
కేసులు పెండింగ్‌లో ఉంచొద్దు
ఎస్పీ నారాయణరెడ్డి
అనంతగిరి: కేసులు పెండింగ్ లేకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పీఎస్‌ల వారీగా నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేసును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. దొంగతనాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
వాహనాల విడిభాగాలకు వేలం
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన వాహనాల పాత టైర్లు, ట్యూబ్‌లు, బ్యాటరీలు, ఇతర విడి భాగాలకు బహిరంగ వేలం నిర్వహించారు.