
తండాల అభివృద్ధికి కృషి
తాండూరు రూరల్: నియోజకవర్గంలోని ప్రతి గిరిజన తండాకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.30 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం పెద్దేముల్ మండలం తట్టేపల్లి, ఓంమ్లానాయక్ తండాలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులు, గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కాషాయపార్టీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు గ్రామాలు, తండాల్లో జై బాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
మౌలిక సదుపాయ కల్పనకు కృషి
తెలంగాణ–కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్న ఓంమ్లానాయక్ తండాలో మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ గిరిజన మహిళా నేత సుమిత్ర రాథోడ్ కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి.. తండాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ధారాసింగ్, ప్రోగాం ఇన్ చార్జి షహీం ఖురేషి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, నాయకులు నారాయణరెడ్డి, రియాజ్, ఎల్లారెడ్డి, మల్లేశం, రవి, మహేష్, డీవై నర్సిములు, మధుసూదన్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి