పెంచిన ధరలను తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెంచిన ధరలను తగ్గించాలి

Apr 12 2025 8:53 AM | Updated on Apr 12 2025 8:53 AM

పెంచిన ధరలను తగ్గించాలి

పెంచిన ధరలను తగ్గించాలి

పూడూరు: కేంద్రం పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేఖంగా మన్నెగూడ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 2024 నుంచి తగ్గాయని, ఇటీవలి కాలంలో అవి మరింత తగ్గాయని కానీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్‌ పై రూ.50 పెంచడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు ప్రసాద్‌, విజయ్‌, అనంతయ్య, రాములు, పాండు, వెంకట్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement