
పోగొట్టుకున్న బంగారం రికవరీ
కేశంపేట: శుభకార్యంలో జరిగిన గొడవలో బంగారం పోగుట్టకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి పోగుట్టుకున్న బంగారు ఆభరణాన్ని రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. వివరాలు.. మండల పరిధిలోని సంతాపూర్‌కు చెందిన గుండేటి నర్సింహ సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌లో నిర్వహిస్తున్న శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ బంధువులతో జరిగిన గొడవలో తన రెండు తులాల బ్రాస్‌లెట్ పోగొట్టుకున్నాడు. మంగళవారం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కానిస్టేబుల్ అశోక్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సీసీ కెమెరాలను పరిశీలించాడు. బంగారం తీసుకున్న వ్యక్తిని గుర్తించి అతడి వద్ద నుంచి రికవరీ చేశారు. సీఐ నరహరి, ఎస్‌ఐ రాజ్‌కుమార్ బాధితుడికి రికవరీ చేసిన బ్రాస్‌లెట్ అప్పగించారు.