
స్మార్ట్ పంచాయతీ చీమల్‌దరి
● కేంద్ర టెలి కమ్యూనికేషన్ కార్యదర్శి నీరజ్ మిట్టల్
మోమిన్‌పేట: పట్టణాల్లో ఉన్న టెలి కమ్యూనికేషన్ పరిజ్ఞానాన్ని పల్లెలో కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి అవసరం ఉందని కేంద్ర టెలికమ్యూనికేషన్ కార్యదర్శి నీరజ్ మిట్టల్ అన్నారు. చీమల్‌దరి గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ గ్రామంలో టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షానలభై వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. చీమల్‌దరిలో వైఫై అందుబాటులో ఉందని, పట్టణాల్లో ఉన్న టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ఈ గ్రామంలో ఉందని తెలిపారు. ఆధార్ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారని, ఇలాంటి మరెన్నో స్మార్ట్ జీపీలను తయారు చేయాలని ఆయన సూచించారు. చీమల్‌దరి గ్రామం అన్నిరకాలు అభివృద్ది చెందిందని తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ బోధనలను పరిశీలించారు. ఆయన వెంట ప్రత్యేక డీజీటీ ప్రశాంత్ ఆర్.పాటిల్, తెలంగాణ టెలి కమ్యూనికేషన్ సీజీఎం జి.రత్నకుమార్, పీజీఎం చంద్రశేఖర్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ మనోహర్‌చక్రవర్తి, ఆర్‌ఐ గోవర్ధన్, కార్యదర్శి భరత్‌కుమార్ ఉన్నారు.