
విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం
అనంతగిరి: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం తెలిపారు. ఆదివారం వికారాబాద్‌లో సంఘం 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాము లు, ఉపాధ్యక్షుడు నర్సింలు, కార్యదర్శులు నీలమ్మ, పవన్‌కుమార్, రత్నం, బసప్ప, ము త్యప్ప, జి.రాములు, తిరుపతి, అజయ్, శివ ప్ప, రాంచంద్రయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.
దేశానికి పేరు తెండి
అనంతగిరి: ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన యువకులు పుట్టిన ఊరుకు.. దేశానికి మంచి పేరు తేవాలని ఎంపీడీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీడీవో సత్తయ్య పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్‌లోని గాంధీ కాలనీలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ధారూరు మండలం తరిగోపుల గ్రామానికి చెందిన మోగిలేష్ కుమారులు విష్ణు, శివ ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడంతో సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనప్రాంతం నుంచి ఇద్దరు కుర్మ బిడ్డలు ఆర్మీకి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి సేవ చేసే భాగ్యం వారికి లభించిందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు గోపాల్, శివప్రసాద్, శ్రీశైలం, బుచ్చయ్య, నర్సింలు, శ్రీను, ల్యాబ్ నర్సింలు, రాములు, మాదవ్, సంధ్య, మహేష్ పాల్గొన్నారు.
చేనేత హస్తకళలను ప్రోత్సహించాలి
అనంతగిరి: చేనేత హస్తకళలను ప్రోత్సహించాలని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్‌కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఫతేగార్డెన్‌లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, ఇతర వస్తువులను పరిశీలించారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు
పరిగి: పట్టణంలోని సాయిబాబా ధ్యాన మందిరం 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు ఆటపాటలు, కోలాటంతో సందడి చేశారు. వేడుకల్లో ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఽ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
విద్యారంగ పరిరక్షణకు కృషి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యారంగం అభివృద్ధి, పరిరక్షణ కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య పేర్కొన్నారు. సంఘం 12వ ఆవిర్భావ వేడుకలను ఆదివారం మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించారు.

విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం

విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం

విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం