
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
చేవెళ్ల: సొంతూరుకు వెళ్తానని బయలుదేరిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలం మక్తగూడ గ్రామానికి చెందిన బుత్తుల వెంకటయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలంగా చేవెళ్లలో నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో సొంతూరు మక్తగూడకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. తరువాత అతని భార్య శ్రీలత ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మక్తగూడకు వెళ్లి ఉండవచ్చని భావించి బుధవారం రాత్రి శ్రీలత తన అత్తకు ఫోన్ చేసింది. ఆయన అక్కడికి వెళ్లలేడని తెలిసి గురువారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
హీమోఫిలియానిర్మూలనకు కృషి
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి
షాద్‌నగర్: ప్రతిఒక్కరూ హీమోఫిలియా నిర్మూలనకు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ప్రపంచ హెమోఫిలియా దినోత్సవాన్ని పురస్కరించుకొని చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ... హీమో ఫిలియా అనేది వంశపారపర్యంగా వస్తుందని, ఇది రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. మగవారిలో
చిన్నచిన్న గాయాలై రక్తస్రావం కారణంగా మరణానికి కారణం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు జగదీష్, సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డీపీఎంఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు చంద్రకళ, శ్రీరామ, అమృత, ల్యాబ్ టెక్నీషియన్ శివ, గౌస్, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణ సమీపంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డాక్టర్ నీతాపోలే ఆధ్వర్యంలో ప్రపంచ హెమోఫిలియా దినోత్సవాన్ని నిర్వహించారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు