
బైక్‌ను తప్పించబోయి..
పరిగి: బైక్‌ను తప్పించబోయి టవేరా వాహనం స్కూటీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలో సయ్యాద్‌మల్కాపూర్ దగ్గర శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పూడూర్ మండలం చెంచుపల్లి గ్రామానికి చెందిన తిరుమలయ్యతో పాటు 11మంది కుటుంబీకులు టవేరా వాహనంలో హన్వాడ మండలంలోని దేవాలయానికి బయలు దేరారు. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన ఈడ్గి గున్నమ్మ(50) ఆమె కుమారుడు శ్రీశైలంగౌడ్ ఇద్దరు స్కూటీపై కుల్కచర్ల మండలంలోని పాంబండ దేవాలయానికి బయలు దేరారు. సయ్యాద్‌మల్కాపూర్ గ్రామ సమీపంలో పెట్రోల్‌బంక్ ముందు వెళ్తున్న బైక్‌ను అతివేగంగా వచ్చిన టవేరా బైక్‌ను తప్పించబోయి స్కూటీని ఢీకొంది. దీంతో టవేరా వాహనం పల్టీ కొడుతూ పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. స్కూటీపై ఉన్న గున్నమ్మకు తీవ్రగాయాలు కాగా, టవేరా వాహనంలోని పది మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానికులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గున్నమ్మకు తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్‌లోని ఈశా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. టవేరా వా హనంలో ఉన్న వైష్ణవ్, ప్రవళ్లిక, శివమణి, ఎల్లమ్మ, వెంకటేష్, తిరుమలయ్య, లక్ష్మీ, శిరీష, అంజమ్మ తోపాటు డ్రైవర్ ప్రసాద్‌లకు గాయాలయ్యాయి. తవేరా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు వాపోయారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
● స్కూటీని ఢీకొన్న టవేరా
● ఒకరు మృతి పలువురికి గాయాలు