
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
దోమ: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లిలో కాళికామాత జాతర మహోత్సవాలకు హాజరయ్యా రు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్మాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు వెంకటేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాంరెడ్డి, ఓబీసీ మోర్చా కన్వీనర్ విజయ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మహేశ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్, నేతలు నరేశ్, నాగేంద్రం, చంద్రశేఖర్, సంతోష్, ధనుంజయ్, ప్రశాంత్, పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప