మూన్‌వాకర్ వంశీపై డాక్యుమెంటరీ
త్వరలో ఇండియా టీవీ చానల్‌లో ప్రసారం
తాండూరు టౌన్: తాండూరు పట్టణానికి చెందిన మూన్‌వాకర్ వంశీకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో ఇండియా టీవీ చానల్‌లో ఆయన డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దివంగత ప్రముఖ డాన్సర్ మైఖేల్ జాక్సన్ మూన్ వాక్ రికార్డును బద్ధలు కొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇండియా టీవీ ఆధ్వర్యంలో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రను ఆరు నిమిషాల పాటు డాక్యుమెంటరీ రూపంలో ఇవ్వనున్నారు. ఈ మేరకు వంశీకృష్ణకు సదరు చానల్ నుంచి మెయిల్ ద్వారా సందేశం అందింది. ఈ అరుదైన అవకాశం తాండూరు వాసికి దక్కినందుకు పలువురు ఆయనను అభినందించారు.


