
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఎన్‌టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గాలని, అయినా కేంద్రం ఒకేసారి సిలిండర్‌పై రూ.50 పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో గ్యాస్ వినియోగాదారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దీంతో నిత్యావసరాల ధరలపై కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే ధరలను తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, నవీన్, శ్రీనివాస్, యాదయ్య, జంగయ్య, రాములు, వెంకట్, వెంకటయ్య, గోపాల్, అలివేలు, అంజియ్య తదితరులు పాల్గొన్నారు.
సామాన్యులపై భారం
దుద్యాల్: కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ప్రజలపై భారం వేస్తూనే ఉందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య ఆరోపించారు. వంట గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచడంపై బుధవారం దుద్యాల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర సరకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని అన్నారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లయ్య. శ్రీనివాస్, వెంకటయ్య, రాములమ్మ, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్