కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి
పరిగి: రాష్ట్ర ప్రజలకు కేంద్రం అందిస్తున్న సంక్షేమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి సూచించారు. గురువారం పట్టణ కేంద్రంలో పార్టీ క్రియాశీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం వాటా ఉందన్నారు. వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాలను ప్రతి పల్లెలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. అందులో భాగంగా గావ్ చలో గల్ చలో కార్యక్రమం ఉంటుందన్నారు. పార్టీ ఇచ్చినటువంటి తొమ్మది కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రామంలో స్వచ్ఛ భారత్, దళితవాడలో భోజనం, మాజీ సైనికులకు సన్మానం, వివిధ కుల పెద్దలను కలవడం, జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేయడం, డా.బీఆర్.అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు హరికృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి


