‘ఫ్యూచర్’తో ఉద్యోగావకాశాలు
యాచారం: కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తుండడంతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. అమెజాన్ సంస్థ గునుగల్ ఆదర్శ కళాశాల, పాఠశాలను దత్తత తీసుకుని రూ.కోటిన్నరకు పైగా నిధులతో కిచెన్, భోజనశాల అలాగే గదులకు పెయింటింగ్ తదితర అభివృద్ధి పనులను చేపట్టింది. బుధవారం వాటిని ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేసి ఫోర్త్‌సిటీ(ఫ్యూచర్)ని నిర్మిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఇక్కడ రూ.లక్ష 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఫ్యూచర్‌సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని నిర్మిస్తుందని తెలిపారు. అమెజాన్ సంస్థ ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అమెజాన్ సంస్థ ప్రతినిధులు ఓంకార్, ట్రెలర్, పార్ధసారథి, ఆదర్శ కళాశాల, పాఠశాలల అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌చారి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, గునుగల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటుకు కృషి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తులేకలాన్ గ్రామంలో అమెజాన్ సహకారంతో నూతన గ్రంథాలయం నిర్మాణం కోసం ఎమ్మెల్యే రంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూధన్‌రెడ్డిలు కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న పోటీ ప్రపంచంలో చదువులు విలువై పోయాయన్నారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, మాజీ సర్పంచ్ సమతరాంరెడ్డి, నాయకులు శశాంక్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పాండు, మహేందర్, విజయ్, శివ, ప్రభు, సంజీవ, శ్రీను, చింటురెడ్డి, మల్లేష్, బీరప్ప, దాసు, శంకర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
అమెజాన్ సంస్థ సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


