
భూ భారతితో రైతులకు మేలు
దుద్యాల్: భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, అన్ని రకాల భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శనివారం దుద్యాల్‌లో కొత్త చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధరణి చట్టంలో భూ సమస్యలకు పరిష్కారం లభించేది కాదన్నారు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన భూ భారతి చట్టం ధరణి కంటే వెయ్యి రెట్ల మెరుగైన పథకమని పేర్కొన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం దాదాపు 15 వేల దరఖాస్తులు వచ్చాయని.. వాటిని 5 వేలకు తెచ్చామని వివరించారు. మిగిలిన వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కోర్డు పరిధిలోని సమస్యలను మినహా మిగతా అన్నింటినీ పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జూన్ 2 నుంచి కొత్త చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతరం దుద్యాల్‌లో నిర్మాణ దశలో ఉన్న మండల సమీకృత భవనాలను కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో పంచాయత్ రాజ్ డీఈ సుదర్శన్ రావ్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ మహేశ్‌కుమార్, డీటీ వీరేశ్‌బాబు, ఆర్‌ఐ నవీన్, వ్యవసాయ శాఖ మండల అధికారి నాగరాజు, ఎంపీఓ సత్యనారాయణ, ఏఈవోలు రేణుక, జ్యోతి, మాణికేశ్వరి, భావన, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్, జిలా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు ఖలీల్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవినాయక్, నాయకులు ఖాజా, శ్రీశైలంగౌడ్, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ రద్దు చేయండి
ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్ల భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని మండల పరిధిలోని ఆలేడ్ గ్రామస్తులు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కోరారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన నర్సింహారెడ్డికి సంబంధించిన 377 సర్వే నంబర్‌లోని 22 గుంటల భూమిలో ఇళ్లు, పశువుల షెడ్డు, బొందల గడ్డకు దారి ఉంది. గ్రామానికి చెందిన దత్తురెడ్డికి సంబందించిన 378 సర్వే నంబర్‌లో 12 ఎకరాల భూమిలో పూర్వం నుంచి ఇళ్లు, పశువుల షెడ్లు, పాఠశాల భవనం ఉంది. ఈ భూమిని నర్సింహారెడ్డి, దత్తురెడ్డి పూర్వీకులు గ్రామస్తులకు ధృవపత్రాలు ఇచ్చి అమ్మారు. ప్రస్తుతం వారి భూములను ఒకరి భూమి మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న తాము నాలుగు రోజుల క్రితం తహసీల్దార్‌కు పిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ నిలిపివేశారని కలెక్టర్ వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం ఆరెండు సర్వే నంబర్ల భూముల రిజిస్ట్రేషన్ హోల్డ్‌లో ఉంచాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. గ్రామంలోని బొందల గడ్డకు వెళ్లే దారిలో సీసీ రోడ్డు వేయించాలని సూచించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో అనంతయ్య, నర్సింలు గౌడ్, నారాయణ గౌడ్, శ్రీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ, ఆశప్ప, ఆంజనేయులు, ఆనంద్, రాజు, మల్లేశ్, అనిల్ గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, పాండు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మహేశ్, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారం
దౌల్తాబాద్: సాదాబైనామాలపై కొనుగోలు చేసిన భూములకు భూ భారతితో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శనివారం దౌల్తా బాద్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతు లు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం ఇచ్చా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టంతో భూ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్‌ఓఆర్, మార్పులు చేర్పులు, సాదాబైనామాల వంటి సేవ లు సులభతరం అవుతాయన్నారు. ప్రజలు ప్రభు త్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. తహసీల్దార్ వద్ద సమ స్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ దశ లో ఉన్న గ్రంథాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్‌కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దారు గాయత్రి, ఎంపీడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం
ధరణి కంటే వెయ్యి రెట్ల మెరుగైన పథకం
కలెక్టర్ ప్రతీక్ జైన్