
జాతీయ రహదారిపై కూలిన చెట్టు
చేవెళ్ల: ఈదురుగాలులతో కూడిన వర్షానికి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మర్రిచెట్టు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో మండలంలోని మీర్జాపుర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద మర్రిచెట్టు కూలింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో ఇరువైపులా కిలోమీటర్‌కుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
భారీగా ట్రాఫిక్ జాం