
ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోరా?
పరిగి: ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై అక్రమంగా పిల్లర్ ఏర్పాటు చేస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరించడం గమనార్హం. నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి కట్టడం చేపట్టిన చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. పట్టణ కేంద్రంలోని బహార్‌పేట్‌లోని కొత్తగా ఏర్పాటు చేస్తున్న హెచ్‌డీఎఫ్ బ్యాంకు ఎదుట ఇంటి యజమాని అక్రమంగా ఫుట్‌పాత్‌ను ఆక్రమించి పిల్లర్‌ను ఏర్పాటు చేశారు. పాదచారులు నడవాల్సిన స్థలంలో పిల్లర్‌ని ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు సెట్‌బ్యాక్ తీసుకోకపోతే పనులను ఆపివేసే మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అక్రమనిర్మాణాలపై ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.