కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
మర్పల్లి: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రూ.22 కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొంషెట్‌పల్లిలో అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శిలాఫలకం వేశారు. అనంతరం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా మర్పల్లి మండలంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. 17 జీపీల్లో రూ.5.63 కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు.
మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా
మర్పల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ హామీ ఇచ్చారు. మార్కెట్ రోడ్డు నుంచి ఎస్టీ ఆశ్రమ గురుకుల పాఠశాల వరకు రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మార్కెట్ చైర్మన్ మహేందర్‌రెడ్డితో కలిసి శిలాఫలకం వేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునీరొద్దీన్, ఎంపీడీఓ రాజ్‌మల్లయ్య, ఈఓ పీఆర్‌డీ లక్ష్మీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్, పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్, సుభాష్ యాదవ్, బ్లాక్ –2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు ఖలిమొద్దీన్, శంకరయ్యగౌడ్, నాగేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
మండలంలో సుడిగాలి పర్యటన
వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు


