
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి!
భానుడి ప్రతాపంతో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోతగా ఉంటోందని కొందరు చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎండలో పని చేయడానికి కూలీలు సైతం జంకుతున్నారు. అందుకే పని చేసే చోట పెద్దపెద్ద గొడుగులు ఏర్పాటు చేసుకుని ఎండనుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో కూలీలు గొడుగు ఏర్పాటు చేసుకుని ఓ ఇంటి నిర్మాణానికి గుంతను తీస్తున్నారు. మరో వైపు మహిళలు ఎండ తీవ్రతను చెట్ల కింద సేదతీరుతున్నారు. – దుద్యాల్
వామ్మో.. మురుగు!
దుద్యాల్: మండల కేంద్రంలోని పదోవార్డులో ఇళ్ల మధ్య మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇళ్ల మధ్య మురుగునీరు చేరడంతో అక్కడ దోమలు విజృంభిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రయితే చాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నిద్రకు దూరమవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తునారు.
ఇళ్ల మధ్య చేరిన నీరు
విజృంభిస్తున్న దోమలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
కాలనీ వాసులు
పట్టించుకోని అధికారులు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి!