
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా.. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 51 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండలాల తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
ప్రజావాణికి 51 ఫిర్యాదులు