అనుమతుల పేరిట అడ్డగోలు ఇసుక రవాణా
యాలాల: అనుమతుల పేరిట తీసుకున్న ఇసుక రవాణాను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో యాలాల గ్రామస్తులు మండిపడుతున్నారు. బుధవారం గోవిందరావుపేట నుంచి తాండూరుకు ఇసుక తరలింపునకు యాలాల రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు. కాగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కో ట్రాక్టరుకు నిర్దేషించి ట్రిప్పులను వివరిస్తూ అనుమతి పత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో అనుమతులు పొందిన ఇసుక ట్రాక్టర్లు ఉదయం 7 గంటలకే కాగ్నా వాగులోకి వెళుతున్నాయని, సాయంత్రం 7గంటల వరకు ఇసుక రవాణా చేస్తున్నారని యాలాల మాజీ ఉపసర్పంచ్ గొల్ల శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయమై యాలాల తహసీల్దార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఇసుక రవాణా విషయంలో రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
అధికారుల తీరుపై
మండిపడుతున్న గ్రామస్తులు


