
స్థానిక పోరుకు సిద్ధం కావాలి
అనంతగిరి: కేంద్రం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందరెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం అటల్‌జీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పార్టీ క్రియశీల సభ్యుల సమావేశం వికారాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై మనం చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శివరాజుగౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్‌రెడ్డి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ బస్వలింగం, మాజీ మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందరెడ్డి