పిడుగుపాటుకు పాడి ఆవులు మృత్యువాత
కుల్కచర్ల: పిడుగుపాటుకు రెండు పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చౌడాపూర్ మండలం టాక్య్రానాయక్ తండాలో చోటుచేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన ముడావత్ పార్వతమ్మ తనకున్న రెండు ఆవులను రోజు మాదిరిగానే పొలంవద్ద కట్టేసి ఇంటికి వచ్చింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి అకస్మాత్తుగా పిడుగుపడడంతో అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన ఆవుల విలువ సుమారు రూ.1.50లక్షలు ఉంటుందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.
ఇప్పాయిపల్లిలో
కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల రవీందర్ ఇంటి ఎదుట ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగుపడటంతో మంటలు చెలరేగాయి. పైభాగంగా పూర్తిగా కాళిపోయింది. పచ్చనిచెట్టు మంటలు చెలరేగి కొమ్మలు బొగ్గులుగా కిందపడుతుండడంతో ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
పిడుగుపాటుకు పాడి ఆవులు మృత్యువాత


