అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేద్దాం
తాండూరు టౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాల శుచి, శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. పాత తాండూరు, బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, విగ్రహానికి జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన హక్కులను ప్రసాదించిన మహనీయుడు అంబేడ్కరుడని కొనియాడారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేడు దళిత, ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, కార్యదర్శి భద్రేశ్వర్, అధికార ప్రతినిధి వెంకట్, పట్టణాధ్యక్షుడు మల్లేశం, పటేల్ విజయ్, సాయిరెడ్డి శ్రీకాంత్, బాలప్ప, రజినీకాంత్, దోమ కృష్ణ, కిరణ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్


