
నేడు ధారూరుకు చేవెళ్ల ఎంపీ కొండా రాక
ధారూరు: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం మండలంలో పర్యటించనున్నట్లు బీజేపీ వికారాబాద్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ వడ్లనందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులు, ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు. మండలంలోని నాగారం, స్టేషన్‌ధారూరు, ధారూరు, రుద్రారం, అల్లీపూర్ గ్రామాల్లో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కలెక్టరేట్ గదిలో మంటలు
అనంతగిరి: వికారాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం టీ ఫైబర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సిబ్బంది వెళ్లి చూడగా యూపీఎస్, బ్యాటరీలు కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చిమంటలు ఆర్పేశారు. అయితే సాయంత్రం వీచిన ఈదురు గాలుల కారణంగా కరెంటు పలుమార్లు వచ్చిపోవడంతోనే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కలెక్టరేట్ నెట్‌కు, కరెంట్‌కు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆఫీసులోనే ఉండటంతో సదరు గదిని పరిశీలించారు.