మహనీయుల ఆశయాలను సాధిద్దాం
అనంతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తోందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కేఎస్ రత్నం అన్నారు. పార్టీ పిలుపు మేరకు అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా ఆదివారం అంబేడ్కర్ చైతన్య యాత్ర నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయన జీవితం అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సాయిచరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం


