మత్తు పదార్థాల నిర్మూలన మన బాధ్యత
అనంతగిరి: మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎకై ్సజ్, విద్యాశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లా కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రైలు, రోడ్డు మార్గాల్లో గంజాయి రవాణా చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖలకు సూచించారు. అనంతరం ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, డీవైఎస్‌ఓ హనుమంతరావు, అటవీ శాఖ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్, ఆర్‌టీఓ వెంకట్‌రెడ్డి, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి శంకర్ నాయక్, డీపీఓ జయసుధ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి


