సంక్షేమానికి పెద్దపీట
● స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నా రు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశా రు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. వికారాబాద్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ వాసుచంద్ర, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, ఆర్‌టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


