
● రోడ్లపైనే వాహనాల పార్కింగ్
పరిగి: పరిగి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపైనే వాహనాలను నిలుపుతుండటంతో పాదచారులు, తోటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థ లేదు. పరిగి పట్టణానికి నిత్యం పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మార్కెట్ రోడ్లు నిత్యం వాహనాలతో కిటకిటలాడుతుంటాయి. గంజ్‌రోడ్డు, బహార్‌పేట్ మార్కెట్ రోడ్డు, కొడంగల్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి శుక్ర, శనివారాల్లో వారంతపు సంతలు జరుగుతుంటాయి.. ఈ సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.