భూ భారతితో సమస్యలు పరిష్కారం
కొడంగల్: భూ భారతితో సమస్యలు పరిష్కారం అవుతాయని మండల వ్యవసాయాధికారి తులసి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పర్సాపూర్ రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు వీక్షించారు. భూ పరిపాలనలో ఒక నూతన శకానికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ వంటి సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పారదర్శకంగా జవాబుదారీగా అవినీతి రహితంగా సేవలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మేలు
మోమిన్‌పేట: భూ భారతితో రైతులకు మేలు చేకూరుతుందని మర్పల్లి మార్కెటు కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన భూ భారతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో పాలక వర్గ సభ్యులు వీక్షించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందుల పాలయ్యారన్నారు. రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశ పెట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు, ఏఓ జయశంకర్, ఏఈఓ పెంటయ్య, శ్రీనివాస్ ఉన్నారు.
మండల వ్యవసాయాధికారి తులసి
భూ భారతితో సమస్యలు పరిష్కారం


