
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కుల్కచర్ల: ప్రతిఒక్కరూ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ మేనేజర్ పార్వతి పేర్కొన్నారు. బుధవారం చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలోని ఎస్‌బీఐ ఎదుట కళాజాత నిర్వహించారు. సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, తదితర బ్యాంకింగ్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించొద్దన్నారు. మీకు లోన్ ఇస్తామని అందుకు కొంత డబ్బులు అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుందని, మీ నంబర్ లక్కీడ్రాలో ఎంపిక అయ్యిందని వివిధ మోసపూరిత మాటలతో నమ్మబలికేవిధంగా మాట్లాడితే అలాంటి ఫోన్ కాల్స్‌కి సమాధానమియొద్దన్నారు. మోసపూరితమైన మాటలు నమ్మితే ఆర్థికంగా నష్టపోతారని హెచ్చరించారు. ఏదైనా అనుమానం ఉంటే బ్యాంకుకు వచ్చి తమతమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింహా రెడ్డి, కిరణ్‌కుమార్, సత్యకుమార్, కటికె శ్రీనివాస్‌లు, కృష్ణచారి, నర్సింలు, సత్యం, విజయ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.