండలంలోని చించల్‌పేట, మమ్మదాన్‌పల్లి, ఎక్మామిడి, నవాబుపేట, చిట్టిగిద్ద, అక్నాపూర్ తదితర గ్రామాల్లో సుమారు 6 వేల మందిపైగా కూలీలు మండటెండల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు చేస్తూ అలసిపోతున్నారు. సేదతీరేందుకు ఎలాంటి సదుపాయాలు లేక అస్వస్థతకు గురవుతున్నారు. రెండు నెలలుగా నిలిచిన వేతనాలు ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో అందరూ ఉపాధిహామీ పనులకు వస్తున్నారు. గత జనవరిలో చేసిన పనికి మాత్రమే కూలీ డబ్బులు ఖాతాల్లో జమచేయగా.. ఫిబ్రవరి, మార్చి నెలలో పని చేసిన వాటికి డబ్బులు రాలేదని మదన పడుతున్నారు. దీనిపై ఉపాధిహామీ అధికారులు సంప్రదిస్తే.. చేసిన పనులకు సంబంధించి మస్తర్లు జనరేట్ చేసి మెమోలు జారీ చేశామని, ప్రభుత్వం కూలీల డబ్బులు విడుదల చేస్తే నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని తెలుపుతున్నారు. నిబంధనలు గాలికి నిబంధనల ప్రకారం పనులు ఉపాధి పనుల జరుగుతున్న ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి. ప్రాథమిక చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందులో అయోడిన్, కాటన్, బ్యాండేజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లు వేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇవి ఎక్కడా కనిపించవు. కూలీల పిల్లల ఆలనా పాలన కోసం ఆయాలను ఏర్పాటు చేయాలి. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని శ్రమజీవులు ఆరోపిస్తున్నారు. రోజు వారీ వేతనం రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాఽధి పని ప్రదేశాల్లో కనిపించని సౌకర్యాలు మండుటెండల్లో విలవిలల్లాడుతున్న కూలీలు పట్టించుకోని అధికార యంత్రాంగం -
శిఖం భూమిలో నిర్మాణాలు
పహాడీషరీఫ్: జల్పల్లి పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. 69 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే ఈ భూమిపై ఎప్పటి నుంచో కన్నేసిన కబ్జాదారులు గతంలో ప్రహరీలు నిర్మించేందుకు యత్నించారు. అప్పట్లో బాలాపూర్ రెవెన్యూ అధికారులు స్పందించి కూల్చివేతలు చేపట్టారు. తాజాగా సెలవులు రావడంతో ఇదే అదునుగా భావించి మూడు భారీ ప్రహరీల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రాత్రికి రాత్రే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. చెరువులో నీరు తగ్గుముఖం పడుతున్నప్పుడు ఇలాంటి నిర్మాణాలు చేపట్టి, చివరకు తటాకం నిండినప్పుడు తమ నిర్మాణాలు మునిగిపోయాయంటూ గగ్గోలు పెట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఉస్మాన్‌నగర్‌లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై, ప్రజావసరాల కోసం ఏదైనా కమ్యూనిటీ హాల్, క్రీడా మైదానం లాంటివి నిర్మించడానికి కూడా స్థలం దొరకని పరిస్థితులు జల్పల్లి మున్సిపాలిటీలో దాపురించాయి. అక్కడక్కడ మిగిలిన కొద్దిపాటి ప్రభుత్వ భూములనైనా కబ్జా బారిన పడకుండా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రిపూట పనులు చేస్తున్న అక్రమార్కులు -
చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అనంతగిరి: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. బుధవారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్‌లోని సంఘం లక్ష్మీబాయి కళాశాలలో విద్యార్థినీలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. ఎక్కడైన బాల్యవివాహాలు జరుగుతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకోరాదని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ పి.రాము, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థిఽనీలు పాల్గొన్నారు. రేపు మెగా జాబ్‌మేళా తాండూరు టౌన్: మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 11న పట్టణంలోని సింధు బాలికల జూనియర్ కళాశాలలో బీసీ సంఘం, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు కొనసాగనున్న ఈ మేళాకు పది, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్టీ, డీఎంఎల్టీ, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు తగు సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వికారాబాద్‌లో తనిఖీలు అనంతగిరి: వికారాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్లో బుధవారం జిల్లా బీడీ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల గుర్తింపు.. నేర చర్యలకు అడ్డుకట్టవేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణను అడ్డుకోవడం కూడా ఈ తనిఖీలో ప్రధాన భాగమన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఘన సన్మానం అనంతగిరి: వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న బస్వరాజ్ పటేల్‌ను బుధవారం జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నాగయ్య, జిల్లా అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, బస్వరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్,నాయకులు లూయిస్,గౌస్ పటేల్, ధన్‌శెట్టి, సుధీర్, తిర్మలయ్య పాల్గొన్నారు. నేటి నుంచి రామలింగేశ్వర జాతర బంట్వారం: కోట్‌పల్లి మండలం బుగ్గాపురం రామలింగేశ్వర జాతర నేటి నుంచి ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్త మహేందర్‌రావు దేశ్‌ముఖ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం పల్లకీ సేవ, ధ్వజా రోహణం, 11న పల్లకీ సేవ, 12న అభిషేకం, రథోత్సవం, అన్నదానం, భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 13న పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, దీపార్చన, 14న పల్లకీ సేవ, ముగింపు వేడుకలు ఉంటుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు
● డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరవణ అనంతగిరి: అనుమతులు లేకుండా ఆస్పత్రులు, డయోగ్నస్టిక్ సెంటర్లు, లాబోరేటరీలు నిర్వహిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరవణ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఈశా హాస్పిటల్, అనంత్ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ యంత్రాలు, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి యాజమాన్యం, గైనకాలజిస్టులతో మాట్లాడారు. స్కానింగ్ అనేది బిడ్డ, తల్లి ఆరోగ్య పరిరక్షణ కోసం మాత్రమే చేయాలన్నారు. లింగ నిర్ధారణ కోసం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీలు చేసి పీఎన్డీటీపోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహిస్తున్న మెడికేర్ డయోగ్నస్టిక్ సెంటర్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో 15మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందించడం జరిగిందన్నారు. ఈ నియామకాలు అన్ని కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానం ప్రకారం కమిటీ ఆమోదం పొందిన అనంతరం పారదర్శకంగా చేపట్టడం జరిగిందన్నారు. -
అడవుల రక్షణ మన బాధ్యత
చెట్లను నరికితే మనకే నష్టం ● డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ ● సంగాయపల్లి తండాగిరిజనులతో సమావేశం ధారూరు: సాగుభూమి కోసం అడవులను నరికితే భవిష్యత్ తరాలకు ముప్పు తప్పదని, అడవులను కాపాడుకోవడం మన బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. బుధవారం ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలోని సంగాయపల్లి తండా గిరిజనులకు తన కార్యాలయంలో అడవిని నరకడం వల్ల కలిగే ముప్పును వివరించారు. సాగుభూమి కోసం చెట్లను నరికితే మీరే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. ఒక్క చెట్టును నరికినా తమ దృష్టికి వస్తుందన్నారు. అటవీ భూములకు హద్దులు నిర్ధరించి కందకాలు తవ్విస్తున్నామని తెలిపారు. ఇందుకు తండావాసులు సహకరించాలని కోరారు. కొంతమంది రాత్రివేళ అడవిలోకి ప్రవేశించి చెట్లను నరికివేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేయడం నేరమని పేర్కొన్నారు. అటవీ భూమిని సాగుభూమిగా మారిస్తే గూగుల్ మ్యాప్‌లో బయటపడుతుందన్నారు. ఇకపై చెట్లను నరకమని గిరిజనులు డీఎఫ్‌ఓకు హామీ ఇచ్చారు. సమావేశంలో ధారూరు రేంజర్ బీ రాజేందర్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సన్న బువ్వ.. విజయీభవ
సన్న బియ్యంపంపిణీపై హర్షం ● రేషన్ షాపులకు క్యూ కడుతున్న జనం ● జిల్లాలో మొత్తం దుకాణాలు 588 ● కార్డులు 2,48,122, లబ్ధిదారులు 8,52,122 మంది ● ప్రతినెలా పంపిణీ చేస్తున్న బియ్యం 5,582 మెట్రిక్ టన్నులు వికారాబాద్: వరి అన్నాన్ని జేజ బువ్వ అని ముద్దుగా పిలుచుకోవడం మనందరికీ తెలుసు.. అందులోనూ సన్నబియ్యం అన్నం తినడం అంటే పేదలకు గొప్ప విషయమేనని చెప్పాలి. అలాంటి కలను ప్రభుత్వం నెరవేర్చడంతో రేషన్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసినంత కాలం తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారో దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈ పథకంపై ఎవ్వరిని కదిపినా సన్నబియ్యం పంపిణీ చాలా మంచి కార్యక్రమం అని కితాబు ఇస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని కేవలం దోసె పిండికి మాత్రమే వినియోగించేవారు.. చాలా మంది కిరాణా దుకాణాల్లో విక్రయించేవారు. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ రేషన్ షాపునకు వస్తున్నారు. జిల్లాలో 588 రేషన్ దుకాణాలు.. 2,48,122 కార్డులు.. 8,52,122 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 5,582 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రజల నమ్మకం వమ్ము కాకుండా చూడాలి మిల్లర్ల మాయాజాలం.. రేషన్ డీలర్ల కుమ్మక్కు మంత్రం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో గతంలో రేషన్ బియ్యం పంపిణీ పథకం అభాసుపాలైన విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పటి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యంలో 50 శాతానికి పైగా తినకుండా బయట విక్రయించారు. మిల్లర్లు దొడ్డు బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రీసైక్లింగ్ తర్వాత మళ్లీ లెవీ రూపంలో ప్రభుత్వానికి అందజేసేవారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లులకు తరలించగా వాటిని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల బాట పడుతున్నారు. -
పార్టీని బలోపేతం చేద్దాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి కుల్కచర్ల: క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్రం వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తామే అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, నెరవేర్చని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఘనపురం వెంకటయ్య, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ముదిరాజ్, దిశ కమిటీ సభ్యులు జానకిరాం చౌహాన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కాటనిపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానం అభినందనీయం
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డితాండూరు: దశాబ్దాల తర్వాత తాండూరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణమాత దాసోహ భవనాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్, వీరశైవ సమాజం ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం శివపార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి కృషితో ఆలయం అభివృద్ధి చెందుతోందన్నారు. గతంలో ఇక్కడ అన్నదానం జరిగేదని.. భవనం శిథిలం కావడంతో నిలిచి పోయిందన్నారు. ఆలయ కమిటీ, వీరశైవ సమాజం ప్రతినిధులు నూతన భవనాన్ని నిర్మించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింహులు, వీరశైవ సమాజం అధ్యక్షుడు ఆర్.బస్వరాజ్, సభ్యులు పటేల్ శ్రీశైలం, కోర్వార్ నగేష్, లింగదల్లి రవి తదితరులు పాల్గొన్నారు. త్వరలో చిలుక వాగు ప్రక్షాళన పట్టణంలో వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు చిలుక వాగు ప్రక్షాళన పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా తాండూరులోని కొడంగల్ మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. తాండూరులో సబ్‌కోర్టు ఏర్పాటుకు కృషి తాండూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. తాండూరు మున్సిఫ్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. పట్టణంలో సబ్ కోర్టు ఏర్పాటయ్యేలా చూడాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సబ్‌కోర్టు ఏర్పాటయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
స్మార్ట్ పంచాయతీ చీమల్‌దరి
● కేంద్ర టెలి కమ్యూనికేషన్ కార్యదర్శి నీరజ్ మిట్టల్ మోమిన్‌పేట: పట్టణాల్లో ఉన్న టెలి కమ్యూనికేషన్ పరిజ్ఞానాన్ని పల్లెలో కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి అవసరం ఉందని కేంద్ర టెలికమ్యూనికేషన్ కార్యదర్శి నీరజ్ మిట్టల్ అన్నారు. చీమల్‌దరి గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ గ్రామంలో టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షానలభై వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. చీమల్దరిలో వైఫై అందుబాటులో ఉందని, పట్టణాల్లో ఉన్న టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ఈ గ్రామంలో ఉందని తెలిపారు. ఆధార్ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారని, ఇలాంటి మరెన్నో స్మార్ట్ జీపీలను తయారు చేయాలని ఆయన సూచించారు. చీమల్‌దరి గ్రామం అన్నిరకాలు అభివృద్ది చెందిందని తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ బోధనలను పరిశీలించారు. ఆయన వెంట ప్రత్యేక డీజీటీ ప్రశాంత్ ఆర్.పాటిల్, తెలంగాణ టెలి కమ్యూనికేషన్ సీజీఎం జి.రత్నకుమార్, పీజీఎం చంద్రశేఖర్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ మనోహర్‌చక్రవర్తి, ఆర్ఐ గోవర్ధన్, కార్యదర్శి భరత్‌కుమార్ ఉన్నారు. -
కదలని ‘ఇందిరమ్మ’
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక్క అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. పైలెట్ గ్రామాల్లో పథకం ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు ఉండగా ఒక్కోదానికి 3,500 చొప్పున 14,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. మొదటి విడతలో 2,285 ఇళ్లకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. 266 ఇళ్లకు హౌసింగ్ అధికారులు మార్కింగ్ ఇవ్వగా కేవలం 23 ఇళ్లకు సంబంధించిన పునాది పనులు మాత్రమే పూర్తయ్యాయి.మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా రెండో విడత లబ్ధిదారులను ఎంపికకుఅధికారులు సిద్ధమయ్యారు. పథకం సమర్థవంతంగా అమలు కాకపోవడానికి ఇంజనీర్ల కొరత కూడా ఓ కారణంగా తెలుస్తోంది. పథకం పర్యవేక్షణకు ఒక పీడీ, నలుగురు డీఈలు, ముగ్గురు ఏఈలు మాత్రమే ఉన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోజరుగుతున్న జాప్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – వికారాబాద్ – పూర్తి వివరాలు 9లోu -
‘ఫ్యూచర్’తో ఉద్యోగావకాశాలు
యాచారం: కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తుండడంతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. అమెజాన్ సంస్థ గునుగల్ ఆదర్శ కళాశాల, పాఠశాలను దత్తత తీసుకుని రూ.కోటిన్నరకు పైగా నిధులతో కిచెన్, భోజనశాల అలాగే గదులకు పెయింటింగ్ తదితర అభివృద్ధి పనులను చేపట్టింది. బుధవారం వాటిని ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేసి ఫోర్త్‌సిటీ(ఫ్యూచర్)ని నిర్మిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఇక్కడ రూ.లక్ష 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఫ్యూచర్‌సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిర్మిస్తుందని తెలిపారు. అమెజాన్ సంస్థ ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అమెజాన్ సంస్థ ప్రతినిధులు ఓంకార్, ట్రెలర్, పార్ధసారథి, ఆదర్శ కళాశాల, పాఠశాలల అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌చారి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, గునుగల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటుకు కృషి ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తులేకలాన్ గ్రామంలో అమెజాన్ సహకారంతో నూతన గ్రంథాలయం నిర్మాణం కోసం ఎమ్మెల్యే రంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూధన్‌రెడ్డిలు కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న పోటీ ప్రపంచంలో చదువులు విలువై పోయాయన్నారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, మాజీ సర్పంచ్ సమతరాంరెడ్డి, నాయకులు శశాంక్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పాండు, మహేందర్, విజయ్, శివ, ప్రభు, సంజీవ, శ్రీను, చింటురెడ్డి, మల్లేష్, బీరప్ప, దాసు, శంకర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. అమెజాన్ సంస్థ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
స్థానిక పోరుకు సిద్ధం కావాలి
అనంతగిరి: కేంద్రం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందరెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం అటల్జీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పార్టీ క్రియశీల సభ్యుల సమావేశం వికారాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై మనం చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శివరాజుగౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్‌రెడ్డి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ బస్వలింగం, మాజీ మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందరెడ్డి -
కనీస వేతనం అందించాలి
కొడంగల్ రూరల్: ఇతర జిల్లాల్లో ఇచ్చే వేతనాల మాదిరిగానే తమకు ఇవ్వాలని స్థానిక మిషన్ భగీరథ కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం మిషన్ భగీరథ సంప్హౌజ్ ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో కార్మకులకు రూ.15,500లు చెల్లిస్తుండగా కొడంగల్‌లో కేవలం రూ.10,900లు మాత్రమే అందిస్తున్నారని వాపోయారు. గతంలో 9,900లు అందించేవారని, ఈ నెల నుంచే వెయ్యి రూపాయలను పెంచారన్నారు. గత ఆరు నెలల నుంచి ఈపీఎఫ్ జమ చేయడంలేదని, తమ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కొడంగల్ మిషన్ భగీరథ అధికారులకు వినతిపత్రం అందించారు. గురువారం సమస్యలను పరిష్కరించని పక్షంలో శుక్రవారం నుంచి విధులు బహిష్కరిస్తూ సమ్మె చేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాంచందర్, వెంకటయ్య, అబ్దులప్ప, ఆదిత్య, హరిప్రసాద్ తదతరులు పాల్గొన్నారు. ● సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేపడుతాం ● మిషన్ భగీరథ కార్మికులు -
విద్యార్థులకు క్రమశిక్షణ ప్రధానం
దోమ: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను నేర్చుకోవాలని ఎంఈఓ వెంకట్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు షఫి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుందని, విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు, స్కూల్ చైర్మన్ నసీమా బేగం, కాంప్లెక్స్ సీఆర్పీ వెంకటేశ్, ఉపాధ్యాయులు ప్రవీణ్, ముత్యప్ప, నరేందర్, సావిత్రి, స్వప్న, జరీనా బేగం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు
బొంరాస్‌పేట: వేసవితాపానికి ఉపశమనం కోసం ఇంట్లో పెట్టుకున్న కూలర్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల పరిధిలోని తుంకిమెట్లలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సఫియాబేగం ఇంట్లో మధ్యాహ్నం కూలర్ ఆన్చేసుకొని ఉండగా కొద్దిసేపటికి అందులోంచి మంటలు వ్యాప్తించాయి. చూస్తుండగానే వేగంగా వ్యాప్తి చెందడంతో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు అరవడంతో కాలనీవాసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనంతో సిబ్బంది మంటలు పూర్తిగా చల్లార్చారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వస్తువులు కాలిపోయాయని బాధితురాలు వాపోయింది. రూ.6లక్షల మేర నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. బాధితురాలిని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అనిఫ్ పరామర్శించారు. -
ఘనంగా మైసమ్మ బోనాలు
దుద్యాల్: మండల పరిధిలోని కుదురుమల్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని కాలనీలో ఉదయం నుంచి మహిళలు సందడి చేశారు. రాత్రి వేళ అమ్మవారికి సమర్పించే బోనాల ఊరేగింపు ఆకట్టుకుంది. గుర్తు తెలియని వృద్ధుడి మృతి అనంతగిరి: గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భీంకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద ఈనెల 7న సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు 60–65 ఏళ్ల వయసు కలిగి ఉన్నాడని, బ్రౌన్ కలర్ షర్ట్, తెల్లగడ్డం ఉందన్నారు. ఎవరైనా గుర్తుపడితే వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు బుధవారం సీఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత బొంరాస్‌పేట: మండల పరిధిలోని దుప్చర్లలో ఇసుకను నిల్వచేసి అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టరును మంగళవారం రాత్రి పోలీసులు పట్టేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవూఫ్ తెలిపారు. తహసీల్దారు అనుమతులు ఉన్న చోట కాకుండా అక్రమంగా మరో చోటునుంచి ఇసుకను నిల్వచేసి తరలిస్తున్న దుప్చర్లకు చెందిన శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, ట్రాక్టరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు. సన్నబియ్యం పేదలకు వరం దౌల్తాబాద్: పేదలకు సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు వరంలాంటిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. బుధవారం మండలంలోని గోకఫసల్వాద్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వీరన్న, కొండాగోపాల్, భీంరెడ్డి, రెడ్డిశ్రీనివాస్, షకీల్, జాకీర్ తదితరులున్నారు. రేపటి నుంచి బాకారం ఉత్సవాలు యాలాల: మండలంలోని బాకారం ఆంజనేయస్వామి జాతర ఉత్సవాలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజు భజన మండలి ఆధ్వర్యంలో యాలాల నుంచి స్వామివారి పల్లకీ సేవా కార్యక్రమం ఆలయం వరకు ఉంటుందన్నారు. శనివారం రోజు స్వామి వారికి అభిషేకం, అన్నదానం, రథోత్సవం ఉంటుందని తెలిపారు. ఆదివారం సత్యనారాయణస్వామి పూజ, పెరుగుబసంతం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆంజనేయస్వామి వంశపారంపర్య అర్చకులు, ధర్మకర్తలు హర్షవర్ధన్జోషి, విష్ణువర్ధన్జోషి తెలిపారు. 12న కరన్‌కోట్‌లో రథోత్సవం తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12, 13వ తేదీల్లో జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమాన్ ఆలయం వద్ద 12న రాత్రి 10 గంటలకు రథోత్సవం, 13న లంకాదహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
విద్యుత్ సరఫరాలో అంతరాయం
కొడంగల్ రూరల్: కొడంగల్ సబ్‌స్టేషన్ 33కేవీ లైన్ మరమ్మతుతోపాటు మెయింటెన్స్ పనుల నిమిత్తం గురువారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ప్రవీణ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. మద్యం మత్తులో కూలీ ఆత్మహత్య తాండూరు రూరల్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని సిరిగిరిపేట్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంటింటి ఈశ్వరప్పకు ముగ్గురు కొడుకులు. అందరికి వివాహం కావడంతో వేరువేరు కాపురాలు పెట్టారు. పెద్ద కుమారుడు వీరేశం(37) కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. కొంతకాలంగా ఆయన మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి ఇంటి పరిసరాల్లో వీరేశం ఉరేసుకున్నాడు. ఉదయం ఇంటి ఆవరణలో విగతజీవిగా పడి ఉండటాన్ని ఆయన భార్య పుష్పమ్మ చూసి కుటుంబసభ్యులకు తెలిపింది. మద్యానికి బానిసై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఈశ్వరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి కుల్కచర్ల: యువత ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకుసాగాలని కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని ముజాహిద్పూర్ గ్రామంలో అగ్నివీర్‌కు ఎంపికై న శివకుమార్‌ను ఘనంగా స్థానిక పాఠశాలలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత వ్యసనాల బారిన పడకుండా దృఢ సంకల్పంతో లక్ష్యం వైపు సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జనార్దన్‌రెడ్డి, నాయకులు కృష్ణయ్య, అంబదాస్, గోపాల్, శ్రీనివాస్, హన్మంతు, రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలుబీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్ట్యానాయక్ పరిగి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయని బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్ట్యానాయక్ అన్నారు. బహజన ముక్తి పార్టీ బుధవారం జైల్ భరో ఆందోళన కార్యక్రమానికి పిలుపు నివ్వడంతో ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తూ అరెస్ట్ చేశారు. అనంతరం బీఎంపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్లను దొంగలించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డాక్టర్.బీఆర్.అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీస చర్యలు తీసుకోలేరన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆలయ వార్షికోత్సవం అనంతగిరి: షిర్డీ సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటుందని ఆలయ ట్రస్టు సభ్యులు రాజేందర్ అగర్వాల్, సంతోష్ అగర్వల్ అన్నారు. ఈ మేరకు వికారాబాద్ మండలం ఐనాపూర్ సమీపంలోని సాయిబాబా మందిరం అష్టమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాగడ హారతి, అభిషేకం, శ్రీ గణేశ, గోమాత, భవానిమాత తదితర పూజలు చేశారు. సాయంత్రం ఆలయంలో సాయిబాబా బృందం చేత భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆయా గ్రామాల ప్రజలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాలని, అయినా కేంద్రం ఒకేసారి సిలిండర్‌పై రూ.50 పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో గ్యాస్ వినియోగాదారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దీంతో నిత్యావసరాల ధరలపై కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే ధరలను తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, నవీన్, శ్రీనివాస్, యాదయ్య, జంగయ్య, రాములు, వెంకట్, వెంకటయ్య, గోపాల్, అలివేలు, అంజియ్య తదితరులు పాల్గొన్నారు. సామాన్యులపై భారం దుద్యాల్: కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ప్రజలపై భారం వేస్తూనే ఉందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య ఆరోపించారు. వంట గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచడంపై బుధవారం దుద్యాల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర సరకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని అన్నారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లయ్య. శ్రీనివాస్, వెంకటయ్య, రాములమ్మ, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ -
ఎంసీహెచ్‌లో గర్భస్థ శిశువు మృతి
తాండూరు టౌన్: వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భస్థ శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ తాండూరు పట్టణ శివారులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఎదుట బుధవారం పలువురు ఆందోళనకు దిగారు. మండలంలోని గౌతాపూర్ గ్రామానికి చెందిన లాలప్ప భార్య ఆశమ్మ పురిటినొప్పులతో మంగళవారం రాత్రి ఎంసీహెచ్‌లో చేరింది. పరీక్షించిన వైద్యులు మరో నెల రోజుల తర్వాత డెలివరీ కానున్నట్లు చెప్పి పంపేశారు. అయితే బుధవారం ఉదయం 6గంటలకు మరోసారి ఆశమ్మ పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు స్కానింగ్ తీసుకుని రావాలంటూ ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు పంపారు. స్కానింగ్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు గర్భంలోనే శిశువు మృతి చెందిందని చెప్పారు. అనంతరం ఆపరేషన్ చేసి ఆడ మృత శిశువును బయటకు తీశారు. అయితే పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే, వైద్యం చేయకుండా డాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహించారంటూ బాలింత ఆశమ్మ భర్త లాలప్ప, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంసీహెచ్ ఆసుపత్రిలో స్కానింగ్ తీయకుండా, ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు పంపారని, దీంతో సమయం మించిపోయిందన్నారు. పేదల ప్రాణాలంటే వైద్యులకు లెక్క లేదని, ఇక్కడ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యంలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, స్కానింగ్ ఉదయం 10గంటల తర్వాతే తీస్తారని, అందుకే బయటకు పంపానని గైనకాలజిస్ట్ డాక్టర్ శాలిని తెలిపారు. డెలివరీకి నెలరోజులు పైన ఉన్నప్పటికీ గర్భంలో శిశువు గుండె సరిగా కొట్టుకోకవడం వల్ల శిశువు మృతి చెంది ఉన్నట్లు ఆమె చెప్పారు.వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆందోళన -
కారుమబ్బులు.. రైతన్న గుబులు
దౌల్తాబాద్: గత మూడు రోజులుగా పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి. సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతమవుతోంది. చల్లని గాలులతో పలుచోట్ల వానలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పంటలు సాగు చేశారు. సరిగ్గా ప్రతిఫలం చేతికందే సమయంలో అకాల వర్షాలకు దిగులు చెందుతున్నారు. మండలంలోని గ్రామాల్లో యాసంగి సాగు చేసిన వరి పంట చేతికందనుంది. మరో వారంలో కోతలు షురూ కానున్నాయి. ఇప్పటికే హార్వెస్టర్లతో కోతలు కోయడానికి పంటలు ఆరబెడుతున్నారు. వాతావరణ మార్పులు ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఆందోళన చెందుతున్నా. పంటకోసే సమయంలో వరుణ దేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు. 5వేల ఎకరాల్లో సాగు మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో యాసంగిలో బోరుబావులు, చెరువుల కింద సుమారు 5వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. ఈర్లపల్లి, అంతారం, నందారం, చల్లాపూర్ తదితర గ్రామాల్లో మరో రెండు మూడు రోజుల్లో పంట కోత కోయడానికి రెడీగా ఉంది. ఇంతలో ఆకాశంలో కారుమబ్బులు అకాల వర్షాలకు వరికోయాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. భారీ వర్షాలు కురిస్తే పంట పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల కింద వరకు చాలా మంది రైతులు బోర్లలో నీరు లేక ఓ వైపు ఇబ్బందులు పడితే.. ప్రస్తుతం వానలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే పంట నేలకొరిగితే పొలాల్లో నీరు నిలిస్తే హార్వెస్టర్లతో కోయడానికి కష్టంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికందే సమయంలో వర్షాల ముప్పు ఆందోళన చెందుతున్న అన్నదాతలు కోయాలో వద్దో.. యాసంగిలో సాగు చేసిన వరి పంట కోతకు వచ్చింది. మూడు రోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం పడుతుందోనని ఆందోళనలో ఉన్నాం. పంట కోయాలో వద్దో తెలియడంలేదు. – జనార్దన్‌రెడ్డి, రైతు, నందారం -
దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్
అనంతగిరి: కరీంపూర్ గ్రామంలో అమాయకులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంపూర్ గ్రామస్తులు మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పలువురు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన ఆజాం ఆయన అనుచరులు అకారణంగా తమపై దాడి చేశారన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేయగా అక్కడికి వచ్చిన స్థానిక పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారని తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పటి వరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో శాంతియుత వాతవరణం కల్పించాలని కోరారు. ఎస్పీ కార్యాలయం ఎదుట కరీంపూర్ గ్రామస్తుల ఆందోళన -
ఎత్తుమడులతో అధిక దిగుబడులు
వ్యవసాయ నూతన సాగు విధానాలు రైతు ఇంట సిరులు కురిపిస్తోంది. ఎత్తుమడుల (బెడ్) పద్ధతిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. మోమిన్‌పేట: మారిన కాలానికనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో పసుపు సాగు చేపడుతుంది. బోజ, బెడ్డు పద్ధతిలో సాగుకు సమాయత్తం అవుతున్నారు. బెడ్డులో విత్తనం తక్కువ పట్టడం, డ్రిప్ పద్ధతిలో నీరును పెట్టడంతో కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. బెడ్, డ్రిప్ పద్ధతిలో భూమి గుల్లగా ఉండి కొమ్ము సాగుకు అనుకూలంగా ఉంటుందని దీంతో దిగుబడులు పెరుగుతాయని రైతులు వెల్లడిస్తున్నారు. ఎరువులు, నీటి యాజమాన్యం సరైన పద్ధతిలో పాటిస్తే దిగుబడులు అధికంగా వస్తాయని ఉద్యాన అధికారి అక్షితారెడ్డి పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం సాగు నీటి వసతి కల్గిన ప్రతీ రైతు పసుపు పంటను సాగు చేసేవారు. అర ఎకరా నుంచి మూడు ఎకరాల వరకు సాగును చేపట్టేవారు. మార్కెటులో ధర లేకపోవడం, పెట్టుబడులకు గిట్టుబాటు కాక పసుపు సాగును రైతులు పూర్తిగా విస్మరించారు. సాగు నీటి వసతి కలిగిన ప్రతీ రైతు పసుపు సాగు చేపట్టేవారు. ప్రస్తుతం పసుపు సాగు చేసే రైతులను వేళ్ల మీద లెక్కించవచ్చు. పసుపు సాగుకు పెట్టుబడులు ఎక్కువ... దిగుబడులు రాకుంటే నష్టాలు తప్పవు. పంట కోతకు వచ్చినప్పుడు కూలీల ఖర్చు ఎక్కువే. అందుకు మార్కెట్లో సుమారు 15 ఏళ్లుగా ధర లేక సాగుకు దూరంగా ఉన్నారు. గతేడాది నుంచి క్వింటాల్‌కు రూ.10వేలు దాటుతుండటంతో సాగు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. పసుపు సాగు పెరగాలంటే ప్రభుత్వం విత్తన రాయితీ ఇవ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు. బెడ్ పద్ధతి సాగుతో అధిక లాభాలు ఎరువులు, నీటి యాజమాన్యం పాటించాలి ఉద్యాన అధికారి అక్షితారెడ్డి ఆశించిన స్థాయిలో దిగుబడులు ఎకరంన్నరలో బెడ్డు పద్ధతిలో పసుపు సాగు చేశా. ఎరువులు, మందులను డ్రిప్ ద్వారా అందించడంతో పంట ఏపుగా పెరిగింది. మార్కెట్లో ధర రూ.10వేలకు పైగా ఉండడంతో ఈ సాగు చేపట్టాను. ట్రాక్టరు ద్వారా నే పసుపును తీశాం. దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చాయి. ఆవిరి యంత్రం ద్వారా ఉడికించాం. 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. – మోహన్‌రెడ్డి, రైతు, మోమిన్‌పేట -
బ్లాక్ ప్లాంటేషన్‌ను పరిశీలించిన అధికారులు
నవాబుపేట: మండల పరిధిలోని నారెగూడ గ్రామం సర్వే నంబర్ 153లో నాలుగేళ్ల క్రితం హరితహారంలో భాగంగా బ్లాక్‌ప్లాంటేషన్ కింద 8వేల మొక్కలు నాటారు. వీటి చుట్టూ గడ్డి ఏపుగా పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో మొక్కలు కాలిబూడిదయ్యాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’దినపత్రికలో మంగళవారం ‘అగ్నికి ఆహుతైన బ్లాక్ ప్లాంటేషన్’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఇందుకు స్పందించిన అధికారులు ఎంపీఓ విజయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శోభ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అనంతరం ఎంపీఓ మాట్లాడుతూ.. కాలిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుతామన్నారు. ఏపుగా పెరిగిన మొక్కలకు నీరందిస్తే బ్రతికే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ సిబ్బందితో నీరు అందిస్తున్నామని చెప్పారు. మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్ బొంరాస్‌పేట: మండల పరిధిలోని మహంతీపూర్ వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టివేశారు. అక్రంగా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ రవూఫ్, కానిస్టేబుళ్లు మండల పరిధిలోని రేగడిమైలారం వద్ద మహంతీపూర్కు చెందిన బందెయ్య, మహేందర్, అంజి ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశౠరు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కేసు నమోదు బొంరాస్‌పేట: మండల పరిధిలోని ఎన్కేపల్లిలో సోమవారం మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై మంగళవారం మృతుడి అన్న ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ రవూఫ్ తెలిపారు. తన తమ్ముడికి తల్లిదండ్రులు లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని కొడంగల్‌కు చెందిన నడిమింటి కిష్టప్ప ఫిర్యాదు చేశారన్నారు. మృతుడి భార్య, తన మరదలు నర్సమ్మ, ఇతరుల ప్రమేయం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబ పోషణ భారంగా ఉందని తరచుగా మల్కప్ప మనస్తాపానికి గురయ్యేవాడని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ మాడ్గుల: నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. సీఐ వేణుగోపాల్ రావు తెలిపిన ప్రకారం.. మంగళవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. మండల పరిధిలోని అందుగుల శివారు నుంచి ట్రాక్టర్లో మట్టి తరలిస్తున్నారు. పోలీసులు వాహనాన్ని నిలిపి పత్రాలు పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ వాహన యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. వైన్స్‌లో చోరీ యాచారం: ఓ వైన్స్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు రూ.30 వేల నగదు చోరీ చేశారు. వివరాలు.. మండల కేంద్రంలోని నందివనపర్తి రోడ్డులో లక్కీవైన్స్ యజమానులు సోమవారం రాత్రి షాప్‌నకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం వైన్స్ వద్దకు వచ్చి చూడగా షటర్లు పగులగొట్టి ఉన్నాయి. గల్లాపెట్టెలోని రూ.30 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి బలవన్మరణం కొందుర్గు: కుటుంబ సమస్యల కారణంగా తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని గంగన్నగూడలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చింతకింది రాములు(35)కు 12 ఏళ్ల కిత్రం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. పది రోజుల క్రితం కుమారుడు అస్వస్థతకు గురవ్వడంతో కవిత పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రాములుకు వ్యవసాయంలో నష్టం రావడం, కుమారుడి ఆరోగ్యం బాగులేకపోవడం, భార్య పుట్టింటికి వెళ్లడంతో తాగుడుకు బానిసయ్యాడు. మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం రాములు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు తట్టిచూడగా అప్పటికి ఉరేసుకుని మృతి చెందియున్నాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సరికొత్తగా సైబర్ నేరాలు
మోమిన్‌పేట: సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో కొత్త దారులు అన్వేషిస్తున్నారు. బస్సులు, సంతలు తదితర రద్దీ ప్రదేశాల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తున్న దుండగులు డిజిటల్ పేమెంట్స్ రూపంలో నగదు బదిలీచేసుకుంటున్నారు. మోమిన్‌పేట ఠాణా పరిధిలో ఒకే నెలలో రెండు ఇలాంటి కేసులే నమోదయ్యాయి. మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రశీద్ విధుల్లో భాగంగా వికారాబాద్ వెళ్లాల్సి రావడంతో బస్సు ఎక్కాడు. అంతలోనే ఫోనణ్ చోరీకి గురైంది. వెంటనే బ్యాంకులకు సమాచారం అందించడంతో డబ్బులు పోలేదు. మార్చి 2న మోమిన్‌పేటకు చెందిన రుద్రశెట్టి శివకుమార్ వికారాబాద్‌కు వెళ్లేందుకు బస్టాండులో బస్ ఎక్కాడు. అంతలోనే ఫోన్ అపహరణకు గురైంది. మరుసటి రోజు బ్యాంకులకు సెలవు ఉండడం, బ్యాంకులకు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన లేకపోవడంతో మరుసటి రోజు రెండు వేర్వేరు ఖాతాల నుంచి రూ.1.44లక్షలు నగదు బదలాయింపు జరిగింది. డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన పిన్ నంబర్‌ను గుర్తించి ఈ దురాగాతానికి పాల్పడ్డారు. వారం రోజులకు పోలీసులను అశ్రయించాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు రూ.68వేలు ఫ్రీజ్ చేశారు. మిగిలిన డబ్బును కూడ రాబడతామని సీఐ వెంకట్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్ల చోరీ ఆపై డిజిటల్ లావాదేవీల పిన్ నంబర్లను గుర్తించి డబ్బులు కాజేస్తున్న దుండగులు ఫోన్ పోయిన బాధలోనే ఉన్నా ఫోన్ చోరీకి గురైందన్న బాధలోనే ఉన్నా. బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని తెలియదు. బ్యాంకు ఖాతాలో సురక్షితంగా ఉంటాయని అనుకున్నా. సీక్రెట్ నంబర్ ఎలా కనిపెట్టారో తెలియడం లేదు. – శివకుమార్, బాధితుడు, మోమిన్‌పేట -
బీసీల రిజర్వేషన్‌ను 52శాతానికి పెంచాలి
పరిగి: బీసీలకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్ ఆరోపించారు. మంగళవారం ఆయన పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 9న బీపీఎం ఆధ్వర్యంలో జాగోరే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్‌తో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. సుప్రీం కోర్టు సైతం ఈవీఎం ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరగవని తేల్చి చెప్పిందన్నారు. వక్ఫ్ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంబేడ్కర్‌పై అనుచిత వాఖ్యల చేశారని వారిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్, నాయకులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్ -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
షాద్‌నగర్: గ్రామ పంచాయితీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జీపీ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంల ఆవరణలో ఎంపీడీఓ బన్సీలాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ... పంచాయతీ కార్మికులకు రెండు నెలల వేతనాలను మాత్రమే కార్మికుల ఖాతాలలో వేశారని, మరో మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించడంతో పాటుగా పర్మినెంట్ గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ బన్సీలాల్ మాట్లాడుతూ.. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, మా పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య, నా యకులు రాజునాయక్, శంకర్‌నాయక్, జీపీ కార్మికులు తదితరులు ఉన్నారు. జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
సుపరిపాలనలో చీమల్‌దరి బెస్ట్
ఉత్తరప్రదేశ్, కేంద్ర బృందంసభ్యుల కితాబు మోమిన్‌పేట: సుపరిపాలనలో చీమల్‌దరి గ్రామం ఆదర్శంగా ఉందని ఉత్తరప్రదేశ్ అధికారులు, కేంద్ర బృందం సభ్యులు కితాబునిచ్చారు. మంగళవారం 24 మంది సభ్యులతో కూడిన బృందం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, రోడ్లు, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, ప్రజలకు పంచాయతీ నుంచి అందుతున్న సేవలు, పన్నుల వసూలు, వీధి దీపాల ఏర్పాటు తదితర వాటిని పరిశీలించారు. మారుమూల గ్రామం ఇలా అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తుల సహకారం, పంచాయతీ పాలకవర్గం పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. సుపరిపాలనలో గ్రామానికి జాతీయ అవార్డు రావడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, డీఎల్పీఓ సంధ్యారాణి, ఎంపీఓ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి సుగుణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై సీఎం ప్రత్యేక దృష్టి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి బొంరాస్‌పేట: ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఏర్పుమళ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫాంకు సంబంధిచిన క్లాత్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, భోజనం, ఏకరూప దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరింత ప్రగతి ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రాములు గౌడ్, జయకృష్ణ, మల్లేశం, రాంచంద్రారెడ్డి, అంజిల్‌రెడ్డి, మల్లికార్జున్, హెచ్ఎం వెంకట్‌రెడ్డి, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం తాండూరు రూరల్: మండలంలోని జినుగుర్తి గేటు వద్ద గల గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ విజయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) ఒక పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైన డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసిన సర్టిఫికెట్ ఉండాలన్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు పదో తరగ తి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ మానస హి ల్స్ వద్ద ఉన్న గిరిజన గురుకుల ప్రధాన కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపు జాబ్‌మేళా జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సుభాన్ అనంతగిరి: శ్రీ మంత్ర టెక్నాలజీ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 10న వికారాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సుభాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30గంటలకు పట్టణంలోని ఐటీఐ కళాశాల ఆవరణలో జాబ్‌మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పోగొట్టుకున్న బంగారం రికవరీ
కేశంపేట: శుభకార్యంలో జరిగిన గొడవలో బంగారం పోగుట్టకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి పోగుట్టుకున్న బంగారు ఆభరణాన్ని రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. వివరాలు.. మండల పరిధిలోని సంతాపూర్కు చెందిన గుండేటి నర్సింహ సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్లో నిర్వహిస్తున్న శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ బంధువులతో జరిగిన గొడవలో తన రెండు తులాల బ్రాస్లెట్ పోగొట్టుకున్నాడు. మంగళవారం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కానిస్టేబుల్ అశోక్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరాలను పరిశీలించాడు. బంగారం తీసుకున్న వ్యక్తిని గుర్తించి అతడి వద్ద నుంచి రికవరీ చేశారు. సీఐ నరహరి, ఎస్ఐ రాజ్‌కుమార్ బాధితుడికి రికవరీ చేసిన బ్రాస్లెట్ అప్పగించారు. -
విలీనం దిశగా అడుగులు
మెప్మాను సెర్ప్లోకలిపేందుకు కసరత్తు ● జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ● 2,614 స్వయం సహాయక సంఘాలు ● ఇప్పటికే వివరాలు సేకరించిన అధికారులు ● మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు తాండూరు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాలను ఒకే గొడుగు కిందకు తేవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ఎన్ని సంఘాలు ఉన్నాయి.. ఎంత మంది సభ్యులు ఉన్నారు అనే వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు ఈ ప్రక్రి య పూర్తి కావచ్చినట్లు తెలిసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యకలాపాలు మున్సిపాలిటీల ఆధ్వర్యంలో కొనసాగుతూవచ్చాయి. మెప్మా ను సెర్ప్‌లోకి విలీనం చేస్తే డీఆర్డీఏ ఆధీనంలోకి వెళ్తుందా లేక మున్సిపాలిటీలకే బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో ని నాలుగు మున్సిపాలిటీల్లో 2,614 మహిళా సమాఖ్య సంఘాలు, 26,150 మంది సభ్యులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో మెప్మా విభాగం కొనసాగుతూవస్తోంది. ఈ సంఘాల్లోని సభ్యులకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.67.47 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలను అందించారు. ఇక నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్‌లోకి మెప్మా విలీనం కానుంది. మెప్మాలో 94 మంది ఆర్పీలు, ఇద్దరు టీఎంసీలు, ముగ్గురు డీఈఓలు, నాలుగురు సీఓలు ఉన్నారు. వీరంతా సెర్ప్ ఉద్యోగులుగా మారనున్నారు. సెర్ప్ ఆధీనంలోకి 2,614 ఎస్‌హెచ్‌జీ గ్రూపులు జిల్లాలో 2,614 మహిళా సమాఖ్య సంఘాలు ఉన్నాయి. తాండూరు మున్సిపాలిటీలో 1,058 సంఘాలు, వికారాబాద్‌లో 977, పరిగిలో 318, కొడంగల్‌లో 261 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 26,150 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా బ్యాంక్ లింకేజీ రుణాలు పొందుతున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మున్సిపాలిటీల్లో 149 మంది మహిళలకు రూ.5.21 కోట్లు అందించారు. గ్రూపులుగా ఏర్పడిన సభ్యులకు ఇదే పథకం కింద(26 గ్రూపులకు) రూ.4 కోట్ల రుణాలు అందజేశారు. -
వంట.. మంట
● ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు ● జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 2,08,553 ● వేసవిలో నెలకు ఒకటి చొప్పున వినియోగిస్తున్న జనం ● ఏడాదికి ఒక్కో కుటుంబంపై రూ.600 వరకు అదనపు భారంవికారాబాద్: వంట గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలొ చ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.50 చొప్పున పెంచి పేదల నడ్డి విరిచింది. కేంద్రం తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.855 ఉండగా, తాజా పెంపుతో రూ.905కు చేరింది.దీంతో జిల్లా వాసులపై నె లకు సగటున రూ.45.78 లక్షల భారం పడనుంది. ప్రభుత్వంపై అదనపు భారం జిల్లాలో మొత్తం 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డులు ఉన్న 1,16,990 మందికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తోంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.400ల వరకు భరిస్తూ వచ్చిన సర్కారు ఇక నుంచి రూ.450 భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.58,49,500 గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో మహాలక్ష్మి పథకం వర్తించని గ్యాస్ కనెక్షన్లు 91,563 ఉండగా వారికి నెలనెలా రూ.45,78,150 అదనపు భారం పడనుంది. జిల్లాలో 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో జనరల్ కనెక్షన్లు(డబుల్ సిలిండర్లు)19,358, సింగల్ సిలిండర్ కనెక్షన్లు 69,902 ఉన్నాయి. కమర్షియల్ కనెక్షన్లు 3209 ఉండగా దీపం పథకం కింద 35,193 కనెక్షన్లు, ఉజ్వల్ పథకం 38,753 కనెక్షన్లు, సీఎస్ఆర్ కింద 21260 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. -
సత్వర పరిష్కారం
● అందుబాటులోకి ‘ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం’ ● ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటాఆక్వజేషన్’తో అనుసంధానం ● అందుబాటులోకి తెచ్చిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సబ్స్టేషన్లలో తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలు సహా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ఈదురుగాలితో కూడిన వర్షానికి ఫీడర్ ట్రిప్ అవుతుండటం, షార్ట్‌సర్క్యూట్ కారణంగా అండర్ గ్రౌండ్(యూజీ) కేబుల్స్, ఎయి ర్ బంచడ్ (ఏబీ) కేబుల్స్ జాయింట్ల వద్ద తలెత్తే సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరాపై సీఎండీ మొదలు క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అలర్ట్ చేసే ‘ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం’ (ఎఫ్ఓఎంఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్వజేషన్’ (స్కాడా)కు అనుసంధానం చేసింది. దీంతో ఏ సబ్‌స్టేషన్‌లోని ఫీడర్.. ఏ సమయంలో ట్రిప్ అయింది.. ఏ ప్రాంతానికి.. ఎంత సమయం కరెంట్ సర ఫరా నిలిచిపోయింది.. సరఫరాను ఎన్ని గంటల్లో పునరుద్ధరించారు.. వంటి సమగ్ర సమాచారం ఉన్నతాధికారులకు చేరవేస్తోంది. ఫలితంగా కరెంట్ కోతలు, సరఫరా పునరుద్ధరణలో చోటు చేసుకుంటున్న జాప్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం ఉండదు. ఆరా తీయాల్సిన అవసరం లేకుండా.. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పెద్ద సంఖ్యలో ఫీడర్లు ట్రిప్పవుతుంటాయి. ఒకేసారి అనేకప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ సమయంలో ఎవరైనా వినియోగదారులు ఫ్యూజ్ ఆఫ్ కాల్‌సెంటర్ (ఎఫ్ఓసీ) సహా 1912/ లేదా క్షేత్రస్థాయి జేఎల్ఎం, ఏఈలకు సమాచారం ఇస్తే కానీ సంబంధిత అధికారులకు విషయం తెలిసేది కాదు. సాంకేతిక సమస్య గుర్తింపు క్షేత్రస్థాయి సిబ్బందికి పెద్ద సమస్యగా మారేది. అర్థరాత్రి జోరున కురిసే వర్షం లోనూ లైన్ టు లైన్ తిరగాల్సి వచ్చేది. సమస్యను గుర్తించి, సరఫరాను పునరుద్ధరించేందుకు రెండు మూడు గంటల సమ యం పట్టేది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యా దులు వచ్చేవి. ఈ సమయంలో సీఎండీ సహా ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఫోన్ చేసి ఆరా తీస్తే.. సరైన కారణం చెప్పే వారు కాదు. కొంత మందైతే ఏకంగా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించే వారు. ఇది వారికి తలనొప్పి గా మారేది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టంతో తలెత్తిన సాంకేతిక సమస్యతో పాటు సరఫరా పునరుద్ధరణ వెంటనే తెలిసిపోతుంది. కేంద్ర కార్యాలయాల్లో కూర్చొనే క్షేత్రస్థాయి సిబ్బంది పని తీరును మానిటరింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో కీలకం గ్రేటర్లో 11 కేవీ ఫీడర్లు 3,421 వరకు ఉన్నాయి. వీటిలో 1,353 ఫీడర్లను ఇప్పటికే ఈ ఎఫ్ఓఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే తెలుసుకునే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం భారీ ఈదురుగాలితో కూడిన వర్షానికి గ్రేటర్లో 449 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈ ఎఫ్ఓఎంఎస్ సహకారంతో 410 ఫీడర్ల పరిధిలో అర గంటలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సోమవారం హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో హిందీనగర్, ఆలియాబాద్, బ్యాంక్‌కాలనీ సహా హబ్సీగూడ సర్కిల్ పరిధిలో బోడుప్పల్, సూర్యహిల్స్కాలనీ ఫీడర్ల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని ప్రాగాటూల్స్, రైతుబజార్, మేడిబావి, ఆర్పీనిలయం, ఈఎంఈ ఫీడర్ల పరిధిలోనూ సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లోని గృహాలు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎఫ్ఓఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను పునరుద్ధరించడంతో పాటు తలెత్తిన సాంకేతిక సమస్యలను గుర్తించి, వ్యవస్థను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. -
పత్తి రైతుకు విత్తన భారం!
ఏటా పెరుగుతున్న ధరలుఎకరానికి మూడు ప్యాకెట్లుకొడంగల్: ఏటా పత్తి విత్తనాల ధరలు పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గడం, మద్దతు ధర రాక పోవడం, సాగు ఖర్చులు అమాంతం పెరిగి భారీ నష్టాలను చవిచూస్తున్నారు. వీటికి తోడు విత్తనాల ధరలు పెరగడం రైతులను మరింత కుంగదీస్తోంది. జిల్లా వ్యాప్తంగా కంది, వరి, పత్తి, జొన్న, పెసర, మినుము, వామ పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, కంది, పత్తి పంటలు సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో రైతులు పొలాలను దుక్కి దున్ని చదును చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పొలాలను సాగుకు సిద్ధం చేస్తారు. ఆరుగాలం కష్టించి పని చేసే రైతులకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం మార్కెట్లో పత్తి విత్తనాల ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బీటీ రకం పత్తి విత్తనాలకు డిమాండ్ ఉంది. ఈ రకం విత్తనాలు మంచి దిగుబడి ఇవ్వడంతో ఇతర సమస్యలను తట్టుకుంటుందని రైతులు భావిస్తున్నారు. గతంలో ఒక ప్యాకెట్ బీటీ పత్తి విత్తనాలు(475 గ్రాములు) రూ.760 ఉండగా ప్రస్తుతం రూ.900కు చేరింది. తప్పని కష్టాలు మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనాలు నాటింది మొదలు పత్తి దిగుబడి చేతికొచ్చి విక్రయించే వరకు ఇక్కట్లు తప్పడం లేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే పత్తి విత్తనాల కంపెనీలు ధరలను పెంచాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరగనుంది. పెరిగిన సాగు ఖర్చులు.. విత్తనాల ధరల వల్ల ఈ ఏడాది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు నకిలీ విత్తనాల బెడద పెరిగింది. తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు పంట దిగుబడి రాక నష్టపోతున్నారు. పెరుగుతున్న సాగు ఖర్చులు ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికితో డు విత్తనాలు, పురుగు మందులు, కూలీల వేతనా లు కలిపి రూ.వేలల్లో పెట్టుబడులు అవుతున్నాయి. కూలీల రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నా యి. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు కలుపుతీత కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. సాగు ఖర్చులు కూడా అదే స్థాయిలో.. అన్నదాతలపై ఆర్థిక భారం జిల్లాలో 60వేల ఎకరాల్లో పంటల సాగు సబ్సిడీపై అందజేయాలని వేడుకోలు జిల్లాలో కంది, వరి తర్వాత అధిక విస్తీర్ణయంలో సాగు చేసేది పత్తి ఒక్కటే. ఎకరాకు మూడు ప్యాకెట్టు చొప్పున విత్తనాలను విత్తు కోవాల్సి ఉంటుంది. ఒక్కో ప్యాకెట్ 475 గ్రాములు ఉంటుంది. ఇందులో 450 గ్రాములు బీటీ విత్తనాలు, 25 గ్రాములు నాన్ బీటీ విత్తనాలు ఉంటాయి. రైతులు బీటీ విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఐదేళ్లలో పెరిగిన పత్తి విత్తనాల (ప్యాకెట్) ధరలు ఇలా.. 2021 రూ.760 2022 రూ.810 2023 రూ.840 2024 రూ.850 2025 రూ.900రైతులను ఆదుకోవాలి ఏటా సాగు ఖర్చులు పెరు గుతున్నాయి. విత్తనాలు, ఎరువుల ధరలను ప్రభు త్వం తగ్గించి రైతులను ఆ దుకోవాలి.విత్తనాల ధరలు పెరగడం వల్ల మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. ధర తక్కువగా ఉందని రైతులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. పంటలకు ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించాలి. – అంజిలప్ప, రైతు, గుండ్లకుంట -
‘ఆకార్ ఆశా’ సేవలను సద్వినియోగం చేసుకోండి
● అడిషనల్ కలెక్టర్ సుధీర్ ● ఉచిత శస్త్ర చికిత్సలపై అవగాహన సదస్సు మర్పల్లి: పుట్టుకతో వచ్చే లోపాలు, అంగవైకల్యంతో బాధపడే పేదలకు ఆకార్ ఆశా స్వచ్ఛంద సంస్థ ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంసీఎం ఫంక్షన్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆకార్ ఆశా సేవలపై అంగన్వాడీలు, ఆశ వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరవణ, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆకార్ ఆశా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భారతేంద్రస్వేన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకార్ ఆశా సేవలను అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు పుట్టుకతో వచ్చే లోపాలు, అంగవైకల్యం, మొర్రి అంగలిలో లోపాలు, నాలుక అత్తుకుపోవడం, వినికిడి లోపం, కాళ్ల వేళ్లు, చేతి వేళ్లు అత్తుకుపోవడం, కనుబొమ్మలు, ఇతర అవయవాలు అభివృద్ధి చెందక పోవడం గురించి తెలియజేయడంతోపాటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య సేవలపై డెమో ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ మంజుల, డాక్టర్ షాలినీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జీవరాజ్, డాక్టర్ ప్రవీణ్, పట్లూర్ పీహెచ్సీ డాక్టర్ మానస హర్ష, డాక్టర్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ రాజ్ మల్లయ్య, ఎంపీఓ లక్ష్మీకాంత్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ మహేష్‌కుమార్, సీడీపీఓ ప్రవీణ, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణారావు, ఐకేపీ ఏపీఎం మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గేదేలే !
కొడంగల్ అభివృద్ధిలోసీఎం ప్రత్యేక చొరవతో శరవేగంగా కొనసాగుతున్న పనులు● చురుగ్గా 220 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం ● తుదిదశకు మున్సిపల్ కార్యాలయం ● పిల్లర్ స్థాయిలో ఆర్అండ్బీ అతిథి గృహం ● పారిశ్రామికవాడ దిశగా అడుగులు కొడంగల్: సమీప భవిష్యత్‌లో కొడంగల్ రూపురే ఖలు మారిపోనున్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వరద పారిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం అభివృద్ధి పనులు భూమిపూజ దాటి కార్యరూపం దాల్చాయి. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. భవన నిర్మాణాలకు ఒక్కో మండలానికి రూ.7.13 కోట్ల చొప్పున రెండు మండలాలకు కలిపి రూ.14.26 కోట్లు మంజూరు చేశారు. దుద్యాల్ మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఒకటేమిటి రూ.వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. నిధుల మంజూరు ఇలా.. కొడంగల్ మండలం ఎరన్‌పల్లి శివారులో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించనున్నారు. భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.124.50 కోట్లు మంజూరు చేశారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం రూ.46 కోట్లు విడుదల చేశారు.ప్రభుత్వ ఫిజియో థెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాల నిర్మా ణం కోసం రూ.27 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ పట్టణంలో 220 బెడ్ల ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రిని నిర్మాణానికి రూ.27 కోట్లు కేటాయించారు. కోస్గిలో ఇంజనీరింగ్ కళాశాల కోసం రూ.30 కోట్లు, మహిళా డిగ్రీ కళాశాల, మౌలిక వసతుల కల్పనకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ, మైనార్టీ వెల్ఫేర్ గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాల నిర్మాణం కోసం ఒక్కోదానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ముందుగా రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. తర్వాత పథకం సామర్థ్యం పెంచి నిధుల ను రెట్టింపు చేశారు. కొడంగల్‌లో ఆర్అండ్బీ అతి థి గృహం నిర్మించడానికి రూ.6 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ పనులు ఫిల్లర్స్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు, పలు పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా.. నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఏడాదిలోపు పూర్తయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.. కొడంగల్ పట్టణంలో చేపట్టిన 220ల పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణం తుది దశకు చేరుకోగా.. ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణ పనులు పిల్లర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా సమీకృత గురుకులాలు, మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల,పీజీ కళాశాల భవన నిర్మాణాల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పారిశ్రామికం వైపు అడుగులు నియోజవకర్గ పరిధిలోని దుద్యాల్ మండలం పోలేపల్లి, హకీంపేట, లగచర్ల గ్రామాల శివారులో సుమారు 1,200 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తికా వచ్చింది. రైతులకు పరిహారం చెల్లిస్తున్నారు. -
సంఘాలు ఐక్యంగా కొనసాగాలి
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: సంఘాలు సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణ కేంద్రంలో నిర్వహించిన పరిగి ఆర్యవైశ్య సంఘం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్య సంఘానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు మధుసూదన్, మాజీ కౌన్సిలర్లు కిరణ్, కృష్ణ, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎదురెదురుగా బైక్‌లు ఢీ ● ఒకరి దుర్మరణం,భార్యాభర్తలకు గాయాలు ● కేసు నమోదు చేసిన పోలీసులు ధారూరు: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు సమీప రోడ్డుపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ధారూరు ఎస్ఐ అనిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రుద్రారానికి చెందిన కంది శ్రీనివాస్(28) పని నిమిత్తం తన పల్సర్ బైక్‌పై వికారాబాద్ బయలుదేరాడు. గట్టెపల్లికి చెందిన నర్సింలు తన భార్య లక్ష్మితో కలిసి బైక్‌పై వికారాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఎబ్బనూర్ చెరువు సమీపంలోకి రాగానే రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. గాయపడ్డ వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం బొంరాస్‌పేట: కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ వ్యక్తి మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మండల పరిధిలోని ఎన్కేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవూఫ్ తెలిపిన ప్రకారం.. కొడంగల్ పట్టణానికి చెందిన పల్లగేరి మల్కప్ప(35)కు పన్నెండేళ్ల క్రితం ఎన్కేపల్లికి చెందిన గొటికె రాములప్ప కూతురు నర్సమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. మల్కప్పకు తల్లిదండ్రులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబపోషణ సైతం భారంగా ఉందని మదనపడుతున్నాడు. తాజాగా తన భార్య పుట్టింటికి వెళ్లడంతో సోమవారం ఎన్కేపల్లికి వచ్చిన ఆయన కొడంగల్‌కు వెళ్దామని కోరాడు. దీంతో ఆయన మామ రాములు ముందుగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన మల్కప్ప ఎన్కేపల్లి శివారులో పప్పురేగడి వద్ద దోమలవంపు ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను మనస్తాపంతో చనిపోతున్నానంటూ మృతుడు మల్కప్ప ముందుగా తన కుటంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని.. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని పెట్టిన వాయిస్ మెసేజ్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు? కుల్కచర్ల: మండల పరిధిలోని ఇప్పాయిపల్లిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు విచారణ వేగవంతమైంది. గ్రామానికి చెందిన నర్సమ్మ మెడలోంచి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు లాక్కిళ్లిన ఘటనలో బాధితురాలి మెడకు గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న విషయం తెలిసిందే. కేసు విచారణ భాగంగా రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలు సోమవారం తిర్మలాపూర్‌కు చెందిన ఒకరు, ఇప్పాయిపల్లికి చెందిన ఇద్దరు అనుమానితుల్ని అదుపులో కి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే చైన్ స్నాచింగ్ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా..? ఉద్దేశ పూర్వకంగా దాడి చేశారా..? అనేది బాధితురాలు తేరుకుంటేనే తేలుతుంది. -
ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు
అనంతగిరి: ౖరెతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తేమ లేని వడ్లను మిల్లులకు తెచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 11 కేంద్రాలు సన్న రకం వడ్ల కోసం, 117 దొడ్డు రకాలు కొనుగోలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 1,90,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వరి, 10,000 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో ధ్యానం కొనుగోలుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ధరలు, తేమ శాతం తదితర వివరాలు పొందుపరచాలని ఆదేశించారు. కేంద్రాల్లో తేమ శాతం కొలిచే పరికరాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులకు తాగునీటి వసతి ఉండేలా చూసుకోవాలన్నారు. చెక్ పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లయ్ సిబ్బందిని నియమించి పొరుగు రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా చూడాలన్నారు. ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి ఏ రోజు ధాన్యం తేవాలో చెప్పాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. నాణ్యమైన సీఎంఆర్ రైస్‌ను అందజేయాలని మిల్లర్లకు సూచించారు. 2023–24 సంవత్సరం రబీకి సంబంధించిన బియ్యాన్ని కూడా వెంటనే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ మోహన్‌బాబు, సివిల్ సప్లయ్ డీఎం వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, బాలేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
కుల్కచర్ల: విద్యుదాఘాతంతో కౌలు మృతిచెందిన సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లికి చెందిన కుమ్మరి చిన్నస్వామి(74) తన పొలంతో పాటు ముజాహిద్పూర్ గ్రామంలో మరింకొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లి తిరిగిరాలేదు. అతడి భార్య పార్వతమ్మ విషయా న్ని కొడుకు వెంకటేశ్‌కు చెప్పింది. దీంతో చేను వద్దకు వెళ్లి చూడగా.. స్టార్టర్ డబ్బా వద్ద వరి పొలంలో పడిపోయి మృతిచెందాడు. బల్బ్ వెలిగించేందుకు తీగలు పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ధైర్యం చెప్పారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందజేశారు. బాటకు అడ్డంగా కంపవేశారని కేసు కొందుర్గు: బాటకు అడ్డంగా కంపచెట్లు వేశారని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన ప్రకారం.. టేకులపల్లి గ్రామానికి చెందిన బేగరి రాజు, మహేష్, లక్ష్మయ్య, పాండు ఈ నెల 5న గ్రామం నుంచి ఉత్తరాసిపల్లి మార్గంలో గ్రామం నుంచి షాబాద్ వెళ్లే దారికి అడ్డంగా ముళ్ల కంప వేశారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మల్లేష్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా పొలానికి వెళ్లే బాటను కొందరు వ్యక్తులు ఆక్రమించి బాటను బంద్ చేశారని, ఈ విషయమై తాము తహసీల్దార్, ఆర్డీఓకు విన్నవించుకున్నా పలితంలేక కంపచెట్లు వేశామని, ఇలాగైనా తమ సమస్య తీర్చుతారేమోనని ఆశించి బాటకు అడ్డంగా ముళ్లకంపను వేశామని నిందితులు రాజు తెలిపారు. -
కుల వివక్షపై ప్రత్యక్ష పోరాటం
బషీరాబాద్: ఆధునిక సమాజంలోనూ మితిమీరుతున్న కులవివక్షపై పోరాటానికి దళిత వర్గాలు సిద్ధమవ్వాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో దళిత సంఘాలతో కలిసి పూలే, అంబేడ్కర్ జనజాతర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్కయ్య మాట్లాడుతూ.. దేశంలో కులవివక్ష పెరిగిపోతుందన్నారు. భారత రాజ్యంగంలోని 14, 15 ఆర్టికల్స్ కులవివక్ష, అంటరానితనాన్ని నిషేధించించాయని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు అమానుష ఘటనలను నిరోధించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణ కులవివక్ష కోసం ప్రజా సంఘాలు, దళిత మేధావులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 11 పూలే జయంతి మొదలు అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు గ్రామ సభలు నిర్వహించి దళిత వర్గాలను సంఘటితం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సంజీవ్ కుమార్, కమలకుమార్, ఎడ్ల సురేశ్, శ్యామప్ప, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు గ్రామ సభలు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
● చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు ● పుట్ట మన్నుతెచ్చి హోమగుండాల ఏర్పాటు ● విశ్వక్సేనుడి ఆరాధనతో ఉత్సవాలను ప్రారంభించిన అర్చకులు మొయినాబాద్: కలియుగదైవం.. చిలుకూరు బాలా జీ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు.. వేద మంత్రోచ్ఛరణతో దేవాలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పుట్ట బంగారం (పుట్టమన్ను) తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు. అందులో నవధాన్యాలు, పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. తరువాత విశ్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 7గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు సాగాయి. పూజా కార్యక్రమాలు కిరణాచారి, రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి, కృష్ణమూర్తి, అనిల్ పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణంబ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు ధ్వజారోహణం, శేషవాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి గరుడ పఠాన్ని ఆరోహణం చేస్తారు. ఈసారి గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని.. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పష్టం చేశారు.