
రజతోత్సవ సభ విజయవంతం చేయాలి
బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు రహీస్‌అహ్మద్‌ఖాన్
పూడూరు: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాల బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు రహీస్‌అహ్మద్‌ఖాన్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో సభ జరగనుందని తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులపై ఉందన్నారు.
వరంగల్ సభకు ప్రత్యేక బస్సులు
ధారూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి
ధారూరు: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం వరంగల్‌లోని ఎల్కతుర్తిలో జరుగున్న బహిరంగ సభకు మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ మండల అధ్యక్షుడు పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేరెళ్లి, అల్లిపూర్, గట్టెపల్లి, కుక్కింద, నాగసమందర్, మున్నూరుసోమారం, మోమిన్‌కలాన్, తరిగోపుల, నాగారం, పీసీఎం తండా దోర్నాల్ గ్రామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని వాటిని వినియోగించుకుని భారీ ఎత్తున తరలిరావాలన్నారు.
రజతోత్సవానికి తరలిరండి
కోట్‌పల్లి మండల అధ్యక్షుడు అనిల్
బంట్వారం: బీఆర్‌ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ కోట్‌పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్ శనివారం పిలుపునిచ్చారు. సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.
29 గ్రామాల్లో బస్సులు
మర్పల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
మర్పల్లి: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఆదివారం భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వరంగల్‌లో నిర్వహించే సభకు మండల పరిధిలోని 29 పంచాయతీల్లో బస్‌లు ఏర్పాటు చేశామని కేసీఆర్ అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మర్పల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మధూకర్, మాజీ ఎంపీపీ రమేష్, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, రాచన్న, రమేష్ మిత్ర, మర్పల్లి టౌన్ ప్రెసిడెంట్ గఫార్, మార్కెట్ కమిటీ మాజీ డైరక్టర్ గౌస్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామస్తాపూర్ మాజీ సర్పంచ్ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారత్ సమ్మిట్‌లో పరిగి ఎమ్మెల్యే
పరిగి: నగరంలోని హైటెక్‌సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 150 దేశాల 400 మంది ప్రతినిధులతో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో శనివారం ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్‌సర్టెయిన్ టైమ్స్ అనే అంశంపై ఎమ్మెల్యే వక్తగా మాట్లాడారు. అనంతరం వివిధ దేశాలతో ఒప్పందాలు, సత్సంబంధాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులతో కలిసి వీక్షించారు.
మే 20న దేశవ్యాప్త సమ్మె
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ
పరిగి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన పట్టణ కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభ విజయవంతం చేయాలి

రజతోత్సవ సభ విజయవంతం చేయాలి

రజతోత్సవ సభ విజయవంతం చేయాలి