
భక్తిశ్రద్ధలతో ఉర్సు ఉత్సవాలు
దోమ: మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో రెండు రోజులుగా సయ్యద్ మౌల మఖూమ్ హుస్సేన్ (ఉర్సు) ఉత్సవాలను నిర్వహకులు సిరాజుద్దీన్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం చందన పూజ, గంధం ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను నిర్వాహకులు శాలువ, పూవ్వుల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, యాదయ్యగౌడ్, రాంచంద్రారెడ్డి, బాబర్, అంతిరెడ్డి, సురేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దిర్సంపల్లిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి. షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోందని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.