కనుల పండువగా రథోత్సవం
తాండూరు: పట్టణంలో వెలసిన భావిగి భద్రేశ్వరస్వామి జాతరలో భాగంగా శనివారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం పట్టణంలో కలశంతో శోభాయాత్ర నిర్వహించారు. మండలి చీఫ్ విఫ్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్ఠించారు. పూర్ణకుంభం, మహా మంగళ హారతితో రథాన్ని ముందుకు కదిలించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్‌కుమార్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహరాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్‌రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సునితా సంపత్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, మురళీకృష్ణగౌడ్, రమేష్ కుమార్, పట్లోళ్ల నర్సింహులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
అన్నదానం
తాండూరు: తాండూరు భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయ దసోహ భవనంలో శనివారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నదానం ఏర్పాటు చేశారు. జాతరోత్సవాల సందర్భంగా శుభప్రద్‌పటేల్ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాసోహ భవనంలో అన్నదానం ప్రారంభించారు.


