
బ్యాంక్ సేవలను విస్తరిస్తాం
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ● లక్ష్మీనారాయణపూర్‌లోహెచ్‌డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభం
యాలాల: మారుమూల ప్రాంతాల రైతులకు సైతం హెచ్‌డీసీసీబీ సేవలు అందేలా చూస్తామనిఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌లో హెచ్‌డీసీసీబీ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇక్కడ బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు గుర్తుచేశారు. రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని సొసైటీల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 నాటికి డీసీసీబీ టర్నోవర్ రూ.600 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు చేరిందన్నారు. సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగుల భద్రత కోసం పోరాటం చేసి జీఓ 44ను సాధించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. సొసైటీల ఆధ్వర్యంలో గోదాంలు, రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు, ఫంక్షన్ హాళ్లు తదితర వాటికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. లక్ష్మీనారాయణపూర్ బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరో మూడు శాఖల ఏర్పాటుకు కృషి
హెచ్‌డీసీసీబీ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో మరో మూడు బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బషీరాబాద్, పెద్దేముల్, కరణ్‌కోట గ్రామాల్లో కొత్తగా శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్యయ్య, మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, డైరెక్టర్లు రాజు, మొగులయ్య, వెంకటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భీమప్ప, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్ బాబా, నాయకులు సత్యనారాయణరెడ్డి, రఘు, లక్ష్మీకాంత్‌రెడ్డి, బ్యాంక్ మేనేజర్లు మనోహర్‌రావు, తిరుపతయ్య, అసిస్టెంట్ మేనేజర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.